ఆయుష్

ఈశాన్య రాష్ట్రాల్లో ఆయుష్ కు భారీ ప్రోత్సాహం


ఈ ప్రాంతంలో ఆయుర్వేదం, హోమియోపతి ని ప్రోత్సహించడానికి ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించిన
కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్

ఈశాన్య రాష్ట్రాల్లో తొలి పంచకర్మ బ్లాక్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్

ఈశాన్య రాష్ట్రాల్లో ఆయుష్ కోసం తొలి ఫార్మకాలజీ అండ్ బయో కెమిస్ట్రీ ల్యాబ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి

దేశంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్ నెస్ సెంటర్ నిర్మాణానికి గౌహతిలో శంకుస్థాపన చేసిన శ్రీ సోనోవాల్
గౌహతిలో హోమియోపతి రీజనల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన

Posted On: 12 JAN 2024 4:45PM by PIB Hyderabad

 ఈశాన్య భారతదేశంలో ఆయుష్ రంగాన్ని ప్రోత్సహించడానికి నాలుగు ప్రధాన కార్యక్రమాలను కేంద్ర ఆయుష్ మరియు ఓడరేవులు, షిప్పింగ్   జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. ఈశాన్య ప్రాంతంలో తొలిసారిగా కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ (సీఏఆర్ఐ)లో  ఏర్పాటు చేసిన పంచకర్మ బ్లాక్ ను  శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా  అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన  ఫార్మకాలజీ,బయో కెమిస్ట్రీ ల్యాబ్ ను ఆయుష్ మంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు.  

 అజారాలో ఏర్పాటు చేయనున్న రీజినల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ హోమియోపతి (ఆర్ఆర్ఐహెచ్ ) శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి,  ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్ నెస్ సెంటర్ నిర్మాణానికి వర్చువల్ విధానంలో  శ్రీ సర్బానంద సోనోవాల్ శంకుస్థాపన చేశారు.దేశంలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్ నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. 

ఈ సందర్భంగా ఏర్పాటైన  సమావేశంలో ప్రసంగించిన శ్రీ సర్బానంద సోనోవాల్ ఆయుష్ రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు  వివరించారు. "దేశంలో ఆరోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం సంప్రదాయ వైద్య విధానాలను పునరుద్ధరించింది. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, ప్రకృతి వైద్యం, సోవా ఋగ్పాలు వంటి వైద్య విధానాలకు వ్యాధులను నయం చేయగల శక్తి ఉంది. శతాబ్దాల పురాతన చికిత్సలను ఆధునిక వైద్య విధానంలో చేర్చడం అత్యవసరం. దీని ఫలితంగా శక్తివంతమైనసమగ్ర ఆరోగ్య వ్యవస్థ అభివృద్ధి అవుతుంది. దీనివల్ల శారీరక రుగ్మతలు  నయం అవుతాయి.  మానసిక శాంతి లభిస్తుంది. కొత్తగా అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కొత్త పంచకర్మ బ్లాక్, ఆయుష్  అత్యాధునిక ప్రయోగశాలలు ఈ ప్రాంతంలో ఆయుష్ ఆరోగ్య సంరక్షణ చర్యలను ప్రజలకు అందిస్తాయి.దీనివల్ల  అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది." అని మంత్రి అన్నారు. 

రెండు సంవత్సరాల కిందట 2022 ఫిబ్రవరి 12న గౌహతిలోని సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఏఆర్ఐ)లో సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో 'పంచకర్మ బ్లాక్', 'ఫార్మకాలజీ అండ్ బయో కెమిస్ట్రీ ల్యాబ్స్' నిర్మాణానికి  శ్రీ సర్బానంద సోనోవాల్ శంకుస్థాపన చేశారు.ప్రారంభ కార్యక్రమంలో అస్సాం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి కేశబ్ మహంత, గౌహతి ఎంపీ (లోక్ సభ) క్వీన్ ఓజా; ఎమ్మెల్యే (దిస్పూర్) అతుల్ బోరా; ఎమ్మెల్యే (పశ్చిమ గౌహతి) రామేంద్ర నారాయణ్ కలితా , పలువురు ప్రముఖులు, ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, స్థానిక యంత్రాంగం, విద్యార్థులు పాల్గొన్నారు.

సీఏఆర్ఐలో ఏర్పాటైన  ప్రత్యేక పంచకర్మ బ్లాక్ ప్రజలకు సరసమైన ధరలకు ఉత్తమ పంచకర్మ చికిత్సలు అందిస్తుంది. రోగాలను నయం చేయడంలో, ప్రజల జీవన నాణ్యత పెంపొందించడంలో   పంచకర్మ పాత్ర పై  పరిశోధకులు పరిశోధన చేపడతారు.  9453.30 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ నూతన భవనంలో పంచకర్మ చికిత్సల   శాస్త్రీయతను నిర్ధారించడానికి కార్యక్రమాలు అమలు జరుగుతాయి.  ఆయుష్ రంగానికి అవసరమైన  పంచకర్మ సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ పంచకర్మ శిక్షణ కోర్సు కూడా అందిస్తారు. .సమర్థవంతమైన పంచకర్మ చికిత్స కోసం కొత్త పంచకర్మ ద్రోణి, బాష్పా స్వేదన యంత్రం (ఆవిరి గది), నాది స్వేదన యంత్రం, సర్వాంగధర యంత్రం, శిరోధార యంత్రం, బస్తీ యంత్రం, నాస్య అప్లికేషన్, అవగహ టబ్, సౌనా చాంబర్ లాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. రూ.7.72 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో స్నేహ, స్వేదన గది, శిరోధార గది, బస్తీ రూమ్ వంటి కీలక పంచకర్మ చికిత్సలు అందించేందుకు  ప్రత్యేక గదులు ఉన్నాయి. పంచకర్మలో వాడే  క్వాత్ తయారీ, బస్తీ ద్రావ్య తయారీ వంటి మందుల తయారీకి మెడిసిన్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేశారు. పంచకర్మ టెక్నీషియన్ కోర్సు కింద పంచకర్మ టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక తరగతి గదులకు స్థలం కేటాయించారు. సమర్థవంతమైన పంచకర్మ చికిత్స కోసం కొత్త పంచకర్మ ద్రోణి, బాష్పా స్వేదన యంత్రం (ఆవిరి గది), నాది స్వేదన యంత్రం, సర్వాంగధర యంత్రం, శిరోధార యంత్రం, బస్తీ యంత్రం, నాస్య అప్లికేషన్, అవగహ టబ్, సౌనా చాంబర్ లాంటి  కీలక పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లోని ఆయుష్ రంగంలో  తొలిసారిగా ఏర్పాటు చేసిన 'ఫార్మకాలజీ అండ్ బయోకెమిస్ట్రీ లేబొరేటరీస్ 'లో ఆయుర్వేద  ఔషధ ప్రామాణీకరణ, భద్రత, సమర్థత మదింపు కోసం  సౌకర్యాలు ఉన్నాయి. క్లాసికల్ ఆయుర్వేద ఫార్ములేషన్, ఎథ్నో-మెడిసినల్ ప్లాంట్స్, మొక్కల ఆధారిత చికిత్స విధానాలు అభివృద్ధి చేయడానికి, భద్రతా సామర్థ్యాన్ని ఈ ప్రయోగశాలలు శాస్త్రీయంగా దృవీకరిస్తాయి.   ఈశాన్య ప్రాంతంలో లభించే  ఆయుర్వేద మొక్కల నుంచి తక్కువ ఖర్చుతో కూడిన పాలీ హెర్బల్ విధానాలను  అభివృద్ధి చేయడానికి సంస్థ  కృషి చేస్తుంది. రూ.2.71 కోట్లకు పైగా వ్యయంతో   ఈ భవనాన్ని నిర్మించారు. ఆయుర్వేద సూత్రీకరణ, భద్రత , సమర్థత కోసం ప్రీ-క్లినికల్ అధ్యయనాలను నిర్వహించడానికి ఒక ఆధునిక యానిమల్ హౌస్, రోటరీ ఎవాపరేటర్, సాక్స్లెట్ ఎక్స్ట్రాక్ట్, ఆటోమేటిక్ హీమాలజీ అనలైజర్, బయోకెమిస్ట్రీ అనలైజర్, గడ్డకట్టే అనలైజర్, అనాల్జేషియోమీటర్, యువి-విఐఎస్ స్పెక్ట్రోఫోటోమీటర్, ప్రయోగశాల డీప్ ఫ్రీజర్, పెథై మోమీటర్, ఫార్మకాలజీ ల్యాబ్.  వంటి అధునాతన పరికరాలతో అత్యాధునిక   'ఫార్మకాలజీ అండ్ బయోకెమిస్ట్రీ లేబొరేటరీస్ '  జరిగింది. హై పెర్ఫార్మెన్స్ థిన్ లేయర్ క్రోమాటోగ్రఫీ (హెచ్ పీటీఎల్ సీ), హై పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ (హెచ్ పీఎల్ సీ), గ్యాస్ క్రోమాటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రీ (జీసీ-ఎంఎస్ ), ఎక్స్ రే డిఫ్రాక్టోమీటర్ (ఎక్స్ ఆర్ డీ) వంటి ఆధునిక పరికరాలు దీనిలో ఏర్పాటు అయ్యాయి. 3491.62 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.6.42 కోట్లకు పైగా వ్యయంతోనిర్మించిన  నూతన ల్యాబ్ (జీ+2)లో  ఆధునిక యంత్రాలు ఏర్పాటు అయ్యాయి. 

 రీజినల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి (ఆర్ ఆర్ ఐహెచ్ ) కొత్త క్యాంపస్ నిర్మాణం  18,610 చదరపు అడుగుల విస్తీర్ణంలో . రూ.53.89 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు.  2026 నాటికి నిర్మాణం పూర్తవుతుంది.  50 పడకల ఐపీడీ యూనిట్, ఓపీడీ సేవలతో పాటు స్పెషాలిటీ క్లినిక్ లు ఉంటాయి. అత్యాధునిక పరికరాలతో కూడిన క్లినికల్ ల్యాబ్, ఎమర్జెన్సీ యూనిట్ తో పాటు మైనర్ ఆపరేషన్ థియేటర్ ను కూడా నిర్మిస్తారు.  

 దేశంలోనే తొలిసారి నిర్మిస్తున్న  ఇంటిగ్రేటెడ్ ఆయుష్ వెల్ నెస్ సెంటర్ లో ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి విభాగాల్లో చికిత్స, ఓపీడీ సౌకర్యాలు ఉంటాయి. పంచకర్మ, నేచురోపతి, యునానీ, సిద్ధ చికిత్సలను ప్రజలకు  ఈ కేంద్రం అందిస్తుంది. ఈ కేంద్రంలో మూలికా తోటలను కూడా అభివృద్ధి చేస్తారు. 

 

***



(Release ID: 1995734) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi , Assamese