ఆర్థిక మంత్రిత్వ శాఖ
ముంబైలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది
Posted On:
10 JAN 2024 8:06PM by PIB Hyderabad
వైర్లు మరియు కేబుల్స్ ఇతర ఎలక్ట్రికల్ వస్తువుల తయారీకి చెందిన సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ 22.12.2023న సెర్చ్, సీజర్(స్వాధీనం) ఆపరేషన్స్ నిర్వహించింది. పలువురు డిస్ట్రిబ్యూటర్స్ గ్రూపులపై కూడా ఆదాయపుపన్ను శాఖ సోదాలు కొనసాగాయి. ముంబై, పూణే, ఔరంగాబాద్, నాసిక్, డామన్, హలోల్ మరియు ఢిల్లీలోని 50కిపైగా ప్రాంతాల్లో ఆదాయపు పన్నుశాఖ సోదాలు నిర్వహించింది.
సెర్చ్ ఆపరేషన్ సమయంలో పలు పత్రాలు మరియు డిజిటల్ డేటా రూపంలో పెద్ద సంఖ్యలో నేరారోపణకు సంబంధించి సాక్ష్యాలను గుర్తించడంతోపాటు స్వాధీనం చేసుకున్నారు. ఈ సాక్ష్యాలు కొంతమంది అధీకృత పంపిణీదారులతో సహకరిస్తూ సమూహం అనుసరించిన పన్ను ఎగవేత విధానాలను బట్టబయలు చేస్తున్నాయి. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం, ప్రధాన కంపెనీ తన పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించి చూపేందుకు లెక్కలు చూపని నగదు అమ్మకాలు, లెక్కించబడని కొనుగోళ్లకు నగదు చెల్లింపులు, అసలైన రవాణా మరియు సబ్-కాంట్రాక్ట్ ఖర్చులను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించింది.
ఫ్లాగ్‌షిప్ కంపెనీ లెక్కలు చూపని నగదు అమ్మకాలు సుమారు రూ. 1,000 కోట్లు ఖాతాల పుస్తకాల్లో నమోదు కాలేదు. లక్ష రూపాయల కంటే ఎక్కువ లెక్కలు చూపని నగదు చెల్లింపులు ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి. ముడిసరుకు కొనుగోళ్లకు సంబంధించి ఫ్లాగ్‌షిప్ కంపెనీ తరపున డిస్ట్రిబ్యూటర్ చేసిన రూ.400 కోట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా సబ్-కాంట్రాక్ట్ ఖర్చులు, కొనుగోళ్లు మరియు రవాణా ఖర్చులు మొదలైనవాటిలో సుమారు రూ. 100 కోట్లు ఫ్లాగ్‌షిప్ కంపెనీ ప్రాంగణంలో స్వాధీనం చేసుకున్న ఆధారాలలో కూడా గుర్తించబడ్డాయి.
సోదాల ఫలితంగా సరుకుల నిజమైన సరఫరా లేకుండా బిల్లులను జారీ చేయడం కోసం పంపిణీదారు చేపట్టిన వివరించలేని లావాదేవీల నిర్ధారణకు దారితీసింది., అయితే అలాంటి వస్తువులు బహిరంగ మార్కెట్‌లో నగదు రూపంలో విక్రయించబడ్డాయి. అంతేకాకుండా అధీకృత పంపిణీదారు కొన్ని పార్టీలకు వారి కొనుగోలు ఖాతాలను పెంచడానికి వీలు కల్పించారు. ఇది సుమారు రూ. 500 కోట్లు. ఈ డిస్ట్రిబ్యూటర్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ ఉత్పత్తులను ప్రత్యేకంగా విక్రయిస్తుంది.
సెర్చ్ ఆపరేషన్ సమయంలో, లెక్కలో చూపని నగదు రూ. 4 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, 25కి పైగా బ్యాంకు లాకర్లను నిలుపుదల చేశామని ఆదాయపు పన్నుశాఖ తెలిపింది.
తదుపరి విచారణలు జరుగుతున్నాయి.
***
(Release ID: 1995373)
Visitor Counter : 135