వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రధాన మంత్రి గతిశక్తి ప్రపంచానికి భారత దేశపు విప్లవాత్మక సమర్పణ


- ఇది ప్రపంచపు మౌలిక సదుపాయాల కోసం భవిష్యత్తు ప్రణాళిక సాధనం: మంత్రి పీయూష్ గోయల్

- గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని మోడీ దూరదృష్టితో కూడిన ఆలోచనతో పీఎం గతిశక్తి గుర్తింపు

- ప్రధానమంత్రి గతిశక్తికి దారితీసిన మౌలిక సదుపాయాల డెలివరీలో సామాన్యతను తిరస్కరించడం, శ్రేష్ఠత మరియు పనితీరు కోసం ప్రధాని మోదీ యొక్క తిరుగులేని అన్వేషణ: గోయల్

- ప్రధానమంత్రి గతిశక్తి ద్వారా డేటా లేయర్‌ల ఇంటర్‌కనెక్టివిటీ, మెరుగైన ప్రణాళిక, విశ్లేషణ, పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును ప్రధానంగా ప్రస్తావించిన గోయల్

Posted On: 10 JAN 2024 5:30PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి గతిశక్తి ప్రపంచానికి భారతదేశం యొక్క విప్లవాత్మక సమర్పణ అని కేంద్ర వాణిజ్య & పరిశ్రమలువినియోగదారుల వ్యవహారాలుఆహారం & ప్రజా పంపిణీజౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ కొనియాడారు. 18 సంవత్సరాల క్రితం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యొక్క దార్శనిక ఆలోచనతో దీని ఆవిర్భావాన్ని గుర్తించారని అన్నారు.  ఈ రోజు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024, 10వ ఎడిషన్‌లో ఏర్పాటు చేసిన "పీఎం గతిశక్తి: సమగ్రాభివృద్ధికి సమాచారంతో కూడిన నిర్ణయం తీసుకోవడం" అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి కీలకోపన్యాసం చేశారు. పీఎం గతిశక్తి మౌలిక సదుపాయాల విషయంలో భారతదేశం కాదు ఆసియాలోనే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తానికి భవిష్యత్తు ప్రణాళికా సాధనమని  ఆయన అభివర్ణించారు. భారతదేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చారిత్రక సందర్భాన్ని ఎత్తిచూపుతూ, శ్రీ గోయల్ ప్రాజెక్ట్‌లలో దీర్ఘకాలిక జాప్యం మరియు అధిక వ్యయంలాంటి సాంప్రదాయ సవాళ్లను నొక్కి చెప్పారు. అవస్థాపన డెలివరీలో సామాన్యతను తిరస్కరిస్తూ, శ్రేష్ఠత మరియు పనితీరుపై ప్రధానమంత్రి తిరుగులేని అన్వేషణను ఆయన నొక్కిచెప్పారు. పీఎం గతిశక్తి యొక్క ఆవిర్భావాన్ని ప్రతిబింబిస్తూ, వినాశకరమైన భూకంపం తర్వాత గుజరాత్‌ను పునర్నిర్మించడానికి ప్రధానమంత్రి దృష్టి సారించిన ప్రయత్నాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. గుజరాత్‌ను పెట్టుబడి గమ్యస్థానంగా మార్చడంలో మౌలిక సదుపాయాల యొక్క కీలక పాత్రను గుర్తించిన ప్రధాన మంత్రి, బలమైన మౌలిక సదుపాయాల ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారన్నారు. శ్రీ గోయల్ 'పీఎం గతిశక్తి గుజరాత్ కాంపెండియం'ను విడుదల చేశారు. పీఎం గతిశక్తి యొక్క ముఖ్యమైన ఫలితాలను నొక్కి చెప్పారు. పీఎం గతిశక్తిలో పొందుపరిచిన చైతన్యం, వశ్యత మరియు సాంకేతిక నైపుణ్యాన్ని ఆయన ప్రశంసించారు. జియోస్పేషియల్ మ్యాపింగ్ మరియు సాంకేతికత ఆధారిత పరిష్కారాల యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ… శ్రీ పీయూష్ గోయల్ ప్రాజెక్ట్ యొక్క డైనమిక్ స్వభావాన్ని నొక్కి చెప్పారు, నిరంతరం అభివృద్ధి చెందుతూ మరియు కొత్త డేటా లేయర్‌లను పొందుపరచడానికి అనుగుణంగా ఇది రూపొందించబడిందన్నారు.

 

పీఎం గతిశక్తి ద్వారా మెరుగైన ప్రణాళిక, విశ్లేషణ, పర్యవేక్షణ మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలును ప్రారంభించడం ద్వారా డేటా లేయర్‌ల ఇంటర్‌కనెక్టివిటీని ఆయన ప్రదానంగా ప్రస్తావించారు.  వినియోగదారులపై ఆలస్యమైన ప్రాజెక్టుల ప్రభావం గురించి మంత్రి మాట్లాడుతూ.. ఆలస్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వల్ల ఖర్చులు పెరుగుతాయని, పౌరుల ఆర్థికంపై ప్రభావం చూపుతుందని ఉద్ఘాటించారు. పౌరులకు గరిష్ట ప్రయోజనాలను అందించడానికి వేగవంతమైనమరింత సమర్థవంతమైన తక్కువ ఖర్చుతో కూడిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి పీఎం గతిశక్తి యొక్క ముఖ్యమైన సహకారాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ ప్రాజెక్ట్ను ఉటంకిస్తూ.. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టుల సమర్థవంతమైన ప్రణాళిక కోసం పీఎం గతిశక్తి తీసుకువచ్చిన అపారమైన ప్రయోజనాన్ని మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి గతిశక్తి భారతదేశ బలాన్ని ప్రతిబింబిస్తుందని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల అభివృద్ధి యొక్క కొత్త శకానికి నాంది పలుకుతుందని, రాజకీయ సరిహద్దులను దాటి వృద్ధి అవకాశాలను అందిస్తుందని శ్రీ గోయల్ పేర్కొన్నారు. 10 వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడం వెనుక ఉన్న ఆదర్శప్రాయమైన ప్రయత్నాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్శ్రీమతి సుమిత దావ్రా నేతృత్వంలోని పీఎం గతశక్తి బృందానికి అభినందనలు తెలిపారుసెమినార్లో అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల నిపుణులురాష్ట్ర డిపార్ట్మెంట్లు మరియు పీఎం గతిశక్తి నెట్వర్క్ ప్లానింగ్ గ్రూప్ మొదలైనవారు పాల్గొనడం ద్వారా నిర్మాణాత్మక సంభాషణలు మరియు ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడం ద్వారా  పరివర్తనాత్మక చొరవను అత్యంత సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడుతుందిరోజంతా జరిగే సెమినార్లో (i) టెక్నికల్ సెషన్, (ii) ప్లీనరీ సెషన్ మరియు (iii) ప్యానెల్ డిస్కషన్ ఉన్నాయిప్లీనరీ సెషన్లో డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి (లాజిస్టిక్స్) "పీఎం గతిశక్తి ఇనిషియేటివ్ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్స్కేప్అని ప్రసంగించారుఅక్టోబర్ 13, 2021  ప్రారంభించబడిన  చొరవ తదుపరి తరం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు సులభతరం చేయడం, వ్యాపారం చేయడంకోసం ఎలా లక్ష్యంగా పెట్టుకుందో ప్రధానంగా వెలుగులోకి  తెస్తుందిపీఎం గతిశక్తితో ఆర్థిక సంస్థల సహకారంనేషనల్ లాజిస్టిక్స్ పాలసీఎక్సిమ్ లాజిస్టిక్స్ మరియు పీఎం గతిశక్తితో మౌలిక సదుపాయాల గ్లోబల్ ప్లానింగ్కు సాధనంగా ఉండటం గురించిసెషన్లో చర్చించారువివిధ రంగాలలో పురోగతిని నడిపించడంలో పీఎం గతిశక్తి యొక్క కీలక పాత్రను గుర్తిస్తూ..  సెమినార్.. వ్యూహాలను అన్వేషించడానికి, సమగ్ర మరియు స్థిరమైన వృద్ధి కోసం సమాచారడేటా-ఆధారిత నిర్ణయాధికారం యొక్క సంస్కృతిని పెంపొందించడానికి కీలకమైన వాటాదారులను ఒకచోట చేర్చింది పరివర్తన చేపట్టిన చొరవ యొక్క ప్రభావాన్ని పెంచడానికి విలువైన అంతర్దృష్టులు మరియు సిఫార్సులను రూపొందించడంలో ఇది సహాయపడిందిజీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంతోపాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంపైన దృష్టి సారించింది.

***



(Release ID: 1995134) Visitor Counter : 89