రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వే నిర్మాణ మాన్యువల్ 2023ని ఆవిష్కరించిన కేంద్ర రైల్వే మంత్రి
ల్యాండ్ అక్విజిషన్, ఫారెస్ట్ క్లియరెన్స్, బ్రిడ్జ్ డిజైన్, టన్నెల్ నిర్మాణంతో సహా వివిధ నిర్మాణ సంబంధిత కార్యకలాపాలలో సహాయం చేయనున్న నిర్మాణ మాన్యువల్
Posted On:
09 JAN 2024 7:33PM by PIB Hyderabad
కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు న్యూఢిల్లీలో ‘ది ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ మాన్యువల్-2023’ని ఆవిష్కరించారు. మాన్యువల్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..“భూసేకరణ, అటవీ అనుమతులు, వంతెనల రూపకల్పన, కాంట్రాక్ట్ నిర్వహణ, సొరంగం నిర్మాణం, రోడ్డు ఫ్లైఓవర్/అండర్ బ్రిడ్జిలు వంటి అనేక కార్యకలాపాలకు నిర్మాణ మాన్యువల్ దోహదపడుతుందని అన్నారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రైలు నెట్‌వర్క్‌గా అవతరించేందుకు ఈ మాన్యువల్ తమకు సహాయం చేస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో శ్రీ వైష్ణవ్ మాట్లాడుతూ “నిర్మాణ మాన్యువల్ ఇప్పుడు కొత్త రూపంలో మరియు మన కాలానికి అనుగుణంగా ఉండటం నిజంగా ఆనందంగా ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కొత్త ట్రాక్‌లు మరియు స్టేషన్‌ల నిర్మాణంతో సహా రైల్వేపై ఆయన దృష్టిని కేంద్రీకరించారు. ఈ మిషన్‌లో ప్రస్తుతం ఉన్న 1960 నాటి మాన్యువల్ పాతది అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త మాన్యువల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈపీసీ ఒప్పందాలు, వంతెన నిర్మాణం, సిగ్నలింగ్ అమలు, ఎలక్ట్రికల్ మరియు నాన్-ఇంటర్‌లాకింగ్ పనులు మొదలైన వాటితో సహా కొత్త సంస్కరణలు చేర్చబడ్డాయి. అవి ఇప్పుడు కొత్త మాన్యువల్ ద్వారా ప్రామాణికం చేయబడ్డాయి” అని చెప్పారు.
ఈ మాన్యువల్‌ని తయారు చేయడంలో రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) శ్రీ రూప్ నారాయణ్ సుంకర్ మరియు ఆయన బృందం చేసిన కృషిని కేంద్ర మంత్రి ప్రశంసించారు. ఇండియన్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ మరియు వివిధ జోనల్ రైల్వేల నిర్మాణ అధికారుల బృందం ఈ మాన్యువల్‌ను తయారు చేసింది. నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేయడానికి అవసరమైన పరిజ్ఞానంతో నిర్మాణ అధికారులను సన్నద్ధం చేసేందుకు భారతీయ రైల్వేలు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ మాన్యువల్ ఒక ముఖ్యమైన మైలురాయి.
జాతీయ రైలు ప్రణాళిక ప్రకారం 2050 సంవత్సరం వరకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యాన్ని భారతీయ రైల్వేలు 2030 నాటికి అభివృద్ధి చేసుకోవాలి. దీనిని సాధించడానికి భారతీయ రైల్వేలు దాని మౌలిక సదుపాయాలను నిర్మించడంలో వేగాన్ని పెంచాలి అంటే సూపర్ క్రిటికల్ మరియు క్రిటికల్‌ను ప్రారంభించాలి అలాగే కొత్త లైన్ల నిర్మాణం; గేజ్ మార్పిడి, బహుళ ట్రాకింగ్, ఆటోమేటిక్ సిగ్నలింగ్ మరియు ట్రాఫిక్ సౌకర్యాల పనులు మొదలైన వాటిని పూర్తి చేయాలి.
నిర్మాణ అధికారులకు మార్గనిర్దేశం చేసేందుకు నిర్మాణంలోని వివిధ అంశాలను కవర్ చేసే మాన్యువల్‌ను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని భావించారు. క్షేత్రస్థాయి అధికారులకు సులభంగా అర్థమయ్యేలా సరళమైన భాషలో మాన్యువల్‌ను రూపొందించారు.
***
(Release ID: 1994718)
Visitor Counter : 132