రైల్వే మంత్రిత్వ శాఖ

భారతీయ రైల్వే కి సంబంధించి 'రైల్వేల స్టార్టప్స్' చొరవకు వేగ గతి


వివిధ ఇన్నోవేషన్ సవాళ్లలో పాల్గొనేందుకు ఇండియన్ రైల్వే ఇన్నోవేషన్ పోర్టల్‌లో
మొత్తం 1251 సంస్థలు నమోదు

అవార్డు పొందిన 23 ప్రాజెక్టుల విలువ రూ. 43.87 కోట్లు

Posted On: 09 JAN 2024 3:01PM by PIB Hyderabad

భారతీయ రైల్వేలు స్టార్టప్‌లు మరియు ఇతర సంస్థల భాగస్వామ్యం ద్వారా ఆవిష్కరణ రంగంలో ఒక ముఖ్యమైన చొరవ తీసుకుంది. “స్టార్టప్ ఫర్ రైల్వేస్” కార్యక్రమాన్ని 2022  జూన్న 13న రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ చొరవలో భాగంగా, ఇండియన్ రైల్వే ఇన్నోవేషన్ పోర్టల్ ఇక్కడ అందుబాటులో ఉంది... https://innovation.indianrailways.gov.in/.

భారతీయ రైల్వేలలో కార్యాచరణ సామర్థ్యం, భద్రతను మెరుగుపరచడానికి భారతీయ స్టార్టప్‌లు/ఎంఎస్ఎంఈలు/ఆవిష్కర్తలు/ఆంట్రప్రెన్యూర్స్ అభివృద్ధి చేసిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం దీని లక్ష్యం. భారతీయ రైల్వేల నాణ్యత, విశ్వసనీయత, నిర్వహణ సంబంధిత సమస్యలను పరిష్కరించడం రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యం. ఈ విధానం ప్రకారం, స్టార్టప్/ఎంఎస్ఎంఈ/ఇన్నోవేటర్/ఆంట్రప్రెన్యూర్ ఈ ప్రాజెక్ట్‌లో రూపొందించిన మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్) ప్రత్యేక యాజమాన్యాన్ని కలిగి ఉంటారు.

అవార్డ్ చేసిన 23 ప్రాజెక్ట్‌ల విలువ సుమారుగా రూ. 43.87 కోట్లు ఉంటుంది. 
 

ఇన్నోవేషన్ పోర్టల్లో నమోదు అయిన మొత్తం సంస్థలు-1251

    • స్టార్టప్స్ - 248
    • వ్యక్తిగత ఆవిష్కర్తలు - 671
    • ఎంఎస్ఎంఈ లు -142
    • ఆర్ అండ్ డి సంస్థలు -58
    • యాజమాన్యం/భాగస్వామ్యసంస్థలు/కంపెనీ/ఎల్ఎల్పి/జేవీ/కన్సార్టియం - 47
    • ఎన్జీఓలు -19
    • ఇతరులు-66

***



(Release ID: 1994698) Visitor Counter : 94