రక్షణ మంత్రిత్వ శాఖ
శ్రీలంకలోని కొలంబోలో ఐఎన్‌ఎస్ కాబ్రా పర్యటన
Posted On:
09 JAN 2024 11:06AM by PIB Hyderabad
భారత నౌకాదళానికి చెందిన శీఘ్ర దాడి నౌక ఐఎన్‌ఎస్ కాబ్రా, 08 జనవరి 2024న శ్రీలంకలోని కొలంబో పోర్టుకు చేరుకుంది. ఈ నౌకకు శ్రీలంక నౌకాదళం ఘనస్వాగతం పలికింది. ఆ సమయంలో, ఐఎన్‌ఎస్ కాబ్రా కమాండింగ్ ఆఫీసర్, పశ్చిమ నౌకాదళం కమాండర్, రియర్ అడ్మిరల్ టీఎస్‌కే పెరీరాతో సమావేశం అయ్యారు.
శ్రీలంక నౌకాదళం, వైమానిక దళానికి అవసరమైన విడిభాగాలు, నిత్యావసరాలను ఐఎన్‌ఎస్ కాబ్రా అందించింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత అయిన 'సాగర్'కు అనుగుణంగా జరిగిన ఈ పర్యటన, రెండు దేశాల నౌకాదళాల మధ్య ద్వైపాక్షిక సహకారం & స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
***
(Release ID: 1994696)
Visitor Counter : 139