ప్రధాన మంత్రి కార్యాలయం
తిమోర్-లెస్తె యొక్క అధ్యక్షుడి తో సమావేశమైన ప్రధాన మంత్రి
Posted On:
09 JAN 2024 11:16AM by PIB Hyderabad
పదో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ గాంధీనగర్ లో జరగనుండగా ఆ కార్యక్రమం లో పాలుపంచుకోవడం కోసం తిమోర్-లెస్తె యొక్క అధ్యక్షుడు డాక్టర్ శ్రీ జోస్ రామోస్ హోర్టా 2024 జనవరి 8 వ తేదీ మొదలుకొని 10 వ తేదీ ల మధ్య భారతదేశాన్ని సందర్శిస్తున్నారు.
అధ్యక్షుడు డాక్టర్ శ్రీ హోర్టా మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లు గాంధీనగర్ లో ఈ రోజు న సమావేశమయ్యారు. వైబ్రంట్ గుజరాత్ సమిట్ లో పాలుపంచుకోవలసింది గా అధ్యక్షుడు శ్రీ హోర్టా కు మరియు ఆయన వెన్నంటి వచ్చిన ప్రతినిధి వర్గాన్ని ప్రధాన మంత్రి సాదరం గా ఆహ్వానించారు. ఇది రెండు దేశాల మధ్య ఒక దేశాధినేత గాని, లేదా ప్రభుత్వ స్థాయి నేత గాని జరుపుతున్న ఒకటో యాత్ర అని చెప్పాలి. ఒక హుషారైన ‘‘ఢిల్లీ-దిలీ’’ కనెక్ట్ ను ఏర్పాటు చేయడం కోసం భారతదేశం కంకణం కట్టుకొందన్న విషయాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు. 2023 వ సంవత్సరం సెప్టెంబరు లో, ఆయన తిమోర్- లెస్తె లో ఇండియన్ మిశను ను తెరుస్తున్నట్లు ప్రకటించారు. సామర్థ్యాల ను వృద్ధి చెందింప చేయడం లో శిక్షణ, మానవ వనరుల వికాసం, ఐటి, ఫిన్ టెక్, శక్తి , ఇంకా సాంప్రదాయక చికిత్స మరియు ఫార్మా సహా ఆరోగ్య సంరక్షణ సేవల లో తిమోర్-లేస్తే కు సాయాన్ని అందిస్తామంటూ ఆయన సన్నద్ధత ను వ్యక్తం చేశారు. ఇంటర్‌నేశనల్ సోలర్ అలయన్స్ (ఐఎస్ఎ) లోను మరియు కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ) లోను చేరవలసిందంటూ తిమోర్-లేస్తే ను ఆయన ఆహ్వానించారు.
ఏశియాన్ లో పదకొండో సభ్యత్వ దేశం గా తిమోర్-లెస్తె ను చేర్చుకోవాలని సూత్రప్రాయ నిర్ణయాన్ని తీసుకొన్నందుకు అధ్యక్షుడు శ్రీ హోర్టా కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు. త్వరలోనే ఆ దేశం పూర్తి స్థాయి సభ్యత్వాన్ని సంపాదించుకొంటుందన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.
సమిట్ లో పాలుపంచుకోవడం కోసం ఆహ్వానాన్ని ఇచ్చినందుకు గాను ప్రధాన మంత్రి కి అధ్యక్షుడు శ్రీ హోర్టా ధన్యవాదాలు పలికారు. తమ అభివృద్ధి ప్రాధాన్యాల ను సాకారం చేయడం లో, మరీ ముఖ్యం గా ఆరోగ్య సంరక్షణ లో మరియు ఐటి లో సామర్థ్యాల పెంపుదల రంగం లో భారతదేశం అండదండల ను అందించాలని ఆయన కోరారు.
ఇండో-పసిఫిక్ క్షేత్రం లో ప్రాంతీయ అంశాల ను గురించి మరియు ఇతర ఘటన క్రమాల ను గురించి నేతలు ఇద్దరు చర్చించారు.
ఐ.రా.స. భద్రత మండలి లో భారతదేశాని కి శాశ్వత సభ్యత్వం దక్కాలని అధ్యక్షులు శ్రీ హోర్టా బలమైన సమర్థన ను వ్యక్తం చేశారు. బహు పాక్షిక రంగం లో శ్రేష్ఠమైనటువంటి సహకారాన్ని మునుముందు కూడా కొనసాగించుదాం అంటూ నేత లు వారి యొక్క నిబద్ధత ను ప్రకటించారు. ‘వాయస్ ఆఫ్ గ్లోబల్ సౌథ్ సమిట్’ యొక్క రెండు సంచికల లో తిమోర్-లెస్తె యొక్క క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. వికాస శీల (గ్లోబల్ సౌథ్) సభ్యత్వ దేశాలు ప్రపంచ అంశాల లో వాటి వైఖరి ని కలసికట్టు గా రూపొందించుకోవాలి అనే అంశం లో వారు సమ్మతి ని వ్యక్తం చేశారు.
భారతదేశాని కి మరియు తిమోర్-లెస్తె కు మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రజాస్వామ్యం మరియు బహుళత్వ వాదం ల తాలూకు ఉమ్మడి విలువల పునాదుల మీద ఏర్పడ్డాయి. తిమోర్-లెస్తె తో 2002 వ సంవత్సరం లో దౌత్య సంబంధాల ను నెలకొల్పుకొన్న తొలి దేశాల లో భారతదేశం కూడా ఒక దేశం గా ఉన్నది.
***
(Release ID: 1994543)
Visitor Counter : 278
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam