రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

జె&కె, లద్దాఖ్‌లో మరో నాలుగు ఎన్‌సీసీ యూనిట్ల ఏర్పాటుకు రక్షణ శాఖ మంత్రి ఆమోదం

Posted On: 08 JAN 2024 5:21PM by PIB Hyderabad

జమ్ము & కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో నాలుగు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) యూనిట్లను పెంచే ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఉధంపూర్ (జె&కె), కుప్వారా (జె&కె), కార్గిల్‌లో (లద్దాఖ్) ఒక్కో మిక్స్‌డ్ (బాలురు & బాలికలు) సైనిక బెటాలియన్, ఉధంపూర్‌లో (జె&కె) ఒక ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పాటు చేస్తారు.

కొత్త యూనిట్ల రాకతో, జె&కె, లద్దాఖ్‌లో ప్రస్తుతం ఉన్న 27,870 క్యాడెట్ల బలం 12,860 పెరుగుతుంది, ఇది 46.1% వృద్ధి. ప్రస్తుతం, డైరెక్టరేట్‌కు ఈ మూడు ప్రాంతాల్లో మొత్తం 10 ఎన్‌సీసీ యూనిట్లు, రెండు గ్రూపు ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. కొత్త ఎన్‌సీసీ యూనిట్ల వల్ల జె&కె, లద్దాఖ్‌ ప్రాంతాల్లోని యువత మనోధైర్యం పెరుగుతుంది, దేశ నిర్మాణానికి మరింతగా తోడ్పడతారు.

 

***


(Release ID: 1994484) Visitor Counter : 189


Read this release in: English , Urdu , Hindi , Marathi