బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024-25 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య, క్యాప్టివ్ గనుల నుంచి 186.63 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్న బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 08 JAN 2024 2:35PM by PIB Hyderabad

2024-25 ఆర్థిక సంవత్సరంలో క్యాప్టివ్‌, వాణిజ్య బొగ్గు గనుల నుంచి 186.63 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మంత్రిత్వ శాఖ ప్రస్తుత ప్రణాళిక ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యం మరింత పెరిగి 225.69 మిలియన్ టన్నులకు చేరుతుంది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి అది 383.56 మిలియన్ టన్నులకు పెరుగుతుంది.

మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, 31 డిసెంబర్ 2023 నాటికి, 50 క్యాప్టివ్‌, వాణిజ్య బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి జరుగుతోంది. వాటిలో 32 గనులు విద్యుత్ రంగానికి, 11 అనియంత్రిత రంగానికి, ఏడు గనులు బొగ్గు విక్రయం కోసం కేటాయించారు. 2020లో వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభమైన తర్వాత, ఈ మూడున్నర సంవత్సరాల్లో, 14.87 మిలియన్ టన్నుల 'పీక్-రేటెడ్ కెపాసిటీ' (పీఆర్‌సీ) గల ఆరు గనుల్లో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైంది.

2023 డిసెంబర్‌లో, క్యాప్టివ్ & వాణిజ్య బొగ్గు గనుల మొత్తం బొగ్గు ఉత్పత్తి 14.04 మెట్రిక్‌ టన్నులుగా ఉంది. 2022 డిసెంబర్‌ నెలలోని 10.14 మెట్రిక్‌ టన్నులతో పోలిస్తే, ఉత్పత్తి 38% పెరిగింది.

క్యాప్టివ్, వాణిజ్య బొగ్గు బ్లాకుల నుంచి బొగ్గు ఉత్పత్తి & పంపిణీలో 2023 ఏప్రిల్ 01 - డిసెంబర్ 31 కాలంలో గణనీయమైన వృద్ధి కనిపించింది, ఆ 9 నెలల్లో 98  మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తయింది.

***


(Release ID: 1994192) Visitor Counter : 237