సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
గోవాలో నేటి నుంచి ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024
వికలాంగులకు సమాన అవకాశాలు, సాధికారత కల్పించడం లక్ష్యంగా పర్పుల్ ఫెస్ట్ 2024
Posted On:
08 JAN 2024 10:12AM by PIB Hyderabad
ప్రతి ఒక్కరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఇంటెర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024 ఈ రోజు గోవాలో ప్రారంభం అవుతుంది. జనవరి 13 వరకు ఇంటెర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024 జరుగుతుంది. వికలాంగులకు సమన అవకాశాలు, సాధికారత కల్పించడం లక్ష్యంగా ఇంటెర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024 నిర్వహిస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు అనుబంధంగా అంగవైకల్యం కలిగిన వారికి సాధికారత కల్పించడానికి ఏర్పాటైన విభాగం సహకారంతో గోవా స్టేట్ కమిషన్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్.. డైరెక్టరేట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా నిర్వహిస్తున్నాయి. పనాజీ క్యాంపల్ డి.బి గ్రౌండ్ లో సాయంకాలం 4. నిమిషాలకు ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024 ప్రారంభం అవుతుంది.
ప్రారంభ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే గౌరవ అతిథిగా పాల్గొంటారు.ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ. విశ్వజిత్ రాణే, కేంద్ర పర్యాటక, నౌకాశ్రయాలు, జలమార్గాల శాఖ సహాయ మంత్రి , శ్రీ. శ్రీపాద్ నాయక్ తదితరులు కార్యక్రమంలో పాల్గొంటారు.
సంగీతం, నృత్యం , వినోదాలలో ఆకర్షణీయమైన ప్రదర్శనల ద్వారా వికలాంగుల (పిడబ్ల్యుడి) సామర్ధ్యాలను ప్రదర్శిస్తారు.
ప్రారంభ వేడుక లో 'ధుమాల్' అనే పేరుతో రూపొందిన పర్పుల్ ఫెస్ట్ గీతం ముఖ్య ఆకర్షణగా ఉంటుంది. గోవాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వికలాంగులు, సంగీత రంగానికి చెందిన ప్రముఖులు సమన అవకాశాలు, సమగ్రత, ఐక్యత ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఇస్తారు.
వికలాంగుల సంక్షేమం కోసం కార్యక్రమంలో భాగంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ , గోవా ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు, పథకాలు ప్రారంభమవుతాయి.
దేశ విదేశాలకు చెందిన దాదాపు 8,000 మంది ప్రతినిధులు ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024లో పాల్గొంటారు.వికలాంగులకు సమాన అవకాశాలు, సాధికారత కల్పించడానికి అంతర్జాతీయ స్థాయిలో అమలు జరుగుతున్న కార్యక్రమాలను చర్చించి, భవిష్యత్తులో వీటిని మరింత పటిష్టంగా అమలు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తారు.
***
(Release ID: 1994156)