రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

ఆధునిక విద్యను అందిస్తూ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు నూతన భారతదేశంలో మరిన్ని గురుకులాలు అవసరం: రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్

Posted On: 06 JAN 2024 2:46PM by PIB Hyderabad

ఆధునిక విద్యను అందిస్తూ  భారతదేశ నైతిక , సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు దేశంలో మరిన్ని గురుకులాలు ఏర్పాటు కావలసిన అవసరం ఉందని రక్షణ శాఖ  మంత్రి శ్రీ  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  జనవరి 06, 2024న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని స్వామి దర్శనంద్ గురుకుల మహావిద్యాలయంలో 'గురుకులం ఏవం ఆచార్యకులం' నిర్మాణానికి రక్షణ శాఖ మంత్రి  శంకుస్థాపన చేశారు.  అనంతరం శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ విదేశీ సంస్కృతిని అనుకరించడం వల్ల  నైతిక విలువలు దిగజారుతున్న తరుణంలో యువతలో నైతిక విలువలు పెంపొందిస్తూ ఆధునిక విద్య అందించడానికి  గురుకులాలు ముందుకు రావాలని అన్నారు. 

“సుమారు 1,000-1,500 సంవత్సరాల క్రితం దేశంలో చాలా పెద్ద విశ్వవిద్యాలయాలు గురుకుల సంప్రదాయం పాటిస్తూ విద్యను అందించాయి.   ఆ తర్వాత, విదేశీ ఆక్రమణదారులు ఆ వ్యవస్థను దాదాపు నాశనం చేశారు., దేశ సాంస్కృతిక స్ఫూర్తికి అనుగుణంగా కాకుండా మన యువతకు విద్యను అందించే వ్యవస్థను విదేశీ ఆక్రమణదారులు అభివృద్ధి చేశారు. భారతీయ సంస్కృతిని హీనంగా చిత్రీకరించారు. ఈ భావన మనల్ని రాజకీయంగానే కాకుండా మానసికంగా కూడా ప్రభావితం చేసింది. ఆ సమయంలో, స్వామి దర్శానంద్ గురుకులాన్ని స్థాపించారు,  అప్పటి నుండి మన యువ తరాలకు వెలుగునిస్తుంది, ”అని రక్షణ శాఖ  మంత్రి చెప్పారు

ప్రాథమిక విద్య నుంచి యువతలో నైతిక విలువలను పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం 2020 ని రూపొందించని   శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. . ‘‘దేశవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు  నూతన  విద్యా విధానాన్ని అమలు చేస్తున్నాయి. . విద్యా విధానంలో మార్పు ఒక్కసారిగా రాదు.  మార్పు రావడానికి సమయం పడుతుంది. . ఈ సుదీర్ఘ ప్రక్రియలో గురుకులాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది '' అని అన్నారు. 

గురుకులాలు ప్రాచీన విద్యా పద్ధతులు మాత్రమే అనుసరిస్తున్నాయి అన్న అపవాదు నుంచి బయటపడడానికి ,కాలానుగుణంగా విద్యా విధానంలో   అభివృద్ధి చెంది ఆధునికంగా మారాలని రక్షణ శాఖ  మంత్రి సూచించారు. నేటి నిరంతరం అభివృద్ధి చెందుతున్న కాలానికి అనుగుణంగా సాంప్రదాయ విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్వాంటం టెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న  అత్యాధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించాలని  ఆయన గురుకులాలకు సూచించారు. . “ఈ రంగంలో దేశాన్ని అగ్రగామిగా మార్చే సాంకేతికతలను అభివృద్ధి చేయండి. గురుకులాలు ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా పని చేయాలి. రాబోయే కాలంలో వారు మరోసారి దేశం ,దేశ  సంస్కృతికి ప్రాతినిధ్యం వహించి  భారతదేశానికి కొత్త గుర్తింపుగా మారాలి" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.  

దేశ సాంస్కృతిక అభివృద్ధిలో గురుకులాలు కీలక  పాత్ర పోషించాలని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  సాంస్కృతిక అభ్యున్నతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన వివరించారు.  “కాశీ విశ్వనాథ్ కారిడార్ ,మహాకాళేశ్వర్ ధామ్ నుంచి  రామ మందిరం వరకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం సాంస్కృతిక వారసత్వ రక్షణ, వ్యాప్తికి కృషి చేస్తోంది.. సాంస్కృతిక పరిరక్షణ కోసం మాత్రమే కాదు. మన భవిష్యత్ తరాలు  దేశ సంస్కృతి చూసి గర్వపడేలా చూసే విధంగా కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. . ఈ దిశగా గురుకులాలు ప్రధాన భూమిక పోషించాల్సి ఉంటుంది. '' అని అన్నారు.
  ప్రాచీన భారతీయ అభ్యాసం యోగ  ప్రయోజనాలు గుర్తించిన  ప్రపంచం మొత్తం యోగా ను పాటిస్తోందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  “భారతదేశం వసుధైక కుటుంబం (ప్రపంచం ఒకే కుటుంబం) అనే భావనను అనుసరిస్తోంది.  అపారమైన జ్ఞానభూమి మొత్తం ప్రపంచానికి అంకితం చేయబడింది.  జూన్ 21 వ తేదీని ఐక్యరాజ్యసమితి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తోంది. ఒకప్పుడు కేవలం భారతదేశానికి మాత్రమే పరిమితమైన యోగ ప్రస్తుతం  ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆమోదం పొంది   వారి దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది” అని ఆయన అన్నారు. భారతీయ సాహిత్యంలో సంస్కృతానికి ఉన్న ముఖ్యమైన స్థానాన్ని వివరించిన మంత్రి  యోగాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన విధంగా ప్రాచీన భారతీయ భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 

 

***



(Release ID: 1993984) Visitor Counter : 132