వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
భారతదేశం ప్రమాణాలకు మార్గదర్శకంగా ఉండాలి: శ్రీ పీయూష్ గోయల్
మంచి నాణ్యత విషయంలో రాజీ లేదు : శ్రీ గోయల్
77వ వ్యవస్థాపక దినోత్సవాన్నిజరుపుకున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్
బిఐఎస్, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ సంయుక్తంగా నిర్వహించిన
'డైలాగ్ ఫర్ స్ట్రెంగ్థెనింగ్ క్వాలిటీ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా'
Posted On:
06 JAN 2024 2:35PM by PIB Hyderabad
ఈరోజు ఇక్కడ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) 77వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ భారతదేశం ప్రమాణాలకు మార్గదర్శకంగా ఉండాలి అని అన్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరిశ్రమ అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక శాఖ (డిపిఐఐటీ)తో పాటు బిఐఎస్ సంయుక్తంగా 'భారతదేశంలో నాణ్యమైన పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గోష్ఠి'ని నిర్వహించింది.
బిఐఎస్ కేవలం ప్రమాణాల నిర్ధారణ వరకే పరిమితం కారాదని కేంద్ర మంత్రి అన్నారు. లిఫ్టులు లేదా ఎయిర్ ఫిల్టర్లు లేదా మెడికల్ ఐటమ్స్ వంటి వాటికి సాధ్యమైన చోట అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రమాణాలు ఉండాలని ఆయన అన్నారు. వాటాదారుల సంప్రదింపులను పెంచడం ద్వారా, పరిశ్రమ ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా దీనిని సాధించవచ్చని ఆయన తెలిపారు.
హాల్‌మార్కింగ్ నగలలో బిఐఎస్ చేస్తున్న కృషిని శ్రీ గోయల్ ప్రశంసించారు. 343 జిల్లాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి అని సూచించారు. ప్రతిరోజూ 4.3 లక్షలకు పైగా ఆభరణాలు హాల్‌మార్క్ అవుతున్నాయని, ప్రజలు కొనుగోలు చేస్తున్న 90% ఆభరణాలు హాల్‌మార్క్ చేసినవే అని తెలిపారు. .
.
2014 వరకు 106 ఉత్పత్తుల క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు 14 మాత్రమే ఉన్నాయని తెలిపారు. కానీ, ఇప్పుడు, 672 ఉత్పత్తులలో 156 క్యూసిఓ లు ఉన్నాయన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశానికి నాయకత్వం నాయకత్వంలో 90 శాతం క్యూసిఓలు వచ్చాయని శ్రీ గోయల్ చెప్పారు. బొమ్మల గురించి మాట్లాడుతూ, 2023తో పోలిస్తే 2015 నుండి బొమ్మల దిగుమతుల్లో 52 శాతం క్షీణత నమోదైందని, ఎందుకంటే క్యూసిఓలు అన్నింటికంటే నాణ్యతను తప్పనిసరి చేశాయని చెప్పారు. "క్యూసిఓలు దాదాపు 2500 వస్తువులలో ప్రాసెస్ చేస్తున్నారు. ఇది అధిక ప్రమాణాల వస్తువులను అందించడం ద్వారా నాణ్యత పట్ల తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ”అని ఆయన చెప్పారు.
9 సంవత్సరాల క్రితం, ప్రధానమంత్రి జీరో డిఫెక్ట్, జీరో ఎఫెక్ట్ అనే దార్శనికతను అందించారని, అంటే భారతదేశం స్థిరమైన, పర్యావరణ అనుకూలమైన, సున్నా వాతావరణ ప్రభావం లేని అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను తయారు చేయాలని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధాన మంత్రి విజన్ అవలంబించడం జరుగుతుందని, ఫలితంగా వినియోగదారులు నాణ్యతపై దృష్టి సారించారని శ్రీ గోయల్ అన్నారు. ప్రధానిని ఉటంకిస్తూ, “దశాబ్దాలుగా, భారతదేశం నాణ్యత కోసం విదేశీ ప్రమాణాలపై ఆధారపడి ఉంది. ఇప్పుడు భారతదేశం వేగం, పురోగతి మన స్వంత ప్రమాణాల ద్వారా నిర్ణయించబడతాయి. ” అని శ్రీ గోయల్ అంటూ క్వాలిటీ ఈజ్ కింగ్ అని స్పష్టం చేశారు. నాణ్యత అనేది సాధారణ అంశం అని, అది అవసరమని ఆయన అన్నారు.
నాణ్యత, వికసిత భారత్‌కు యువత అంబాసిడర్‌లు కావాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. యువకులు ఈ-లెర్నింగ్‌ను ప్రోత్సహించగలరని, కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో పరఖ్ చొరవను అప్‌గ్రేడ్ చేయగలరని ఆయన అన్నారు. గ్యాప్ విశ్లేషణను అధ్యయనం చేసిన తర్వాత, బిఐఎస్, పరిశ్రమను సులభతరం చేయడానికి ఆధునిక ల్యాబ్‌ల సమగ్ర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. కాటన్ టెస్టింగ్ కోసం 21 ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు బిఐఎస్ ఇటీవల రూ. 40 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని శ్రీ గోయల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, కార్యదర్శి డీపీఐఐటీ శ్రీ రాజేష్ కుమార్ సింగ్, డైరెక్టర్ జనరల్ బిఐఎస్ శ్రీ ప్రమోద్ కుమార్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
ప్రామాణీకరణకు సంబంధించిన విభిన్న రంగాలకు చెందిన నిపుణులు, విధాన రూపకర్తలు, పరిశ్రమ నిపుణులు, వినియోగదారుల సమూహాలు, విద్యావేత్తలు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు, సంఘాలు, ప్రముఖ తయారీదారులు, వ్యాపారులు, ప్రత్యేక ఆహ్వానితులు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం, ప్రజాపంపిణీ , డీపీఐఐటీ నుండి ప్రతినిధులు, కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1993958)
Visitor Counter : 133