సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఎమర్జింగ్ అండ్ ఫ్యూచర్ ఇ-గవర్నెన్స్ ఇనిషియేటివ్స్, ఇ-కామర్స్ ఇనిషియేటివ్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశంపై మేధోమథన కార్యక్రమం


బాధ్యతాయుతమైన ఏఐ విధాన చట్రం చుట్టూ భవిష్యత్తులో ఉండే పబ్లిక్ సర్వీస్ డెలివరీ మోడల్‌లను చర్చించిన ఈ రంగం నిపుణులు

వ్యక్తిగతీకరించిన ఇ-సేవలు, సర్వీస్ డెలివరీ ఆప్టిమైజేషన్ కోసం అన్ని ప్రభుత్వ రంగాలలో రానున్న జెన్ ఏఐ వినియోగం

జెన్ ఏఐ లో ఎదురయ్యే సవాళ్లు, వాటిని గుర్తించి నిర్వహణ చేపట్టడం, పౌరుల గోప్యత, డేటా భద్రత, మెరుగుపరిచిన సైబర్-సెక్యూరిటీ చర్యలపై దృష్టి పెట్టడం అవసరం

ఇ-గవర్నెన్స్ కార్యక్రమాలలో భాషిణి, సర్వీస్ ప్లస్ మొదలైన వాటి మెరుగైన వినియోగం

Posted On: 05 JAN 2024 12:28PM by PIB Hyderabad

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డిఏఆర్పిజి) జనవరి 4, 2024న న్యూ ఢిల్లీలో ఎమర్జింగ్ అండ్ ఫ్యూచర్ ఇ-గవర్నెన్స్ ఇనిషియేటివ్‌లు, ఇ-కామర్స్ ఇనిషియేటివ్‌లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశంపై మేధోమథన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ-సేవ డెలివరీ, ఇ-గవర్నెన్స్, వినూత్న సాంకేతికత అమలులో ఈ రంగంలో ఉన్న కీలకమైన దిగ్గజాల  మధ్య జ్ఞాన పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాన్ని ప్రోత్సహించడానికి  గణనీయమైన కృషిని ఈ కార్యక్రమంలో గుర్తించారు డిఏఆర్పిజి అధికారులతో పాటు డెలాయిట్, పిడబ్ల్యూ సిడబ్ల్యూసి, ప్రైమస్ పార్టనర్స్, కేపీఎంజీ,క్యూసిఐ, ఈవై తో సహా ప్రముఖ సంస్థల నుండి 15 మంది సంబంధిత వృత్తి నిపుణులు, విశిష్ట ప్రతినిధులు సెషన్‌కు హాజరయ్యారు.

డిఏఆర్పిజి కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్ ఈ అంశంపై చర్చను ప్రారంభించారు. ఎన్ఈఎస్డిఏ వే-ఫార్వర్డ్ నవంబర్, 2023 నివేదికలో 1574 తప్పనిసరి ఇ-సేవల డెలివరీని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించడంతో గత కొన్ని సంవత్సరాలలో దేశవ్యాప్తంగా ఇ-సేవ డెలివరీ పరిథి ఎలా విస్తరించిందో ఆయన తెలియజేశారు. ఎన్ఈఎస్డిఏ 2019 నివేదికలో కేవలం 872 సేవలు మాత్రమే నివేదించబడ్డాయి. ఇంకా, 2023 ఏప్రిల్‌లో 11,614 నుండి NeSDA వే ఫార్వార్డ్‌లో నవంబర్ 2023లో మొత్తం 16088 ఇ-సేవలు నివేదించబడ్డాయి. రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకే మజిలీలో సర్వీస్ డెలివరీ ఫోకస్‌ని యూనిఫైడ్ సర్వీస్ పోర్టల్‌లకు ఎలా మార్చాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పరామితిపై అనేక రాష్ట్రాలు ఇప్పటికే 100 శాతం సంతృప్త స్థాయిని ఎలా సాధించాయి ఆయన వివరించారు. 

ఆ తర్వాత, ఈ-గవ్ స్ట్రాటజీ డొమైన్‌లోని సెక్టార్ స్పెషలిస్ట్‌లు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో సహా ఇ-గవర్నెన్స్, ఇ-కామర్స్ విజయాలు, అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు, భవిష్యత్తు ప్రస్థానంపై మార్గదర్శనం చేసారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కేస్ స్టడీస్‌ను ఆయన ఈ చర్చలో పంచుకున్నారు.
పరిశ్రమ రంగ ప్రముఖులు పలు కీలక అంశాలను ప్రస్తావించారు.పిడబ్ల్యూసి పార్టనర్  శ్రీ సంతోష్ మిశ్రా, జెన్ ఏఐని ఉపయోగించడం ద్వారా, బాధ్యతాయుతమైన ఏఐ ఫ్రేమ్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా ఈ-సేవలు సమ్మిళితం చేయాలనీ సూచించారు. డెలాయిట్ జెన్ ఏఐ పార్టనర్ శ్రీ ఎన్ఎస్ఎన్ మూర్తి, వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని ఎలా ప్రారంభించవచ్చో చర్చించారు. 
డెలివరీ ఆప్టిమైజేషన్ అనేది  వినూత్న పరిష్కారాల ద్వారా ఎలా శక్తివంతం చేయొచ్చో వివరిస్తుంది. ప్రైమస్ పార్ట్‌నర్స్ సీఈఓ శ్రీ నిలయ వర్మ మాట్లాడుతూ, కేవలం టెక్నాలజీపై మాత్రమే కాకుండా సేవపై దృష్టి పెట్టడమే ప్రభావవంతమైన సర్వీస్ డెలివరీకి కీలకమని పేర్కొన్నారు. సిటిజన్ ఐడెంటిటీ మేనేజ్‌మెంట్, ఫ్యామిలీ సర్వీస్ డెలివరీ కోసం ఒక యూనిట్‌గా ఉండటం- డేటా మేనేజ్‌మెంట్, సర్వీస్ గ్యారెంటీ, యూజర్ గోప్యతను మెయింటైన్ చేయడంతో పాటు- మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన నొక్కి చెప్పారు. కేపీఎంజీ కి చెందిన శ్రీ చందన్ కె సింగ్, సుభదీప్ బిస్వాస్‌ మాట్లాడుతూ  ప్రభుత్వ రంగంలో సేవా డెలివరీ భవిష్యత్తుకు జెన్ ఏఐ కీలకం కాబోతుందని అంచనా వేశారు. 

 

డిఏపిఆర్జి కార్యదర్శి వి.శ్రీనివాస్, సెషన్‌ను ముగించారు. వీటిపై కొన్ని మున్ముందు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. 

 

  • సేవలు ఇంకా గొప్పగా అందేలా సర్వీస్ డెలివరీని సరళీకృతం చేయడం కోసం యూనివర్సలైజ్డ్ ఫేస్ అథెంటికేషన్ ప్రాసెస్‌ను ప్రోత్సహించడం

  • ఇ-గవర్నెన్స్ కార్యక్రమాలలో భాషిణి, సర్వీస్ ప్లస్ మొదలైనవాటిని చేర్చడం

  • ఇ-సేవలను 160కి పెరగడం తప్పని సరి అయ్యే అపారమైన సంభావ్యత

  • ఇ-ఆఫీస్ అనలిటిక్స్, సైబర్-సెక్యూరిటీ చర్యలపై దృష్టి పెట్టడం 

  • ఫిర్యాదుల పరిష్కారంలో ఏఐ వినియోగం

  • సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఒక యూనిట్‌గా కుటుంబాలను చేరుకోవడం

  • ఇ-కామర్స్ కార్యక్రమాల వైపు ఇంకా ముందుకు వెళ్లడం 

  • ఉత్తమ అభ్యాసాలను వ్యాప్తి చేయడానికి బలమైన మీడియా ఔట్రీచ్ 

  • రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం సహకారం

  • జెన్ ఏఐ  మంచి పద్ధతులను మరింత తెలుసుకోవడానికి, వ్యాప్తి చేయడానికి హ్యాకథాన్‌లు అవసరం.

ఈ సెషన్ ఉత్తమ అభ్యాసాలు, విజయగాథలు, పరిపాలనా సంస్కరణల సాధనలో నేర్చుకున్న పాఠాలను ఇచ్చిపుచ్చుకోడానికి,  డిజిటల్ పరివర్తన రూపురేఖలు మరింత గొప్పగా మార్చడానికి  ఒక వేదికగా ఉపయోగపడింది.

 

****



(Release ID: 1993871) Visitor Counter : 124