రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియాలో జాతీయ రహదారుల కోసం గ్రీన్ కవర్ ఇండెక్స్ అభివృద్ధి, రిపోర్టింగ్ కు సంబంధించి ఎన్.ఆర్.సి.ఎస్. తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్న ఎన్.హెచ్.ఎ.ఐ.

Posted On: 03 JAN 2024 7:19PM by PIB Hyderabad

జాతీయ రహదారుల అధారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఎ.ఐ), ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కింద గల నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్.ఆర్.ఎస్.సి) తో ,గ్రీన్ కవర్ ఇండెక్స్ అభివృద్ధి చేసి రిపోర్టు చేసేందుకు  ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల కాలానికి ఈ ఒప్పందం వర్తిస్తుంది.

2015లో గ్రీన్ హైవేల పాలసీని తీసుకువచ్చిన తర్వాత జాతీయ రహదారులకారిడార్లను హరితమయం చేయడంపై కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖఎన్.హెచ్.ఎ. ఐ లు ప్రధానంగా దృష్టిపెట్టాయి. ప్రస్తుతం ఈ రహదారుల కారిడార్లలో వేసిన మొక్కల పర్యవేక్షణను క్షేత్రస్థాయి సిబ్బంది చూస్తున్నారు.

 

అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించి డాటాను సేకరిస్తారు. అలాగే మొక్కల పెంపకంపర్యవేక్షణపనితీరు ఆడిట్ వంటి వాటిని ఎన్.హెచ్.ఎ.ఐ, , ఎన్ఆర్సిఎస్లు చేపడతాయి. ఇవి దేశవ్యాప్తంగా రోడ్డు కారిడార్ లు ఏమేరకు హరితమయంగా ఉన్నాయన్నదానిని పరిశీలించి జాతీయ రహదారుల విషయంలో గ్రీన్ కవర్ ఇండెక్స్ను రూపొందిస్తాయి. ఇందుకు ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటారు. దీనిద్వారా విశ్వసనీయ సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఫలితంగా  జాతీయ రహదారుల వెంట సూక్ష్మ స్థాయిలో హరిత ప్రాంతం ఏమేరకు ఉందో అంచనా వేయడానికి వీలు కలుగుతుంది. తక్కువ హరిత ప్రాంతం ఉన్న ప్రదేశాలలోతగిన స్థాయిలో హరితప్రాంతాన్ని అభివృద్ధిచేయడానికి ఇది వీలు కల్పిస్తుంది.

 

హైదరాబాద్ కేంద్ర కార్యలయంగా  ఎన్.ఆర్.ఎస్.సి ఉపగ్రహ వ్యవస్థలనుంచి సమాచార  సేకరణకు భూతల స్టేషన్ల ఏర్పాటుకు అధికారం కలిగి ఉంది. అలాగే సుపరిపాలన, జియో స్పాటియల్ సర్వీసుల వంటి వాటికి రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్లను అభివ్రుద్ధి చేయడం కూడా ఈ సంస్థ నిర్వహిస్తున్న  కార్యకలాపాలలో  ఉన్నాయి.ఎన్.ఆర్.ఎస్.సి  ఇప్పటికే జాతీయ రహదారుల వెంట  గ్రీన్  కవర్ ను అంచనా  వేసేందుకు  విజయవంతంగా పైలట్ ప్రాజెక్టును చేపట్టింది.

తొలి  అసెస్ మెంట్ కాలంలో దేశవ్యాప్తంగా జాతీయరహదారులకు సంబంధించి ఆయా  ప్రాంతాల వారీగా గ్రీన్ కవర్ ఇండెక్స్ ను రూపొందించేందుకు  ఈ ప్రాజెక్టు  క్రుషి చేస్తుంది. అలాగే  ఆ తదుపరి  చేపట్టే వార్షిక సమాచార సేకరణ ద్వారా జాతీయ రహదారి కారిడార్లలో శాస్త్రీయపద్ధతిని  ఉపయోగించి హరితప్రాంత వ్రుద్ధిని అంచనా  వేస్తారు. ఈ సమాచారం అధారంగా వివిధ జాతీయరహదారుల గ్రీన్ కవర్ ర్యాంకింగ్ కు అవకాశం కలుగుతుంది.   జాతీయ  రహదారులపై  ప్రతి  కిలో మీటర్ కు గ్రీన్ కవర్ను అంచనా వేస్తారు. ఈచర్యలు జాతీయ రహదారులను హరితమయంచేసేందుకు ఎన్.హెచ్.ఎ.ఐ సాగిస్తున్న క్రుషిని ,తద్వారా మొత్తంగా దేశ పర్యావరణ  పరిరక్షణకు  సాగిస్తున్న  క్రుషిని  తెలియజేస్తున్నాయి.

 

***

 

 

 

(Release ID: 1993355) Visitor Counter : 112