వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
భారతీయ బొమ్మల పరిశ్రమ 2014-15 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో దిగుమతుల్లో 52% క్షీణత మరియు ఎగుమతులు 239% పెరిగాయి.
ప్రభుత్వం బొమ్మల పరిశ్రమ కోసం చేసిన కృషి ప్రయత్నాలు తయారీ యూనిట్లను రెట్టింపు చేయడానికి, దిగుమతి చేసుకున్న ఇన్‌పుట్‌లను 33% నుండి 12%కి తగ్గించడానికి మరియు సగటు వార్షిక వృద్ధి రేటు 10% ద్వారా స్థూల అమ్మకాల విలువను పెంచడానికి దారితీసింది.
Posted On:
04 JAN 2024 5:00PM by PIB Hyderabad
2014-15 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతీయ బొమ్మల పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధించింది, దిగుమతులు 52% క్షీణించడం, ఎగుమతులు 239% పెరగడం మరియు దేశీయ మార్కెట్లో లభించే బొమ్మల మొత్తం నాణ్యత అభివృద్ధి చెందడం. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్యం (డిపిఐఐటి)అభివృద్ధి శాఖ (డిపిఐఐటి) ఆదేశాల మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) లక్నో నిర్వహించిన “సక్సెస్ స్టోరీ ఆఫ్ మేడ్ ఇన్ ఇండియా టాయ్స్” అనే కేస్ స్టడీలో ఈ పరిశీలనలు గుర్తించబడ్డాయి.
భారతీయ బొమ్మల పరిశ్రమకు మరింత అనుకూలమైన ఉత్పాదక పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో ప్రభుత్వ ప్రయత్నాలు ఫలితాలివ్వడం ప్రారంభించాయని నివేదిక పేర్కొంది. 2014 నుండి 2020 వరకు 6 సంవత్సరాల వ్యవధిలో, ఈ అంకిత ప్రయత్నాల వల్ల తయారీ యూనిట్ల సంఖ్య రెట్టింపు కావడం, దిగుమతి చేసుకున్న ఇన్‌పుట్‌లపై ఆధారపడటం 33% నుండి 12% వరకు తగ్గడం, స్థూల అమ్మకపు విలువ సి ఏ జి ఆర్ 10% పెరుగుదల మరియు కార్మిక ఉత్పాదకతలో మొత్తం పెరుగుదలకు దారితీసిందని ఇది హైలైట్ చేసింది.
యూ ఏ ఈ మరియు ఆస్ట్రేలియాతో సహా దేశాల్లో దేశీయంగా తయారు చేయబడిన బొమ్మలకు జీరో-డ్యూటీ మార్కెట్ అందుబాటు తో పాటు, ప్రపంచ బొమ్మల విలువ వ్యవస్థ లో దేశం అనుసంధానం కావడం వల్ల భారతదేశం కూడా అగ్రగామి ఎగుమతి దేశంగా ఎదుగుతోందని నివేదిక విశ్లేషించింది. ప్రపంచంలోని ప్రస్తుత బొమ్మల హబ్‌లకు, అంటే చైనా మరియు వియత్నాంలకు భారతదేశాన్ని ఒక ఆచరణీయ ప్రత్యామ్నాయంగా ఉంచడానికి, సాంకేతికతలో పురోగతికి, ఇ-కామర్స్‌ను ప్రోత్సహించడానికి, భాగస్వామ్యాలు మరియు ఎగుమతులు, బ్రాండ్-బిల్డింగ్‌లో పెట్టుబడి పెట్టడం, పిల్లలతో సంభాషించడం అధ్యాపకులు మరియు తల్లిదండ్రులతో నిమగ్నమవ్వడం, సాంస్కృతిక వైవిధ్యానికి విలువ ఇవ్వడం మరియు ప్రాంతీయ కళాకారులతో కలిసి పనిచేయడం మొదలైనవి బొమ్మల పరిశ్రమ మరియు ప్రభుత్వం యొక్క స్థిరమైన సహకార ప్రయత్నాలు అవసరమని నివేదిక పేర్కొంది. .
ఈ సమస్యలను పరిష్కరించడానికి మరియు భారతీయ బొమ్మల పరిశ్రమలో వృద్ధిని పెంపొందించడానికి, వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక అవసరమని నివేదిక నొక్కి చెప్పింది. ప్రభుత్వం ఈ దిగువ వాటితో సహాఅనేక జోక్యాలు మరియు కార్యక్రమాలను అమలు చేసింది:
a) 21 నిర్దిష్ట కార్యాచరణ పాయింట్లను కలిగి ఉన్న సమగ్ర ఎన్ ఏ పి టి ని రూపొందించడం మరియు 14 కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లు, డి పి ఐ ఐ టి సమన్వయ సంస్థగా అమలు చేయడం.
బి).బొమ్మలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ (హెచ్ ఎస్ కోడ్ 9503) ఫిబ్రవరి 2020లో 20% నుండి 60%కి, ఆ తర్వాత మార్చి 2023లో 70%కి పెంచబడింది.
సి ) నాసిరకం బొమ్మల దిగుమతిని అరికట్టడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ద జి ఎఫ్ టి ) ప్రతి దిగుమతి సరుకుకు నమూనా పరీక్షను తప్పనిసరి చేసింది
డి ) బొమ్మల కోసం క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (ఖ్యూ సి ఓ ) 2020లో జారీ చేయబడింది, ఇది 01.01.2021 నుండి అమలులోకి వచ్చింది.
ఇ) ఒక సంవత్సరం పాటు టెస్టింగ్ సదుపాయం లేకుండా మరియు అంతర్గత పరీక్షా సదుపాయాన్ని ఏర్పాటు చేయకుండానే మైక్రో సేల్ యూనిట్ల తయారీకి లైసెన్సులను మంజూరు చేయడానికి బి ఐ ఎస్ 17.12.2020న ప్రత్యేక నిబంధనలను నోటిఫై చేసింది, దీనిని మూడు సంవత్సరాలు పొడిగించారు.
ఎఫ్ ) బి ఐ ఎస్ ప్రామాణిక మార్కులతో బొమ్మల తయారీకి దేశీయ తయారీదారులకు 1200 కంటే ఎక్కువ లైసెన్స్‌లను మరియు విదేశీ తయారీదారులకు 30 కంటే ఎక్కువ లైసెన్స్‌లను మంజూరు చేసింది.
జి ). దేశీయ బొమ్మల పరిశ్రమకు మద్దతుగా క్లస్టర్-ఆధారిత విధానం అనుసరించబడింది. ఎం ఎస్ ఎం ఈ మంత్రిత్వ శాఖ సాంప్రదాయ పరిశ్రమల పునరుత్పత్తి కోసం నిధుల పథకం కింద 19 బొమ్మల తయారీ క్లస్టర్‌లకు మద్దతునిస్తోంది మరియు టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ 13 బొమ్మల తయారీ క్లస్టర్‌లకు రూపకల్పన మరియు సాధనాల మద్దతును అందిస్తోంది.
హెచ్ ).ఇండియన్ టాయ్ ఫెయిర్ 2021, టాయ్‌కాథాన్ మొదలైన వాటితో సహా దేశీయ బొమ్మలను ప్రోత్సహించడానికి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అనేక ప్రచార కార్యక్రమాలు కూడా చేపట్టారు.
నివేదికలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా, ప్రభుత్వం ఎన్ ఏ పి టి కింద ఇప్పటికే చర్యలు ప్రారంభించింది/ చేపట్టింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 2020లో తన “మన్ కీ బాత్” ప్రసంగంలో భారతదేశాన్నిప్రపంచ బొమ్మల తయారీ కేంద్రం గా చేయాలనే తన కోరికను వ్యక్తం చేశారు. ఆయన దృష్టిని నెరవేర్చడానికి, బొమ్మల రూపకల్పనను ప్రోత్సహించడం, బొమ్మలను అభ్యాస వనరుగా ఉపయోగించడం, బొమ్మల నాణ్యతను పర్యవేక్షించడం, స్వదేశీ బొమ్మల సమూహాలను ప్రోత్సహించడం కోసం బొమ్మల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ ఏ పి టి) వంటి సమగ్ర రూపకల్పనతో సహా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ,
దేశీయ తయారీదారుల ప్రయత్నాలతో పాటు ప్రభుత్వం యొక్క విధాన కార్యక్రమాలు భారతీయ బొమ్మల పరిశ్రమ యొక్క అద్భుతమైన వృద్ధికి దారితీశాయి.
***
(Release ID: 1993280)
Visitor Counter : 244