కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భయాందోళనలు సృష్టించే లక్ష్యంతో అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ గురించి ప్రజలకు డాట్ హెచ్చరిక
అటువంటి కాల్స్ గురించి డాట్ లేదా టెలికాం సేవల సంస్థకు చెప్పాలని ప్రజలకు సూచన
Posted On:
04 JAN 2024 5:08PM by PIB Hyderabad
భారతదేశ స్టాక్ ఎక్స్ఛేంజీలు & ట్రేడింగ్‌కు అంతరాయం కలిగిస్తారంటూ అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని టెలికమ్యూనికేషన్స్ విభాగం డాట్ ప్రజలకు సూచించింది. భయాందోళనలను సృష్టించే లక్ష్యంతో దేశ వ్యతిరేక శక్తులు అలాంటి ఫోన్ కాల్స్‌ను సృష్టిస్తున్నాయని పేర్కొంది.
అలాంటి నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్‌ను బ్లాక్ చేయాలని అన్ని టెలికాం సేవల సంస్థలను డాట్ ఆదేశించింది. ఆ తరహా కాల్స్ వస్తే help-sancharsaathi[at]gov[dot]in ద్వారా డాట్‌కు, లేదా టెలికాం సేవల సంస్థకు చెప్పాలని ప్రజలకు డాట్ సూచించింది.
***
(Release ID: 1993263)
Visitor Counter : 156