మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్యా మంత్రిత్వ శాఖ ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది
అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమం కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించబడింది
प्रविष्टि तिथि:
04 JAN 2024 4:24PM by PIB Hyderabad
పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం, విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం 'ప్రేరణ - అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమం' ప్రారంభించింది, పాల్గొనే వారందరికీ అర్ధవంతమైన, ప్రత్యేకమైన మరియు స్ఫూర్తిదాయకమైన అనుభవాన్ని అందించడం, తద్వారా వారిని నాయకత్వ లక్షణాలతో శక్తివంతం చేయడం.
జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి) 2020 యొక్క పునాది అయిన భారతీయ విద్యా వ్యవస్థ యొక్క సూత్రాలను మరియు విలువ-ఆధారిత విద్య యొక్క తాత్వికతను ఏకీకృతం చేయడానికి ప్రేరణ బలమైన నిబద్ధతతో నడుపబడుతోంది.
ప్రేరణ IX నుండి XII తరగతి వరకు ఎంపిక చేయబడిన విద్యార్థుల కోసం ఒక వారం రోజుల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఇది వారసత్వం మరియు ఆవిష్కరణలను కలిసే అత్యుత్తమ తరగతి సాంకేతికతతో విద్యార్థులకు ప్రయోగాత్మకమైన మరియు స్ఫూర్తిదాయకమైన అభ్యాస కార్యక్రమం. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతి వారం ఎంపిక చేసిన 20 మంది విద్యార్థులు (10 మంది బాలురు మరియు 10 మంది బాలికలు) ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
1888లో గుజరాత్‌లో భారతదేశంలోని పురాతన నగరాలలో ఒకటైన వడ్‌నగర్ మెహసానా జిల్లా లో స్థాపించబడిన వ్యావహారిక పాఠశాల నుండి ప్రేరణ కార్యక్రమం నడుస్తుంది. భూకంపాలు మరియు ప్రకృతి వైపరీత్యాల వంటి సవాళ్లపై విజయం సాధించిన సజీవ నగరమైన వడ్‌నగర్ లోని ఈ పాఠశాల తిరుగులేని స్ఫూర్తికి నివాళిగా నిలుస్తుంది మరియు చారిత్రక కాలం నుండి మరియు ఆధునిక కాలంలో కూడా కొనసాగుతున్న పురాతన వారసత్వ ప్రదేశాలు మరియు స్మారక చిహ్నాలకు నిలయంగా ఉంది. అసాధారణ జీవితాలు తరచుగా వారి మూలాలను సాధారణ పునాదులలో కనుగొంటాయనే వాస్తవాన్ని పాఠశాల సూచిస్తుంది. భారతదేశం యొక్క ఘనమైన నాగరికత కాలాతీత విజ్ఞానంపై ఆధారపడిన, ఈ విశిష్ట చొరవ ఈ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన మన గౌరవ ప్రధాన మంత్రి యొక్క సూత్రాలు మరియు ఆదర్శాలకు అనుగుణమైన దృక్పథాన్ని కలిగి ఉంది.
ఐ ఐ టీ గాంధీ నగర్ రూపొందించిన ప్రేరణ స్కూల్ పాఠ్యాంశాలు తొమ్మిది విలువ ఆధారిత థీమ్‌లతో రూపుదిద్దుకున్నాయి: స్వాభిమానం మరియు వినయం, శౌర్యం మరియు సాహసం, పరిశ్రమ మరియు సమర్పణ కరుణ మరియు సేవ, వివిధ మరియు ఏకత, సత్యనిష్ఠ మరియు శుచిత, నవాచార్ మరియు జిజ్ఞాస, శ్రద్ధ మరియు విశ్వాసం మరియు స్వతంత్రత మరియు కర్తవ్యం ఇతివృత్తాలపై ఆధారపడిన కార్యక్రమం. ఇది యువతకు స్ఫూర్తినిస్తుంది మరియు భిన్నత్వంలో భారతదేశం యొక్క ఏకత్వం పట్ల గౌరవాన్ని పెంపొందిస్తుంది, "వసుధైవ కుటుంబకం" స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది మరియు నేటి యువతను వికసిత్ భారత్‌కు దీపధారి గా చేయడం ద్వారా దోహదపడుతుంది. ఈ ప్రయత్నంలో పాల్గొనేవారు ప్రతిష్టాత్మక సంస్థల మార్గదర్శకులచే మార్గనిర్దేశం చేయబడతారు.
రోజు వారీ కార్యక్రమం షెడ్యూల్‌లో యోగా, ఏకాగ్రత మరియు ధ్యానం సెషన్‌లు ఉంటాయి, తర్వాత అనుభవపూర్వక అభ్యాసం, నేపథ్య సెషన్‌లు మరియు ఆసక్తికరమైన అభ్యాస కార్యకలాపాలు ఉంటాయి. సాయంత్రం కార్యకలాపాలలో పురాతన మరియు వారసత్వ ప్రదేశాల సందర్శనలు, స్ఫూర్తిదాయకమైన చలనచిత్ర ప్రదర్శనలు, లక్ష్య జీవన సృజనాత్మక కార్యకలాపాలు, నైపుణ్య ప్రదర్శనలు మొదలైనవి సంపూర్ణ అభ్యాస విధానాన్ని నిర్ధారిస్తాయి. ఇది కాకుండా, విద్యార్థులు విభిన్న కార్యకలాపాలలో పాల్గొంటారు, స్వదేశీ విజ్ఞాన వ్యవస్థలు, నూతన అత్యాధునిక సాంకేతికతలు మరియు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల నుండి నేర్చుకుంటారు. ప్రతిష్టాత్మకమైన మరియు ఆకాంక్షాత్మకమైన ప్రేరణ కార్యక్రమంలో భాగం కావడానికి దరఖాస్తు చేయదలచిన విద్యార్థులు పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అవసరమైన వివరాలను పూరించవచ్చు. నమోదు చేసుకున్న దరఖాస్తుదారులు పోర్టల్‌లో సూచించిన విధంగా ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడతారు. దరఖాస్తుదారులు పాఠశాల/బ్లాక్ స్థాయిలో, నియమించబడిన 'ప్రేరణ ఉత్సవ్' రోజున, మన దేశం యొక్క భవిష్యత్తును రూపొందించడానికి ఆసక్తి ఉన్న సంపూర్ణ వ్యక్తిత్వాల కోసం మూల్యాంకనం చేయడానికి ప్రేరణ యొక్క విధి విధానాల ఆధారంగా వివిధ కార్యకలాపాల ద్వారా కూడా ఎంపిక ప్రక్రియలో చేరవచ్చు. ఎంపిక చేసిన తర్వాత, 20 మంది (10 మంది బాలురు మరియు 10 మంది బాలికలు) ప్రేరణ కార్యక్రమానికి హాజరవుతారు మరియు ప్రేరణ, ఆవిష్కరణ మరియు స్వీయ-ఆవిష్కరణతో కూడిన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కార్యక్రమం తర్వాత, పాల్గొనేవారు తమ తమ సమాజాలలోకి ప్రేరణ యొక్క తత్వాన్ని తీసుకువెళతారు, మార్పు చేసేవారుగా మారతారు మరియు ఇతరులను ప్రేరేపించడానికి సానుకూల మార్పును రేకెత్తిస్తారు. ప్రేరణ కోసం నమోదు చేసుకోవడానికి, IX నుండి XII తరగతి విద్యార్థులు prerana.education.gov.inని సందర్శించవచ్చు.
***
(रिलीज़ आईडी: 1993154)
आगंतुक पटल : 603