బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాణిజ్య వేలం కింద కేటాయించిన గనుల నుంచి జరుగుతున్న బొగ్గు ఉత్పత్తిని సమీక్షించిన బొగ్గు మంత్రిత్వ శాఖ


50 క్యాప్టివ్/ వాణిజ్య బొగ్గు గనులలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి. విద్యుత్ రంగానికి 32 గనుల కేటాయింపు

2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు 26% పెరిగిన క్యాప్టివ్/వాణిజ్య బొగ్గు గనుల ఉత్పత్తి

2023 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు 32% పెరిగిన బొగ్గు రవాణా

Posted On: 04 JAN 2024 4:14PM by PIB Hyderabad

50 క్యాప్టివ్/ వాణిజ్య బొగ్గు   గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న తీరును కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ఎం. నాగరాజు అధ్యక్షతన జరిగిన  ఉన్నత స్థాయి సమావేశం  03.01.2024 న సమీక్షించింది. బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెంచడానికి కేటాయింపుదారులు  చేస్తున్న కృషిని సమావేశంలో శ్రీ నాగరాజు ప్రశంసించారు.  2023-24 ఆర్థిక సంవత్సరంలో  బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి మరింత కృషి చేయాలని వారికి సూచించారు. తుది దశలో ఉన్న బొగ్గు బ్లాకుల నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని  సూచించారు.

31 డిసెంబర్ 2023 నాటికి, 50 క్యాప్టివ్ / వాణిజ్య బొగ్గు గనుల్లో బొగ్గు   ఉత్పత్తి జరుగుతోంది.  వీటిలో 32 గనులను  విద్యుత్ రంగానికి కేటాయించారు.  11 గనులను  నాన్ రెగ్యులేటెడ్ రంగానికి కేటాయించారు. ఏడు గనులు బొగ్గు అమ్మకాలు సాగిస్తున్నాయి..  2020లో వాణిజ్య బొగ్గు గనుల వేలం ప్రారంభమయింది.  ప్రారంభమైన మూడున్నరేళ్ల కాలంలో  14.87 మిలియన్ టన్నుల (ఎంటీ) క్యుములేటివ్ పీక్ రేటెడ్ కెపాసిటీ (పీఆర్సీ) కలిగిన ఆరు గనులు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించాయి.

2023 డిసెంబర్  నెలలో క్యాప్టివ్,వాణిజ్య బొగ్గు గనుల నుండి మొత్తం  14.04 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. అంతకుముందు సంవత్సరం ఇదే నెలలో 10.14 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగింది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి  38% పెరిగింది.  అదే సమయంలో, క్యాప్టివ్, వాణిజ్య బొగ్గు గనుల నుంచి  13.32 మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణా అయింది.  2022 డిసెంబర్ లో 9.58 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. గత ఏడాదితో పోల్చి చొస్తే ఈ ఏడాది డిసెంబర్ లో జరిగిన బొగ్గు రవాణా  39% పెరిగింది. 2023 డిసెంబర్ నెలలో సగటున రోజుకు 4.3 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగింది.

2023 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు క్యాప్టివ్,వాణిజ్య  బ్లాకుల నుంచి బొగ్గు ఉత్పత్తి, తరలింపు గణనీయమైన వృద్ధి కనబరిచాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు క్యాప్టివ్ ,వాణిజ్య  బొగ్గు గనుల నుండి మొత్తం బొగ్గు ఉత్పత్తి సుమారు 98 మెట్రిక్ టన్నులు కాగా, మొత్తం బొగ్గు పంపిణీ 103 మెట్రిక్ టన్నులుగా ఉంది, ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే ఉత్పత్తి  26%, రవాణా  32% వృద్ధిని కనబరిచాయి.  నాన్ రెగ్యులేటెడ్ రంగంలో బొగ్గు  ఉత్పత్తి 98 శాతం , కమర్షియల్ బొగ్గు గనుల్లో 101 శాతం  ఉత్పత్తి పెరిగింది.

బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సాధించిన ప్రగతిని కొనసాగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. లక్ష్యాల మేరకు ఉత్పత్తి, రవాణా జరిగేలా చూసేందుకు బోగు మంత్రిత్వ శాఖ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. .

దేశ ఇంధన భవిష్యత్తును రక్షించడం, ఆర్థిక వృద్ధికి మరింత సహకారం అందించడం లక్ష్యంగా  మంత్రిత్వ శాఖ పని చేస్తోంది. 

***


(Release ID: 1993151)