సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav g20-india-2023

విజయ గాథ: వ్యవస్థాపకుల వృద్ధికి తోడ్పడుతున్నపీఎంఈజీపీ రుణం

Posted On: 03 JAN 2024 4:02PM by PIB Hyderabad

మిస్టర్ సుమిత్ రౌత్ అనే నిరుద్యోగ యువకుడు క్యాడ్-కామ్ విభాగంలో ఎంటెక్ పూర్తి చేసిన తర్వాత చాలా కాలంగా ఉద్యోగం కోసం ఆన్వేషించారు. తన ఉద్యోగాల వేట సాగుతుండగా నాగ్‌పూర్‌లోని ఉద్యోగ్ భవన్‌లో ఎంసీఈడీ శిక్షణా కార్యక్రమానికి హాజరైన అతను ఎంజీఐఆర్ఐ, వార్ధా గురించి తెలుసుకున్నాడు. అతను వెంటనే ఎంజీఐఆర్ఐకి వెళ్లి వివిధ విభాగాలు అందించే వివిధ శిక్షణలు/ సాంకేతికతలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాడు. అతను అలోవెరా ఆధారిత ఉత్పత్తులపై శిక్షణా కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే తనకు  కలబందను పండించడానికి ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించటానికి గాను కొన్ని ఎకరాల పొలం ఉంది. మే, 2016లో అతను బయో-ప్రాసెసింగ్ మరియు హెర్బల్ విభాగంలో డాక్టర్ ఆదర్శ్ కుమార్ అగ్నిహోత్రి మార్గదర్శకత్వంలో కలబంద ఆధారిత ఉత్పత్తిపై 5 రోజుల శిక్షణ తీసుకున్నాడు. బీ&హెచ్ విభాగంలో శిక్షణ పూర్తయిన వెంటనే, అతను తన పొలంలో కలబందను పండించాడు మరియు అలోవెరా ఆధారిత ఉత్పత్తులైన హ్యాండ్ వాష్, షాంపూ, మాయిశ్చరైజింగ్ జెల్ మరియు జ్యూస్‌ల ఉత్పత్తిని ప్రారంభించాడు. వినియోగదారుల నుండి మంచి స్పందన లభించిన తర్వాత, ఆయన అయా ఉత్పదకాల ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించారు. ఇందుకు కొన్ని యంత్రాలు మరియు చాలా పెద్ద సెటప్ అవసరం; అనంతరం ఆయన పీఎంఈజీపీ పథకం కింద రుణం తీసుకున్నాడు. అనంతరం ఆయన యావత్మాల్ జిల్లా రాలేగావ్ వద్ద "మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్స్" పేరుతో ఒక యూనిట్‌ను ప్రారంభించాడు.

****



(Release ID: 1993083) Visitor Counter : 82