సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

విజ‌య గాథ‌- ఊర‌గాయ‌ల త‌యారీలో ఆర్ధిక స‌హాయం, వృత్తిప‌ర‌మైన శిక్ష‌ణ‌

Posted On: 03 JAN 2024 4:00PM by PIB Hyderabad

 కేవ‌లం హ‌య్య‌ర సెకెండ‌రీ పాఠ‌శాల విద్య నేప‌థ్యం క‌లిగిన 41 ఏళ్ళ యువ‌కుడు ప్ర‌వీణ్ ధూల్ ఎంజిఐఆర్ఐలోని బ‌యో ప్రాసెసింగ్‌, హెర్బ‌ల్ డివిజ‌న్ లో డాక్ట‌ర్ అప‌రాజిత వ‌ర్ధ‌న్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఏప్రిల్ 2015 నుంచి మార్చి 2016 మ‌ధ్య కాలంలో వివిధ ర‌కాల ఊర‌గాయ‌లు పెట్ట‌డంలో శిక్ష‌ణ పొందాడు. అత‌డు వార్ధాలోని, స‌వాంగి మేఘెలోని మాస్ట‌ర్ కాల‌నీకి చెందిన వాడు. అత‌డు కిరాణా షాపు న‌డిపేవాడు. త‌న వ్యాపారాన్ని విస్త‌రించ‌డంలో భాగంగా ఇంటివ‌ద్దే ఊర‌గాయాలు పెట్టి అమ్మే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ, అత‌డు బ్యాచ్ స‌మ‌రూప‌త స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నాడు. ఈ  స‌మ‌స్య ప‌రిష్కారం కోసం అత‌డు జిల్లా ఉద్యోగ కేంద్ర‌, న‌వార్ధాను సంద‌ర్శించ‌గా, అత‌డికి ఎంజిఐఆర్ఐ శిక్ష‌ణా కార్య‌క్ర‌మం గురించి స‌మాచారం ల‌భించింది. 
ఎంజిఐఆర్ఐ లో త‌న శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా పూర్తి చేసిన వెంట‌నే అత‌డు, రోజుకు 100 కిల‌లో చొప్పున వార్ధాలోని స‌వాంగీ మేఘెలోని మాస్ట‌ర్ కాల‌నీ నుంచే వివిధ ర‌కాల ఊర‌గాయాల‌ను త‌యారు చేయ‌డం ప్రారంభించాడు. వివిధ ర‌కాల ఊర‌గాయల నెల‌స‌రి అమ్మ‌కాల మొత్తం 1.5 ల‌క్ష‌ల రూపాయ‌లు కాగా, అందులో లాభం రూ. 40-45వేలు. అత‌డు న‌లుగురు వ్య‌క్తుల‌కు ఉపాధిని అందిస్తున్నాడు. ముద్రా రుణ ప‌థ‌కం కింద ఆర్ధిక స‌హాయాన్ని అందుకున్నాడు. సుమేధ గృహ ఉద్యోగ్ అన్న బ్రాండ్ పేరుతో స్థానికంగాను, రాష్ట్ర స్థాయిలోనూ మార్కెటింగ్ చేస్తున్నాడు. 
అత‌డు ఊర‌గాయల ఉత్ప‌త్తిని ప్రారంభించిన త‌ర్వాత ఉత్ప‌త్తిలో కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన‌గా, ఎంఐజిఐఆర్ఐ బ‌యోప్రాసెసింగ్‌, హెర్బ‌ల్ డివిజ‌న్ లో మార్గ‌ద‌ర్శ‌నం చేస్తూ అత‌డి స‌మ‌స్య‌ను ఎంజిఐఆర్ఐ పరిష్క‌రించింది. ఊర‌గాయల త‌యారీలో బ‌యో ప్రాసెసింగ్‌& హెర్బ‌ల్ డివిజ‌న్ ద్వారా అత‌డు సాంకేతిక మ‌ద్ద‌తును నిత్యం తీసుకుంటున్నాడు. అత‌డికి భ‌విష్య‌త్‌లో కూడా దానిని అందిస్తారు. 
అత‌డు త‌న వ్యాపారాన్ని చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి విస్త‌రించాల‌ని భావిస్తున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు ప్రాథ‌మికంగా ఆవ‌కాయ‌, మిర‌ప‌కాయ‌, నిమ్మ‌కాయ‌, ఉసిరి, క్యారెట్‌తో చేసిన ఊర‌గాయ‌ల‌ను త‌యారు చేస్తున్నాడు. అత‌డు ఇత‌ర ఊర‌గాయ‌ల‌ను ఉత్ప‌త్తిని కూడా ప్రారంభించ‌వ‌చ్చు. 

 

***


(Release ID: 1992933) Visitor Counter : 110