పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
నమీబియా చిరుత ఆశాకు మూడు పిల్లలు జన్మించాయని వెల్లడించిన కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్
Posted On:
03 JAN 2024 4:43PM by PIB Hyderabad
కునో జాతీయ పార్కు ముగ్గురు కొత్త సభ్యులను స్వాగతించిందని వెల్లడించిన కేంద్ర పర్యావరణం & అటవీ శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, తన సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. నమీబియా చిరుత ఆశాకు మూడు పిల్లలు జన్మించాయని చెప్పారు.
పర్యావరణ సమతౌల్యాన్ని పునరుద్ధరించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక కార్యక్రమం 'ప్రాజెక్ట్ చిరుత'కు ఇది గొప్ప విజయమని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ప్రాజెక్టులో పాలుపంచుకున్న నిపుణులను, కునో వన్యప్రాణి అధికారులను, భారతదేశంలోని వన్యప్రాణి ప్రేమికులకు శ్రీ యాదవ్ అభినందనలు తెలిపారు.
***
(Release ID: 1992926)
Visitor Counter : 271