ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్య భారతదేశంలో వ్యవసాయ-ఉద్యాన రంగం అభివృద్ధి
'ఎన్ఈ ఫ్రెష్' బ్రాండ్ కింద 140 మెట్రిక్ టన్నులకు పైగా ఉత్పత్తులను సేకరించిన ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
2023 లో తమ ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్ కోసం ఎన్ఈఆర్ఏఎంఏసీ సహకారం పొందిన సుమారు 30 మంది స్థానిక పారిశ్రామికవేత్తలు / ఎంఎస్ఎంఈలు
జి.ఐ. ట్యాగ్ ఉన్న ఉత్పత్తుల మార్కెటింగ్ కొరకు ఎన్ఈఆర్ఏఎంసీ ప్రీమియం బ్రాండ్ ' ను ప్రారంభించిన ఎన్ఈఆర్ఏఎంసీ
అస్సాంలోని మూడు జిల్లాల్లో 750 మంది రైతులకు ప్రయోజనం కలిగిస్తూ 900 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కల పెంపకాన్నిచేపట్టిన ఈశాన్య చెరకు, వెదురు అభివృద్ధి మండలి
చెరకు,వెదురులో 21 శిక్షణ /నైపుణ్య అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి 463 మందికి పైగా శిక్షణ ఇచ్చిన ఈశాన్య చెరకు, వెదురు అభివృద్ధి మండలి
Posted On:
03 JAN 2024 11:55AM by PIB Hyderabad
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఈశాన్య ప్రాంత వ్యవసాయ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఈఆర్ఏఎంసీ) కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈశాన్య ప్రాంతానికి చెందిన రైతులు/ ఉత్పత్తిదారుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు లభించేలా చేయడానికి, వ్యవసాయాన్ని పెంపొందించడానికి ఎన్ఈఆర్ఏఎంసీ సహకారం అందిస్తుంది. వ్యవసాయ, సేకరణ, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
'ఎన్ఇ ఫ్రెష్' బ్రాండ్ కింద విక్రయించడానికి 2023 లో ఎన్ఈఆర్ఏఎంసీ 140 మెట్రిక్ టన్నులకు పైగా అనాస , అవోకాడో, బ్లాక్ రైస్, జీడిపప్పు, పెద్ద యాలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వంటి ఉత్పత్తులను సేకరించింది. తాజా అనాస ఇతర కూరగాయల ఉత్పత్తులకు సంస్థ మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది.
రిటైల్ విభాగంలో 130 పైగా ఉత్పత్తులను ఎన్ఈఆర్ఏఎంసీ వినియోగదారులకు అందిస్తోంది. ప్రాసెస్ చేసిన ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం సుమారు 30 మంది స్థానిక పారిశ్రామికవేత్తలు/ ఎంఎస్ఎంఈలు సంస్థ సహకారం పొందుతున్నారు. రిటైల్ ఉత్పత్తుల అమ్మకాల కోసం ఏడు నగరాలు/ పట్టణాల్లో ఎన్ఈఆర్ఏఎంసీ 12 స్టాల్స్ / రిటైల్ అవుట్ లెట్ లను ఏర్పాటు చేసింది. కామాఖ్యా, దిమాపూర్ రైల్వే స్టేషన్లలో వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ (ఓఎస్ఓపీ) స్టాల్స్ ఉన్నాయి.
జిఐ ట్యాగ్ చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం 'నెరామాక్ ప్రీమియం' ను ఎన్ఈఆర్ఏఎంసీ ప్రారంభించింది. వ్యవసాయ, ఉద్యానవన జీఐ గుర్తింపు కోసం ఈ ఏడాది 13 ఉత్పత్తులను గుర్తించింది. గుర్తింపు కోసం 1308 మంది రైతుల నమోదు చేసుకున్నారు. ఈశాన్య ప్రాంతంలో వ్యవసాయ రంగ అభివృద్ధిలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా ఉంటుందని భావిస్తున్నారు.
10,000 రైతు ఉత్పత్తి సంస్థల ఏర్పాటు, ప్రోత్సాహం కోసం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకం కింద 15,500 మంది రైతులు సభ్యులుగా ఈశాన్య ప్రాంతంలో 205 ఎఫ్ పీఓలు ఏర్పాటు అయ్యాయి.
సుమారు 2000 మంది రైతులు/పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగిస్తూ ఎన్ఈఆర్ఏఎంసీ 17 కార్యక్రమాల్లో పాల్గొంది/నిర్వహించింది . ఈ సంవత్సరంలో అగర్తలా లోని ఎన్ఈఆర్ఏఎంసీ జీడిపప్పు ప్రాసెసింగ్ ప్లాంట్ (సిపిపి) తిరిగి ఉత్పత్తి ప్రారంభించింది. మేఘాలయలోని బైర్నిహాట్ ఇంటిగ్రేటెడ్ జింజర్ ప్రాసెసింగ్ ప్లాంట్ (ఐజిపిపి)ని పీపీపీ పద్ధతిలో తిరిగి ప్రారంభించారు.
ఈశాన్య చెరకు, వెదురు అభివృద్ధి మండలి (ఎన్ఈసీబీడీసీ) అస్సాంలోని మూడు జిల్లాల్లో 900 హెక్టార్లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసింది. సామర్థ్య నిర్మాణం, శిక్షణ కార్యక్రమాలకు ఎన్ఈసీబీడీసీ ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్ఇసిబిడిసి 21 శిక్షణ / నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి 463 మందికి చెరకు, వెదురు పెంపకంలో శిక్షణ ఇచ్చింది.
ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈశాన్య ప్రాంత మండలి సమకూర్చిన 448.46 లక్షల రూపాయల ఖర్చుతో నాగాలాండ్ లోని దిమాపూర్ లోని సోవిమా గ్రామంలో వెదురు ఆధారిత క్రాఫ్ట్ కాన్సంట్రేషన్ సెంటర్ ను 2023 నవంబర్ 22న నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నైఫియు రియో పలువురు ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు. నాగాలాండ్ సంప్రదాయ, ఆధునిక చేనేత, హస్తకళలకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యం కల్పించడానికి ఈ కేంద్ర కృషి చేస్తుంది.
అస్సాం, మణిపూర్ లోని ఎన్ఈసీబీడీసీ క్లస్టర్ల కళాకారులకు 115 ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు.
***
(Release ID: 1992720)
Visitor Counter : 210