సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

అసాధారణ ప్రతిభాపాటవాల ఆవిష్కరణ - "దివ్య కళా శక్తి" సాంస్కృతిక కార్యక్రమం దివ్యాంగులపై వెలుగులు నింపింది

Posted On: 03 JAN 2024 12:47PM by PIB Hyderabad

అహ్మదాబాద్‌ కాంపోజిట్ రీజనల్ సెంటర్  వికలాంగుల సాధికారత విభాగం అహ్మదాబాద్‌లోని గౌరవ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆడిటోరియంలో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమం "దివ్య కళా శక్తి"ని ప్రదర్శించింది.

 

సెంట్రల్ కాంపోజిట్ రీజినల్ సెంటర్‌లలో ఒకటైన అహ్మదాబాద్‌ నిర్వహించిన ఈ ప్రత్యేకమైన ప్రదర్శన, దివ్యాంగులలో దాగివున్న ప్రతిభను వెలుగులోకి తెచ్చి, ప్రేక్షకులను అలరించే సృజనాత్మకత ప్రపంచాన్ని ఆవిష్కరించింది. ఈ సాంస్కృతిక కార్యక్రమం లో గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, దాద్రా మరియు నగర్ హవేలీ మరియు డామన్ మరియు డయ్యూ నుండి  దివ్యాంగ కళాకారులనుఒకచోట చేర్చారు. మొత్తం 100 మంది దివ్యాంగులు మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలలో తమ కళా ప్రతిభను ప్రదర్శించారు.

 

ఉత్తేజపరిచే బృంద నృత్యాల నుండి మనోహరమైన సోలో ప్రదర్శనలు, మధురమైన బృందగీతాల నుండి మంత్రముగ్ధులను చేసే గీతాలాపనలు మరియు విస్మయపరిచే ప్రత్యేక కళా ప్రదర్శనలు - "దివ్య కళా శక్తి" కళాకారుల అద్భుతమైన సామర్థ్యాలకు నిదర్శనం.

 

విభిన్న సామర్థ్యాలు కలిగిన వ్యక్తులను శక్తివంతం చేయడం కోసం భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ. నారాయణసామి మరియు అహ్మదాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు శ్రీ హస్ముఖ్ భాయ్ సోమాభాయ్ పటేల్‌తో సహా విశిష్ట అతిథులు ఈ వేడుకకు విచ్చేసారు. 

 

సాయంత్రం  జరిగిన సన్మాన కార్యక్రమం లో

కళాకారులు వారి అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా మొత్తం ₹300,000 చెక్కులు అందుకున్నారు. ఈ సంకేతం వారి కళాత్మక విజయాలను గుర్తించడమే కాకుండా వైవిధ్య సమ్మిళిత సమాజాన్ని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను కూడా నొక్కి చెప్పింది.

 

"దివ్య కళా శక్తి" ప్రతి వ్యక్తిలో ఉన్న అడ్డంకులను ఛేదించి, వారిలో నిద్రాణంగా దాగివున్న అపరిమితమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ స్ఫూర్తికి దీటుగా నిలుస్తుంది. ఈ సాంస్కృతిక మహోత్సవం ప్రేక్షకుల హృదయాలను అలరించడమే కాకుండా, దివ్యాంగుల వైవిధ్య భరిత ప్రతిభక పై అవగాహన మరియు ప్రశంసలను పెంపొందించింది.

 

***



(Release ID: 1992719) Visitor Counter : 135