బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

బొగ్గు ఉత్పత్తి డిసెంబర్, 2023లో 10.75% వృద్ధితో, 92.87 మిలియన్ టన్నులకు చేరుకుంది ఎఫ్ వై 2023-24 డిసెంబర్ వరకు సంచిత ఉత్పత్తి లో 12.47% వృద్ధిని నమోదు చేసి 684.31 ఎం టీ కి చేరుకుంది

Posted On: 02 JAN 2024 12:00PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2023లో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలను సాధించింది, ఇది 92.87 మిలియన్ టన్నుల (ఎం టీ)కి చేరుకుంది, అంతకుముందు సంవత్సరం 83.86 ఎం టీ గణాంకాలను ఇది అధిగమించి 10.75% పెరుగుదలను సూచిస్తుంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సి ఐ ఎల్)  డిసెంబర్ 2022లో 66.37 ఎం టీ ఉత్పత్తితో పోలిస్తే  8.27% వృద్ధితో  2023 డిసెంబర్ నెలలో 71.86 ఎం టీ కి పెరిగింది. సంచిత బొగ్గు ఉత్పత్తి (డిసెంబర్ 2023 వరకు) ఎఫ్ వై' 22-23లో అదే కాలానికి 608.34 ఎం టీ తో పోలిస్తే ఎఫ్ వై' 23-24లో 12.47 శాతం వృద్ధి తో 684.31ఎం టీ కి పెరిగింది.  డిసెంబర్ 2023లో బొగ్గు పంపిణీ 86.23 ఎం టీ కి చేరుకుంది, ఇది డిసెంబర్ 2022లో నమోదైన 79.58 ఎం టీతో పోలిస్తే 8.36% వృద్ధి రేటుతో చెప్పుకోదగ్గ పురోగతిని ప్రదర్శిస్తోంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సి ఐ ఎల్) డిస్పాచ్ డిసెంబర్ 2023లో 66.10 ఎం టీ గా ఉంది, ఇది డిసెంబర్ 2022లో 62.66 ఎం టీ తో పోలిస్తే 5.49% వృద్ధిని సూచిస్తుంది. సంచిత బొగ్గు పంపిణీ (డిసెంబర్ 2023 వరకు) 11.36 % వృద్ధితో ఎఫ్ వై' 22-23లో సంబంధిత కాలంలో 637.40 ఎం టీ తో పోలిస్తే ఎఫ్ వై' 23-24లో 709.80 ఎం టీ కి గణనీయంగా పెరిగింది. బొగ్గు రంగం అపూర్వమైన ప్రగతిని కనబరిచింది. ఉత్పత్తి, పంపకం మరియు స్టాక్ స్థాయిలు చెప్పుకోదగిన వృద్ధిని నమోదు చేశాయి. ఈ వృద్ధికి బొగ్గు పిఎస్‌యులు కారణమని చెప్పవచ్చు ఇవే ప్రగతి పధం లో ఉన్నతికి కీలక పాత్ర పోషించాయి. ఇది బొగ్గు సరఫరా గొలుసు యొక్క అంకితభావాన్ని నొక్కి చెబుతూ, దేశవ్యాప్తంగా బొగ్గును నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. బొగ్గు మంత్రిత్వ శాఖ  ఇందన విద్యుత్ శక్తి రంగానికి నమ్మకమైన మరియు నిలకడైన నిరంతరాయ సరఫరాను నిర్ధారిస్తూ సుస్థిరమైన బొగ్గు ఉత్పత్తి మరియు పంపిణీ వృద్ధి కి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

***



(Release ID: 1992438) Visitor Counter : 155