ఆయుష్
ఎండీఎన్ఐవై ఆధ్వర్యంలో జరిగిన సూర్య నమస్కారాల ప్రదర్శనలో పాల్గొన్న వందలాది మంది యోగా ఔత్సాహికులు
Posted On:
02 JAN 2024 4:08PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా (ఎండీఎన్ఐవై) ఈరోజు సామూహిక సూర్య నమస్కారాల ప్రదర్శన నిర్వహించింది. ఎండీఎన్ఐవై లో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వందలాది మంది యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ సత్యజిత్ పాల్, ఎండీఎన్ఐవై డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి భరద్వాజ్ ,ఉన్నతాధికారులు, సిబ్బంది, ఎండీఎన్ఐవై విద్యార్థులు, యోగా ఔత్సాహికులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆసనం, ప్రాణాయామం, ధ్యాన పద్ధతులు మిళితం చేసి చేసే సూర్య నమస్కారాలు ఒక ఆధ్యాత్మిక అభ్యాసం. సూర్య నమస్కారంలో ప్రతి అడుగు ఒక ప్రత్యేక మంత్రాన్ని కలిగి ఉంటుంది. ప్రతి మంత్రం ప్రాణశక్తి (ప్రాణం) పై ప్రత్యక్ష శక్తిని కలిగి ఉంటుంది. సూర్యనమస్కారాలను క్రమం తప్పకుండా అభ్యసించడం వల్ల మానసిక, శారీరక రంగాల్లో సమతుల్య శక్తి వ్యవస్థ అభివృద్ధికి దారితీస్తుంది. కండరాలు, అవయవాలను ఉత్తేజపరుస్తుంది. సూర్య నమస్కారం ఏకాగ్రత, మానసిక ప్రశాంతత కలిగించడానికి కండరాలు , అవయవాలను ప్రేరేపిస్తుంది.
ఆయుష్ మంత్రిత్వ శాఖ 2023 జనవరి 1 నుంచి 14 (దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం లోకి సూర్యుడు ప్రవేశించే మకర సంక్రాంతి రోజు) వరకు భారతదేశం అంతటా ఏకకాలంలో 108 చోట్ల సూర్య దేవాలయాలలో సామూహిక సూర్య నమస్కారాల ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది.దీనికి కొనసాగింపుగా ఆయుష్ మంత్రిత్వ శాఖ రెండవ సామూహిక సూర్య నమస్కారాల ప్రదర్శన ప్రారంభించింది.
సూర్య నమస్కారం అనేది శరీరం, మనస్సు సమన్వయంతో 12 దశలలో చేసే 8 ఆసనాల సమాహారం. దీన్ని ఉదయాన్నే (సూర్యోదయం) చేయడం మంచిది.
ఎండీఎన్ఐవై ఆధ్వర్యంలో 500 మందికి పైగా యోగా సాధకులు సూర్యనమస్కారాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ ప్రసారం చేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఎండీఎన్ఐవై వివిధ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రసారం అయ్యింది.
***
(Release ID: 1992436)
Visitor Counter : 177