రక్షణ మంత్రిత్వ శాఖ
ఉత్తర/మధ్య అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో నిఘా పెంచిన భారత నౌకాదళం
प्रविष्टि तिथि:
31 DEC 2023 12:46PM by PIB Hyderabad
గత కొన్ని వారాలుగా, ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్, ఉత్తర/మధ్య అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ రవాణా మార్గాల్లో వ్యాపార నౌకలపై దాడులు పెరిగాయి. భారత తీరానికి దాదాపు 700 నాటికల్ మైళ్ల దూరంలో ఎంవీ రుయెన్‌పై దాడి జరిగింది, ఇటీవల పోర్‌బందర్‌కు నైరుతి దిశలో దాదాపు 220 నాటికల్ మైళ్ల దూరంలో ఎంవీ కెమ్ ప్లూటోపై డ్రోన్ దాడి జరిగింది. ఈ సంఘటనలు భారత ఈఈజడ్‌కు దగ్గరగా ఉన్న సముద్రంలో జరుగుతున్న అలజడిని సూచిస్తున్నాయి.
ఈ ఘటనలకు ప్రతిస్పందనగా, భారత నౌకాదళం మధ్య/ఉత్తర అరేబియా సముద్రంలో నిఘా, బలగాల స్థాయులను పెంచింది. విధ్వంసక నౌకలు, దాడి నౌకలతో కూడిన నౌకాదళ బృందాలను సముద్ర భద్రత కోసం మోహరించారు. వ్యాపార నౌకలపై దాడులు జరగకుండా ఇవి సాయం చేస్తాయి. సముద్ర ప్రాంతంలో పరిస్థితులపై అవగాహన పెంచుకోవడానికి ఒక సుదూర సముద్ర గస్తీ విమానం, ఆర్‌పీఏల ద్వారా వైమానిక నిఘాను పెంచారు. ఈఈజడ్ భద్రత కోసం భారత నౌకాదళం, తీర రక్షణ దళం సమన్వయంతో పనిచేస్తున్నాయి.
భారత నౌకాదళం జాతీయ సముద్రయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటూ మొత్తం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తుంది. సముద్ర ప్రాంతంలో వ్యాపార నౌకల భద్రత కోసం కట్టుబడి ఉంది.
***
(रिलीज़ आईडी: 1991927)
आगंतुक पटल : 174