రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌకను ముంబైలో ప్రారంభించిన కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్– రక్షణ రంగంలో ‘ఆత్మనిర్భరత’కు ప్రతీకగా అభివర్ణించారు.


75% స్వదేశీ సాంకేతికత, మెరుగుపడిన స్టెల్త్ ఫీచర్లు, అత్యాధునిక పరికరాలతో నిర్మించిన ఈ యుద్ధ నౌక భారతీయ సముద్ర శక్తిని మరింత బలోపేతం చేయడంతోపాటు జాతీయ ప్రయోజనాలను కాపాడుతుంది.

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో 'జలమేవ్ యస్య, బలమేవ్ తస్య' (సముద్రాన్ని నియంత్రించేవాడు సర్వశక్తిమంతుడు) అనే మా సూత్రాన్ని ఐఎన్ఎస్ ఇంఫాల్ బలోపేతం చేస్తుంది: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

భారతీయ శక్తి సామర్థ్యాలతోపాటు కొని శక్తుల అసూయ, ధ్వేషాలు కూడా పెరిగాయి. 'కెమ్ ప్లూటో' & 'సాయిబాబా' అనే వ్యాపార నౌకలపై దాడులకు పాల్పడిన వారిని త్వరలో న్యాయస్థానం ముందుకు తీసుకువస్తాం.

“భారతదేశం హిందూ మహాసముద్ర ప్రాంతంలో నికర భద్రతా ప్రదాత పాత్రను పోషిస్తుంది; స్నేహపూర్వక దేశాలతో కలిసి, సముద్ర వాణిజ్యం మరింత ఎత్తుకు చేరుకునేలా సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచుతాం.

Posted On: 26 DEC 2023 2:40PM by PIB Hyderabad

ఐఎన్ఎస్ ఇంఫాల్, ప్రాజెక్ట్ 15బి  స్టీల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్, డిసెంబర్ 26, 2023న ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో  రక్షణ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో భారత నావికాదళంలోకి ప్రవేశించింది. నాలుగు స్వదేశీ 'విశాఖపట్నం' క్లాస్ డిస్ట్రాయర్‌లలో ఐఎన్ఎస్ ఇంఫాల్ మూడవది.  దీనిని ఇండియన్ నేవీ యొక్క వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) చేత నిర్మించబడింది.

ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఐఎన్ఎస్ ఇంఫాల్‌ను రక్షణలో ‘ఆత్మనిర్భరత’కు  మంచి ఉదాహరణగా అభివర్ణించారు.
 జాతీయ భద్రత పట్ల భారత నావికాదళం, ఎండీఎల్ తోపాటు  ఇతర వాటాదారుల నిబద్ధతకు ఐఎన్ఎస్ ఇంఫాల్ ప్రతిబింబమన్నారు. ఐఎన్ఎస్ ఇంఫాల్ భారతదేశం యొక్క పెరుగుతున్న సముద్ర శక్తికి చిహ్నంగా పేర్కొన్న కేంద్ర మంత్రి.. భారతీయ సముద్ర శక్తిని ఐఎన్ఎస్ ఇంఫాల్ మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మన ‘జలమేవ్ యస్య, బలమేవ్ తస్య’ (సముద్రాన్ని నియంత్రించేవాడు సర్వశక్తిమంతుడు) అనే సూత్రాన్ని బలపరుస్తుందని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు.

ఐఎన్ఎస్ ఇంఫాల్ 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పుతో 7,400 టన్నుల బరువు కలిగి ఉంది. భారతదేశంలో నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలలో ఐఎన్ఎస్ ఇంఫాల్ ఒకటి. ఇది కంబైన్డ్ గ్యాస్ & గ్యాస్ కాన్ఫిగరేషన్‌లో నాలుగు శక్తివంతమైన గ్యాస్ టర్బైన్‌ల ద్వారా నడుస్తుంది. అంతేకాకుండా 30 నాట్‌ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.


ఐఎన్ఎస్ ఇంఫాల్ ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. దేశం యొక్క విభిన్న బలాల సమ్మేళనంగా అభివర్ణించారు. ‘‘ఈ ఓడలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్లో బ్రహ్మోస్ క్షిపణిని అమర్చారు. ఇందులోని టార్పెడో ట్యూబ్ లాంచర్లు లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్ అండ్ టీ)కి చెందినవి.  ర్యాపిడ్ గన్ మౌంట్‌ను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్‌ఇఎల్), మరియు మీడియం రేంజ్ క్షిపణులను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్) సిద్ధం చేశాయి. అదనంగా, అనేక స్టార్టప్‌లు మరియు ఎంఎస్ఎంఈలు దీని నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. అనేక అంశాలు ఐఎన్ఎస్ ఇంఫాల్‌కు ఒక నిర్దిష్ట రూపం ఇచ్చినట్లే, మనం ‘వికసిత్ భారత్’గా మారడానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి పని చేయాలి. ప్రతి పౌరుడు భారతదేశ భద్రత మరియు పురోగతికి వాహకాలు. ఎవరైనా పనిచేసినప్పుడల్లా దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి’’ అని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు మూడు సేవలను ఆధునీకరించడంపై సమాన దృష్టి పెట్టాలనే ప్రభుత్వ సంకల్పాన్ని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అంతకుముందు ప్రభుత్వాలు భూమి ఆధారిత బెదిరింపుల నుండి దేశాన్ని రక్షించడంపై మాత్రమే దృష్టి సారించాయని పేర్కొన్నారు. ఉత్తరాన హిమాలయాలు మరియు పశ్చిమాన పాకిస్తాన్ యొక్క శత్రు ప్రవర్తనతో..  భారతదేశ వస్తువుల వ్యాపారం చాలావరకు సముద్రం ద్వారానే జరుగుతుందని, ఇది 'వాణిజ్యం' దృక్కోణం నుండి ద్వీప దేశంగా మారిందన్నారు. భారతదేశం తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రపంచ వాణిజ్యం చాలా ముఖ్యమైనది కాబట్టి నౌకాదళ సామర్థ్యాలను నిరంతరం అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నొక్కి చెప్పారు.

అరేబియా సముద్రంలో మర్చంట్ వెసెల్ (ఎంవి) కెమ్ ప్లూటోపై ఇటీవల జరిగిన అనుమానిత డ్రోన్ దాడి మరియు ఎర్ర సముద్రంలో 'ఎంవి సాయి బాబా'పై దాడిని కూడా రక్షణ మంత్రి ప్రస్తావించారు. భారతదేశం యొక్క పెరుగుతున్న ఆర్థిక మరియు వ్యూహాత్మక శక్తి కొన్ని శక్తులను అసూయ మరియు ద్వేషంతో నింపిందని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం దాడులను చాలా తీవ్రంగా పరిగణిస్తోందని, నేవీ తన నిఘాను పెంచిందని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ దాడులకు పాల్పడిన వారిని త్వరలోనే కఠినంగా శిక్షించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

“భారతదేశం మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతంలో నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ పాత్రను పోషిస్తోంది. ఈ ప్రాంతంలో సముద్ర వాణిజ్యం మరింత ఎత్తుకు చేరేలా చూస్తాం. ఇందుకోసం మన స్నేహపూర్వక దేశాలతో కలిసి సముద్ర మార్గాలను సురక్షితంగా ఉంచుతాం. మా నౌకాదళం యొక్క సామర్థ్యం మరియు శక్తిపై మాకు పూర్తి విశ్వాసం ఉంది” అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

రక్షణలో స్వావలంబన దృక్పథాన్ని సాధించడంలో భారత నౌకాదళం యొక్క అచంచలమైన నిబద్ధతకు ఐఎన్ఎస్ ఇంఫాల్ ప్రకాశించే చిహ్నంగా ప్రత్యేకతను కలిగి ఉందని నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రభుత్వ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ విజన్‌కి ఇది నిదర్శనమని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ నౌక సముద్రాల నుండి వచ్చే భౌతిక బెదిరింపులను ఎదుర్కోవడమే కాకుండా, సమగ్ర దేశ బలాన్ని కూడా ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. “జాతీయ ఐక్యతకు హాని కలిగించే వివిధ డిజైన్లను ఐఎన్ఎస్ ఇంఫాల్ అడ్డుకుంటుంది. ఇది శత్రువుపై అగ్నిని కురిపిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే దృఢ సంకల్పాన్ని ప్రదర్శిస్తుంది”అని  నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ పేర్కొన్నారు.

నాల్గవ ప్రాజెక్ట్ 15బి స్టెల్త్  గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ 'సూరత్' 2024లో ప్రారంభిస్తామని నేవల్ స్టాఫ్ చీఫ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ ఇంఫాల్‌ను ప్రారంభించే ముందు, ఒకే తరగతికి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం మరియు ఐఎన్ఎస్ మోర్ముగావ్‌లకు చెందిన రెండు డిస్ట్రాయర్‌లు వరుసగా 2021 & 2022లో నౌకాదళంలోకి ప్రవేశించబడ్డాయి.

మర్చంట్ షిప్పింగ్‌పై పైరసీ & డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి భారత నావికాదళం ప్రాజెక్ట్ 15బి & 15ఏ తరగతికి చెందిన నాలుగు డిస్ట్రాయర్‌లను మోహరించినట్లు అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సూచించారు. ఈ బెదిరింపులను ఎదుర్కోవడానికి  పి8I ఎయిర్‌క్రాఫ్ట్, డోర్నియర్స్, సీ గార్డియన్స్, హెలికాప్టర్లు & కోస్ట్ గార్డ్ షిప్‌లను సంయుక్తంగా మోహరించినట్లు ఆయన తెలిపారు.

దేశంలోని ప్రతి జిల్లా, ప్రతి బ్లాక్ మరియు ప్రతి గ్రామం నుండి కనీసం ఒక అగ్నివీర్‌ని చేర్చుకోవాలని నావికాదళం లక్ష్యంగా పెట్టుకుందని నావల్ స్టాఫ్ చీఫ్ తెలిపారు. “దేశంలోని నలుమూలల నుండి యువతను - పురుషులు మరియు మహిళలు ఇద్దరినీ ఆకర్షించడం, సర్వీస్‌లో ఉన్నప్పుడు వారిలో నైపుణ్యాన్ని పెంచడం, విద్యా సంస్థల ద్వారా వారి సామర్థ్యాలను ధృవీకరించడం, జాతీయవాద స్ఫూర్తిని పెంపొందించడం మరియు వారు పౌర రంగంలో తిరిగి చేరేలా చూడటం ఈ వ్యూహమన్నారు. అటువంటి జాతీయవాద శ్రామికశక్తిని దేశం నలుమూలలా వ్యాపింపజేయడమే దృక్పథం” అని ఆయన అన్నారు.

‘‘ఐఎన్ఎస్ ఇంఫాల్” దేశంలోని ఈశాన్య ప్రాంతంలోని ఓ నగరం పేరును పెట్టుకున్న మొట్టమొదటి యుద్ధ నౌకగా గుర్తింపును పొందింది. ఈ ప్రాంతం మరియు మణిపూర్ దేశానికి మరియు భారత నౌకాదళానికి అందించిన సహకారాన్ని ఐఎన్ఎస్ ఇంఫాల్ చాటిచెబుతుంది. 2017,  మే 19న కీలు వేయబడింది. 2019, ఏప్రిల్ 20న ప్రారంభించబడింది. 2023, ఏప్రిల్ 28న సముద్ర జలాల్లో తొలి ప్రయాణాన్ని చేసింది. అంతేకాకుండా సముద్రంలో సమగ్ర ట్రయల్స్ ను పూర్తిచేసింది. ఆ తర్వాత అదే సంవత్సరం అక్టోబర్ 20న పూర్తిగా సిద్ధమైంది. ఆరునెలల తక్కువ  

 దీని కీల్ మే 19, 2017న వేయబడింది మరియు ఓడ ఏప్రిల్ 20, 2019న ప్రారంభించబడింది. ఓడ ఏప్రిల్ 28, 2023న తన తొలి సముద్ర జలాల కోసం ప్రయాణించింది. అంతేకాకుండా హార్బర్ లో , సముద్రంలో ట్రయల్ రన్స్ పూర్తిచేసి, అక్టోబర్ 20న పూర్తిస్థాయిలో ఆరు నెలల కంటే తక్కువ కాలంలో అందుబాటులోకి వచ్చింది. ఐఎన్ఎస్ఇంఫాల్ ను నిర్మించడానికి, ట్రయల్స్ లో పాల్గొనడానికి పట్టే సమయం ఏదైనా స్వదేశీ విధ్వంసక నౌకకు ఇది అతి తక్కువ సమయం. జలప్రవేశానికి ముందే ఐఎన్ఎస్ ఇంఫాల్ బ్రహ్మోస్ మిసైల్ ఫైరింగ్ పరీక్షను విజయవంతంగా పూర్తిచేసి.. ఆయుధ సంసిద్ధంగా ఉన్న నౌకగా అందుబాటులోకి వచ్చింది.

 మహారాష్ట్ర ముఖ్యమంత్రి  ఏక్‌నాథ్ షిండే, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, వెస్ట్రన్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి మరియు డైరెక్టర్ (ఫైనాన్స్) అడిషనల్ ఛార్జ్ ఆఫ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఎండీఎల్ సంజీవ్ సింఘాల్ ఈ  వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు.

ఈ ఓడలో మొత్తం 315 మంది సిబ్బంది ఉంటారు. యు గన్నేరీ మరియు క్షిపణుల నిపుణుడు కెప్టెన్ కేకే చౌదరి నేతృత్వంలో వీనంతా విధులు నిర్వర్తిస్తారు. ఇది దేశం యొక్క సముద్ర భద్రత మరియు ప్రయోజనాలను పరిరక్షించడంలో నేవీ యొక్క సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరిస్తుంది.

ఐఎన్ఎస్ ఇంఫాల్ మెరుగైన స్టెల్త్ లక్షణాలను కలిగి ఉంది.  దీని ఫలితంగా రాడార్ క్రాస్ సెక్షన్ ను తగ్గిస్తుంది. దీని నిర్మాణ ఆకృతి,  పూర్తి బీమ్ సూపర్‌స్ట్రక్చర్ డిజైన్, పూత పూసిన మాస్ట్‌లు మరియు బహిర్గతమైన డెక్‌లపై రాడార్ పారదర్శక పదార్థాన్ని ఉపయోగించడం ద్వారా ఈస్థాయి మెరుగైన ఫలితాన్ని సాధించారు. ఇది సర్ఫేస్-టు -సర్ఫేస్ మిస్సైల్స్, సర్ఫేస్-టు- ఎయిర్ మిస్సైల్స్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ఏఎస్డబ్ల్యూ) రాకెట్ లాంచర్లు & టార్పెడో లాంచర్లు, ఏఎస్డబ్ల్యూ హెలికాప్టర్లు, రాడార్లు, సోనార్‌లతో సహా అధునాతన అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్‌లతోపాటు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్ ఆయుధాలు కలిగి ఉంది.  నౌక అణు, జీవ మరియు రసాయన యుద్ధ పరిస్థితులలో పోరాడటానికి  ఈ వ్యవస్థలను సిద్ధం చేశారు.

ఈ ఓడ యొక్క ప్రత్యేకత ఏమిటంటే..  దాదాపు 75% స్వదేశీ సాంకేతికతతో  నిర్మించబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధన దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది.  స్వదేశీ పరికరాలు/వ్యవస్థలలో కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, రాకెట్ లాంచర్, టార్పెడో లాంచర్, ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ఫారమ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటెడ్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఫోల్డింగ్ హ్యాంగర్ డోర్స్, హెలో ట్రావర్సింగ్ సిస్టమ్, క్లోజ్-ఇన్ వెపన్ సిస్టమ్ మరియు బో -మౌంటెడ్ సోనార్ ఈ నౌకలో ఉన్నాయి. 

 

***



(Release ID: 1991904) Visitor Counter : 85