ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భవ కార్యక్రమం
5 కోట్లకు పైగా ఏబీ హెచ్ ఏ ఖాతాలు
13,84,309 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మేళాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మేళాలు నిర్వహణ
మొత్తం ఆరోగ్య మేళాల్లో
11 కోట్లు దాటిన సందర్శకుల సంఖ్య
6,41,70,297 మందికి ఉచిత మందులు పంపిణీ , 5,10,48,644 మందికి ఉచిత డయాగ్నస్టిక్స్ సేవలు
మొదటి త్రైమాసికంలో 45,43,705 మంది గర్భిణులకు ఏఎన్ సీ తనిఖీ ,రోగనిరోధకత టీకాలు
29,83,565 మంది తల్లులు 49,44,359 మంది పిల్లలకు రోగనిరోధకత టీకాలు
నాడు పోస్టు చేయడమైనది:
29 DEC 2023 11:26AM by PIB Hyderabad
ఆయుష్మాన్ భవ ఏబీహెచ్ఏ ఖాతాల సంఖ్య 5 కోట్లకు పైగా పెరిగింది. 4,44,92,564 ఆయుష్మాన్ భవఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. దేశవ్యాప్తంగా 28.12.2023 వరకు 1,15,923 ఆయుష్మాన్ సభలు జరిగాయి.
ఆయుష్మాన్ భవ పై అవగాహన కల్పించడానికి అమలు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఆరోగ్య మందిర్ మేళాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మేళాలను సందర్శించిన వారి సంఖ్య 11,30,98,010కు చేరింది. దేశవ్యాప్తంగా 13,84,309 ఆరోగ్య మందిర్ మేళాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జరిగాయి.
ఆరోగ్య మేళాలో ఈ క్రింది కార్యకలాపాలు అమలు జరుగుతున్నాయి:-:
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ మేళాలు:
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 13,49,356 మేళాలు విజయవంతంగా జరిగాయి. మేళాలకు 9,76,56,060 మంది ప్రజలు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 9,21,783 వెల్ నెస్, యోగా, మెడిటేషన్ శిబిరాలు నిర్వహించారు. 1,02,90,345 టెలీ కన్సల్టేషన్ నిర్వహించారు. 6,41,70,297 మందికి ఉచిత మందులు, 5,10,48,644 మందికి ఉచిత డయాగ్నస్టిక్స్ సేవలు అందాయి. 74,04,356 మందికి ఆయుష్ సేవలు అందించి , 10,99,63,891 మందికి జీవనశైలి కార్యకలాపాలపై కౌన్సిలింగ్ ఇచ్చారు
మొదటి త్రైమాసికంలో 45,43,705 మంది గర్భిణులు నమోదు అయ్యారు. 28.12.2023 వరకు వీరిలో 29,83,565 మందికి మొదటి సంపూర్ణ న్యూట్రోఫిల్ కౌంట్ (ఎఎన్ సి) పరీక్షలు నిర్వహించి రోగనిరోధకత టీకాలు వేశారు. 49,44,359 మంది పిల్లలకు రోగనిరోధకత టీకాలు వేశారు. 18,94,71,490 మందికి 7 రకాల స్క్రీనింగ్ (టీబీ, హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, క్యాటరాక్ట్) నిర్వహించారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మేళాలు (సీహెచ్ సీ):
37,664 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మేళాల్లో 1,54,41,950 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 28.12.2023 వరకు 1,10,05,931 మంది రోగులు జనరల్ ఓపీడీని సంప్రదించగా, 49,67,675 మంది రోగులు స్పెషలిస్ట్ ఓపీడీ సేవలు పొందారు. . 38,309 మేజర్ సర్జరీలు, 1,30,760 మైనర్ సర్జరీలు జరిగాయి.
***
(రిలీజ్ ఐడి: 1991482)
సందర్శకుల సూచీ సంఖ్య : : 157