ప్రధాన మంత్రి కార్యాలయం

డిసెంబర్ 30వ తేదీన ప్రధాన మంత్రి అయోధ్య పర్యటన


అయోధ్యలో పౌర సౌకర్యాలను పునరుద్ధరించడానికి, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ.11,100 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని; టెర్మినల్ భవనం ముఖభాగం రాబోయే శ్రీరామ మందిరం యొక్క ఆలయ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తుంది

అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి

రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపడం ద్వారా దేశంలో అమృత్ భారత్ రైళ్లు ప్రారంభం

ఆరు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

రాబోయే శ్రీరామ మందిరానికి ప్రాప్యతను మెరుగుపరచడానికి, అయోధ్యలో కొత్తగా పునర్నిర్మించిన, విస్తరించిన మరియు సుందరీకరించబడిన నాలుగు రోడ్లను ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి

అయోధ్యలో రూ. 2180 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

ఉత్తర ప్రదేశ్ అంతటా రూ. 4600 కోట్ల పైగా విలువైన అనేక ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేయ

Posted On: 28 DEC 2023 4:54PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 30 డిసెంబ‌ర్, 2023న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య‌ను సందర్శిస్తారు. సుమారు ఉదయం 11:15 గంటలకు  ప్ర‌ధాన మంత్రి పున‌ర‌భివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేష‌న్‌ను ప్రారంభిస్తారు. కొత్త అమృత్ భార‌త్ రైళ్లు, వందే భార‌త్ రైళ్ల‌ను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు, కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రధానమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు, రాష్ట్రంలో రూ. 15,700 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులు, ఉత్తరప్రదేశ్ అంతటా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి.

అయోధ్యలో ఆధునిక ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, కనెక్టివిటీని మెరుగుపరచడం, నగరం గొప్ప చరిత్ర, వారసత్వానికి అనుగుణంగా దాని పౌర సౌకర్యాలను పునరుద్ధరించడం ప్రధానమంత్రి దార్శనికత. ఈ దృక్పథాన్ని సాకారం చేయడంలో, నగరంలో కొత్త విమానాశ్రయం, కొత్తగా అభివృద్ధి చేయబడిన రైల్వే స్టేషన్, కొత్తగా అభివృద్ధి చేయబడిన, విస్తరించిన, సుందరీకరించబడిన రోడ్లు, ఇతర పౌర మౌలిక సదుపాయాలు ప్రారంభం కానున్నాయి. ఇంకా, అయోధ్య, చుట్టుపక్కల సుందరీకరణ, పౌర సౌకర్యాల పునరుద్ధరణకు దోహదపడే అనేక కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగుతుంది. 

అయోధ్య విమానాశ్రయం 

అత్యాధునిక విమానాశ్రయం మొదటి దశ 1450 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. విమానాశ్రయం టెర్మినల్ భవనం 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది, ఇది ఏటా 10 లక్షల మంది ప్రయాణీకులకు సేవలను అందించగలదు. టెర్మినల్ భవనం ముఖభాగం అయోధ్యలో రాబోయే శ్రీరామ మందిరం నిర్మాణాన్ని వర్ణిస్తుంది. టెర్మినల్ బిల్డింగ్ లోపలి భాగాలను భగవాన్ శ్రీరాముడి జీవితాన్ని వర్ణించే స్థానిక కళ, పెయింటింగ్‌లు, కుడ్యచిత్రాలతో అలంకరించారు. అయోధ్య విమానాశ్రయం టెర్మినల్ భవనం ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, ఎల్‌ఈడీ లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఫౌంటైన్‌లతో ల్యాండ్‌స్కేపింగ్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి కర్మాగారం, సోలార్ పవర్ ప్లాంట్, అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంది. విమానాశ్రయం ఈ ప్రాంతంలో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది, ఇది పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది.

అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ 

అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌గా పిలిచే అయోధ్య రైల్వే స్టేషన్ 1వ దశ పునఃఅభివృద్ధి ని రూ. 240 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో అభివృద్ధి చేశారు. మూడు అంతస్తుల ఆధునిక రైల్వే స్టేషన్ భవనంలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుడ్ ప్లాజాలు, పూజ అవసరాల కోసం దుకాణాలు, క్లోక్ రూమ్‌లు, పిల్లల సంరక్షణ గదులు, వెయిటింగ్ హాళ్లు వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. స్టేషన్ భవనం 'అందరికీ అందుబాటులో ఉంటుంది',  'ఐజిబిసి సర్టిఫైడ్ గ్రీన్ స్టేషన్ భవనం'గా ఉంటుంది. 

అమృత్ భారత్ రైళ్లు, వందే భారత్ రైళ్లు, ఇతర రైలు ప్రాజెక్టులు

అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని, దేశంలోని సూపర్‌ఫాస్ట్ ప్రయాణీకుల రైళ్లలో కొత్త కేటగిరీ-అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ని ప్రారంభిస్తారు. అమృత్ భారత్ రైలు అనేది ఎయిర్ కండిషన్ లేని కోచ్‌లతో కూడిన ఎల్హెచ్బి పుష్ పుల్ రైలు. మెరుగైన త్వరణం కోసం ఈ రైలు రెండు చివర్లలో లోకోలను కలిగి ఉంటుంది. అందమైన మరియు ఆకర్షణీయంగా డిజైన్ చేయబడిన సీట్లు, మెరుగైన లగేజీ ర్యాక్, తగిన మొబైల్ హోల్డర్‌తో మొబైల్ ఛార్జింగ్ పాయింట్, ఎల్ఈడి లైట్లు, సీసీటీవీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి మెరుగైన సౌకర్యాలు రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. ఆరు కొత్త వందే భారత్ రైళ్లను కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు.

దర్భంగా-అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, మాల్డా టౌన్-సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినస్ (బెంగళూరు) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అనే రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రధాన మంత్రి ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు.

ఆరు కొత్త వందే భారత్ రైళ్లను కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు. వీటిలో శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా-న్యూ ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; అమృత్‌సర్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; కోయంబత్తూరు-బెంగళూరు కాంట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; మంగళూరు-మడ్గావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్; జల్నా-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరియు అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.

ఈ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు రూ. 2300 కోట్ల విలువైన మూడు రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి జాతికి అంకితం చేయనున్నారు. ప్రాజెక్ట్‌లలో రూమా చకేరి-చండేరి మూడవ లైన్ ప్రాజెక్ట్; జౌన్‌పూర్-అయోధ్య-బారాబంకి డబ్లింగ్ ప్రాజెక్ట్‌లోని జౌన్‌పూర్-తులసీ నగర్, అక్బర్‌పూర్-అయోధ్య, సోహవల్-పత్రాంగ,  సఫ్దర్‌గంజ్-రసౌలీ విభాగాలు; మల్హౌర్-దాలిగంజ్ రైల్వే సెక్షన్ డబ్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్ట్.

అయోధ్యలో మెరుగు పరిచిన పౌర మౌలిక సదుపాయాలు

రాబోయే శ్రీరామ మందిరానికి ప్రాప్యతను మెరుగుపరచడానికి, ప్రధాన మంత్రి అయోధ్యలో కొత్తగా పునర్నిర్మించిన, విస్తరించిన,  సుందరీకరించిన నాలుగు రహదారులు- రాంపథ్, భక్తిపథం, ధర్మపథ్, శ్రీ రామ జన్మభూమి పథంని ప్రారంభిస్తారు. ప్రధాన మంత్రి అనేక కార్యక్రమాలను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. పౌర మౌలిక సదుపాయాలను బలోపేతం చేసే ప్రాజెక్టులు, అయోధ్య, చుట్టుపక్కల బహిరంగ ప్రదేశాలను సుందరీకరించడం వీటిలో కొన్ని. ఈ ప్రాజెక్ట్‌లలో రాజర్షి దశరథ్  అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీ; అయోధ్య-సుల్తాన్‌పూర్ రోడ్డు-విమానాశ్రయాన్ని కలుపుతూ నాలుగు లైన్ల రహదారి; ఎన్హెచ్ -27 బైపాస్ మహోబ్రా బజార్ మీదుగా తేధి బజార్ శ్రీరామ జన్మభూమి వరకు నాలుగు లేన్ల రహదారి; నగరం అంతటా అనేక సుందరమైన రోడ్లు, అయోధ్య బైపాస్; ఎన్హెచ్-330ఏ లోని జగదీష్‌పూర్-ఫైజాబాద్ సెక్షన్; మహోలి-బరాగావ్-దియోధి రహదారి, జసర్పూర్-భౌపూర్-గంగారామన్-సురేష్‌నగర్ రహదారి విస్తరణ, బలోపేతం; పంచకోసి పరిక్రమ మార్గ్‌లోని బడి బువా రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్ఓబి; పిఖరౌలీ గ్రామంలో ఘన వ్యర్థాల శుద్ధి కర్మాగారం; డా. బ్రజ్‌కిషోర్ హోమియోపతిక్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో కొత్త భవనాలు, తరగతి గదులు నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి నగర్ సృజన్ యోజన పని, ఐదు పార్కింగ్, వాణిజ్య సౌకర్యాలకు సంబంధించిన పనులను కూడా ప్రారంభిస్తారు.

అయోధ్యలో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన

అయోధ్యలో పౌర సౌకర్యాల పునరుద్ధరణలో మరింత సహాయపడే కొత్త ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు, అయోధ్యలోని నాలుగు చారిత్రక ప్రవేశ ద్వారాల పరిరక్షణ, సుందరీకరణ; గుప్తర్ ఘాట్ మరియు రాజ్‌ఘాట్ మధ్య కొత్త కాంక్రీట్ ఘాట్‌లు మరియు ముందుగా నిర్మించిన ఘాట్‌ల పునరుద్ధరణ; నయా ఘాట్ నుండిరాజ్ ఘాట్ నుండి రామ్ టెంపుల్ వరకు యాత్రికుల మార్గాన్ని బలోపేతం చేయడం మరియు పునరుద్ధరించడం, వీటిలో కొన్ని. 

అయోధ్యలో పౌర సౌకర్యాల పునరుద్ధరణలో మరింత సహాయపడే కొత్త ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు, అలాగే నగరం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కూడా బలోపేతం చేస్తారు. వీటిలో అయోధ్యలోని నాలుగు చారిత్రక ప్రవేశ ద్వారాల పరిరక్షణ మరియు సుందరీకరణ; గుప్తర్ ఘాట్ మరియు రాజ్‌ఘాట్ మధ్య కొత్త కాంక్రీట్ ఘాట్‌లు మరియు ముందుగా నిర్మించిన ఘాట్‌ల పునరుద్ధరణ; నయా ఘాట్ నుండి లక్ష్మణ్ ఘాట్ వరకు పర్యాటక సౌకర్యాల అభివృద్ధి మరియు సుందరీకరణ; రామ్ కి పైడి వద్ద దీపోత్సవం మరియు ఇతర ఉత్సవాల కోసం సందర్శకుల గ్యాలరీ నిర్మాణం; రామ్ కి పైడి నుండి రాజ్ ఘాట్ మరియు రాజ్ ఘాట్ నుండి రామ్ టెంపుల్ వరకు యాత్రికుల మార్గాన్ని బలోపేతం చేయడం మరియు పునరుద్ధరించడం కోసం రూ. 300 కోట్లు ఖర్చుచేయనుంది. 

ఉత్తరాప్రదేశ్ లో ఇతర ప్రాజెక్టులు 

ఈ బహిరంగ కార్యక్రమంలో, ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ అంతటా ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. వీటిలో గోసైన్ కి బజార్ బైపాస్-వారణాసి- ఘఘ్రా వంతెన-వారణాసి, ఎన్హెచ్-233 నాలుగు-లేన్ల విస్తరణ; ఎన్హెచ్-730లోని ఖుతార్‌ని లఖింపూర్ సెక్షన్‌గా బలోపేతం చేయడం, అప్‌గ్రేడ్ చేయడం; అమేథి జిల్లా త్రిశుండిలో ఎల్  LPG ప్లాంట్ సామర్థ్యం పెంపు; పంఖాలో 30 మిలియోన్ లేటర్లుమ్,జజ్మౌ, కాన్పూర్‌లో 130 ఎంఎల్డి  మురుగునీటి శుద్ధి కర్మాగారం; ఉన్నావ్ జిల్లాలో కాలువలు, మురుగునీటి శుద్ధి పనిని అడ్డుకోవడం మరియు మళ్లించడం; ఈ ప్రాజెక్టుల్లో కొన్ని ముఖ్యమైనవి. 



(Release ID: 1991447) Visitor Counter : 118