హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మసరత్ ఆలం వర్గం)/ ఎం ఎల్ జే కే - ఎం ఎ ను 'చట్టవిరుద్ధమైన సంస్థ'గా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది


కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, ఈ సంస్థ మరియు దాని సభ్యులు జే & కే లో దేశ వ్యతిరేక మరియు వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారని తీవ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తూ మరియు జే & కే లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

మన దేశం యొక్క ఐక్యత, సార్వభౌమత్వం మరియు సమగ్రతకు వ్యతిరేకంగా వ్యవహరించే వారెవరినీ విడిచిపెట్టేదిలేదని అలగే చట్టం యొక్క పూర్తి ఆగ్రహానికి గురికావాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం యొక్క సందేశం బిగ్గరగా మరియు స్పష్టంగా ఉంది: హోం మంత్రి

ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో, హోంమంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో ఉగ్రవాదంపై సంపూర్ణ అసహన విధానాన్ని అనుసరించి, 2023 లో ఎం హెచ్ ఏ నాలుగు సంస్థలను 'ఉగ్రవాద సంస్థలు'గా, ఆరుగురు వ్యక్తులను 'ఉగ్రవాదులు' మరియు రెండు సంస్థలను 'చట్టవిరుద్ధమైన సంస్థలు'గా ప్రకటించింది.

Posted On: 27 DEC 2023 3:48PM by PIB Hyderabad

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూ ఏ పీ ఏ ) 1967లోని సెక్షన్ 3(1) ప్రకారం భారత ప్రభుత్వం ‘ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మసరత్ ఆలం వర్గం)/ ఎం ఎల్ జే కే - ఎం ఎ ను 'చట్టవిరుద్ధమైన సంస్థ'గా ప్రకటించింది.

 

కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి, శ్రీ అమిత్ షా తన ఎక్స్('X')  పోస్ట్‌లో "ఈ సంస్థ మరియు దాని సభ్యులు జే & కే లో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తూ మరియు జే & కే లో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి ప్రజలను ప్రోత్సహిస్తూ దేశ వ్యతిరేక మరియు వేర్పాటువాద కార్యకలాపాలలో పాల్గొంటున్నారు" అని అన్నారు. .

 

“మన దేశ ఐక్యత, సార్వభౌమాధికారం మరియు సమగ్రతకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరించే వారెవరినీ వదిలిపెట్టరమని వారు చట్టం యొక్క పూర్తి ఆగ్రహానికి గురికావలసి ఉంటుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ సందేశం బిగ్గరగా మరియు స్పష్టంగా ఉంది” అని హోం మంత్రి అన్నారు.

 

ముస్లిం లీగ్ జమ్మూ కాశ్మీర్ (మసరత్ ఆలం వర్గం)/ ఎం ఎల్ జే కే - ఎం ఎ  దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటోంది మరియు దాని సభ్యులు జమ్మూ మరియు కాశ్మీర్‌లో వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు మరియు భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారు. ఈ సంస్థ సభ్యులు, ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా, భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత మరియు సమగ్రతకు విఘాతం కలిగించి జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఇస్లామిక్ పాలనను స్థాపించాలనుకుంటున్నారు. ఈ సంస్థపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం 1967, ఐ పీ సీ 1860, ఆయుధాల చట్టం 1959 మరియు రణబీర్ పీనల్ కోడ్ 1932లోని వివిధ సెక్షన్ల కింద అనేక క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మరియు హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరించి, 2023లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ  నాలుగు సంస్థలను 'టెర్రరిస్ట్ సంస్థలు'గా ప్రకటించింది, ఆరుగురు వ్యక్తులను 'ఉగ్రవాదులు'గా  అలాగే రెండు సంస్థలను 'చట్టవిరుద్ధమైన సంస్థలు'గా  ప్రకటించింది.

 

***


(Release ID: 1991065) Visitor Counter : 132