విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

న్యూ జీలండ్ లోని ఆక్‌లండ్ లో భారతదేశ ప్రధాన వాణిజ్యదూత కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి

Posted On: 27 DEC 2023 3:28PM by PIB Hyderabad

న్యూ జీలండ్ లోని ఆక్‌లండ్ లో భారత ప్రధాన వాణిజ్య దూత కార్యాలయాన్ని ఒకదానిని తెరవాలన్న ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది.

ఆక్‌లండ్ లో భారత ప్రధాన వాణిజ్య దూత కార్యాలయాన్ని తెరవడం అంటే దాని వల్ల భారతదేశం యొక్క దౌత్య సంబంధి పరిధి ని విస్తరించుకోవడం లో తోడ్పాటు లభిస్తుంది. అంతేకాకుండా ప్రపంచ భాగస్వామ్యం లో భారతదేశం యొక్క ప్రమేయం అధికం అవుతూ ఉండడాన్ని దృష్టి లో పెట్టుకొని భారతదేశం యొక్క దౌత్య సంబంధి ప్రతినిధిత్వం సుదృఢం అవుతుంది కూడా ను. ఈ పరిణామం తో భారతదేశం యొక్క వ్యూహాత్మకమైనటువంటి మరియు వాణిజ్య పరమైనటువంటి ప్రయోజనాల ను ప్రోత్సహించడం లోనూ, ఆక్‌లండ్ లో భారతీయ సముదాయానికి మెరుగైన రీతి లో సంక్షేమాన్ని అందించడం లోనూ సహాయం లభిస్తుంది.

ఈ వాణిజ్య దూత కార్యాలయాన్ని 12 నెలల కాల అవధి లోపల తెరచి మరి పూర్తి స్థాయి లో పని చేసేందుకు తగిన ఏర్పాట్ల ను చేసే అవకాశం ఉంది.

 

***



(Release ID: 1990958) Visitor Counter : 56