ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

త్రిపుర లో ఒక తేయాకు తోట శ్రమికుని జీవనం లో మార్పును తీసుకు వచ్చిన పిఎమ్ ఆవాస్


పశ్చిమ త్రిపుర కుచెందిన శ్రీ అర్జున్ సింహ్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి

Posted On: 27 DEC 2023 2:16PM by PIB Hyderabad

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు.

 

దేశవ్యాప్తం గా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారులు అయిన వేల కొద్దీ ప్రజలు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, విధాన సభ లకు చెందిన సభ్యులు మరియు స్థానిక స్థాయి ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి సంభాషించారు. త్రిపుర లో ఒక తేయాకు తోట లో పని చేసే శ్రీ అర్జున్ సింహ్ అనే వ్యక్తి పిఎమ్ ఆవాస్, ఉజ్జ్వల, ఇంకా ఉచిత టాయిలెట్ పథకాల లబ్ధిదారు గా ఉన్నారు. ఆయన 1.3 లక్షల రూపాయల సహాయాన్ని అందుకొన్న తరువాత కచ్చా ఇంటి నుండి పక్కా ఇంటి కి మారిపోయారు; అంతేకాదు, పొగ చిమ్మే పొయ్యి కి బదులు గా గ్యాస్ స్టవ్ ను ఉపయోగించ సాగారు. దీనితో, ఆయన జీవనం రూపు రేఖ లు మారిపోయాయి. ఆయన ఉండే పల్లె లోను మరియు చుట్టు ప్రక్కల ప్రాంతాల లోను మోదీ కీ గ్యారంటీ కీ గాడీ ప్రవేశించడం వల్ల రేకెత్తిన ఉత్సాహాన్ని గురించి ప్రధాన మంత్రి కి వివరించారు. లబ్ధిదారులు ఏమంత ఇబ్బంది కి గురి కాకుండానే ప్రభుత్వ పథకాల యొక్క ప్రయోజనాల ను అందుకొంటూ ఉండడం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

***


(Release ID: 1990822) Visitor Counter : 78