యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
విద్యార్థులలో నైతికవిలువల నిర్మాణానికి పథకం
Posted On:
21 DEC 2023 6:21PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం రెండు కీలక లక్ష్యాలపై గట్టి కృషి చేస్తోంది. అవి
వ్యక్తిత్వ నిర్మాణం, జాతి నిర్మాణం. యువత వ్యక్తిత్వనిర్మాణానికి కృషి చేయడంతోపాటు, వివిధ జాతి నిర్మాణ కార్యక్రమాలను
తన క్షేత్ర స్థాయి సంస్థలు, వివిధ పథకాల ద్వారా ప్రభుత్వం చేపడుతోంది. దేశంలోని యువత ముఖ్యంగా విద్యార్ధుల క్రియాశీలక శక్తియుక్తులను,
నిర్మాణాత్మకంగా ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఉదాహరణకు జాతీయ సేవా పథకం(ఎన్.ఎస్.ఎస్) యువత వ్యక్తిత్వ నిర్మాణానికి , స్వచ్ఛందంగా సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి
దోహదపడుతోంది. సేవ ద్వారా విద్య అనేది ఎన్.ఎస్.ఎస్ లక్ష్యం.
నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్.వై.కె.ఎస్) తన కార్యకలాపాల ద్వారా, చర్యల ద్వారా యువతను చేరుతోంది. ఇది
యువతకు సాధికారత కల్పించడమే కాక, పౌర కార్యకలాపాలలో పాలు పంచుకునేలా చేస్తుంది. ప్రస్తుతం నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కు
3.04 లక్షల గ్రామ స్థాయి యువజన క్లబ్బులు ఉన్నాయి. వీటి సభ్యుల సంఖ్య 52.11 లక్షలు. ఇది యువతకు ఎంత విస్తృత స్థాయిలో చేరిందో తెలుస్తుంది.
కేంద్ర ప్రభుత్వం యువజన సర్వీసుల విభాగం కింద స్వతంత్ర సంస్థ మేరా యువ భారత్ (మై భారత్)ను ఏర్పాటు చేయడం జరిగింది.
దీనిని అమృత్ కాల్ లో సాంకేతికత, యువత అభివృద్ధి కోసం, యువత నాయకత్వంలో అభివృద్ధి ‘కర్తవ్య బోధ’,‘ సేవా భావ్’ను సాధించేందుకు ఏర్పాటు చేశారు.
దీని ద్వారా యువత 2047 నాటికి తమ కలలను సాకారం చేసుకోవడానికి, అమృత్ భారత్ నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ ప్లాట్ఫారం,యువతను వివిధ కార్యకలాపాలతో అనుసంధానం చేస్తుంది. ఇది ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో అధ్యయన అవకాశాలు కల్పిస్తుంది. ఇది స్థానిక కమ్యూనిటీల సమస్యలను యువత తెలుసుకునే వీలు కల్పిస్తుంది.
అలాగే ఆ సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలు కనుగొనేలా చూస్తుంది. ఇది యువతకు నాయకత్వ లక్షణాలు అలవడేలా చేస్తుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర యువజన సర్వీసులు , క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ , రాజ్యసభలో డాక్టర్ సుమేర్ సింగ్ సోలంకీ అడిగిన ప్రశ్నకు ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
***
(Release ID: 1990380)
Visitor Counter : 136