సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వ సిబ్బంది శాఖ, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 25 డిసెంబర్ 2023న సుపరిపాలన దినోత్సవాన్ని ప్రారంభించనున్నారు.
ఐ గాట్ కర్మయోగి ప్లాట్‌ఫారమ్‌లో 3 కొత్త ఫీచర్ల ప్రారంభం: నా ఐ గాట్ , మిశ్రమ కార్యక్రమాలు మరియు క్యూరేటెడ్ కార్యక్రమాలు
డి ఓ పి టీ వార్షిక సామర్థ్య పెంపుణ చర్యల ప్రణాళిక లో భాగంగా 12 నిర్దిష్ట అంశాల - ఈ-లెర్నింగ్ సామర్థ్య పెంపుణ కోర్సుల ప్రారంభం
కేంద్ర సచివాలయంలో మధ్యస్థ సివిల్ సర్వెంట్ల నిర్వహణ సామర్థ్య శిక్షణ కోసం రూపొందించిన వికాస్ (వెరియబుల్ & ఇమ్మర్సివ్ కర్మయోగి అడ్వాన్స్‌డ్ సపోర్ట్) సామర్థ్య శిక్షణ కార్యక్రమాల ప్రారంభం.
Posted On:
24 DEC 2023 1:57PM by PIB Hyderabad
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ 25 డిసెంబర్ 2023న సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకోబోతోంది.
డాక్టర్ జితేంద్ర సింగ్, కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ల శాఖ మంత్రి, అణుశక్తి శాఖ మరియు అంతరిక్ష శాఖ, ప్రభుత్వం భారతదేశం న్యూ ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో సుపరిపాలన దినోత్సవాన్ని ప్రారంభించనున్నారు.
ఈ ప్రత్యేక సందర్భంలో, డాక్టర్ జితేంద్ర సింగ్ ఐ గాట్ కర్మయోగి ప్లాట్‌ఫారమ్‌లో 3 కొత్త ఫీచర్‌లను ప్రారంభిస్తారు: మై ఐ గాట్ , బ్లెండెడ్ ప్రోగ్రామ్‌లు మరియు క్యూరేటెడ్ ప్రోగ్రామ్‌లు.
మై ఐ గాట్ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌ల కోసం కెపాసిటీ-బిల్డింగ్ ప్లాన్‌లో గుర్తించిన విధంగా అధికారి యొక్క ప్రత్యేక సామర్థ్య నిర్మాణ అవసరాలను నేరుగా పరిష్కరించే విధంగా అధికారి వ్యక్తిగత హోమ్ పేజీలో లక్ష్య శిక్షణా కోర్సులను అందజేస్తుంది, తద్వారా వ్యక్తిగత మరియు సంస్థాగత అభ్యాస అవసరాలకు ఖచ్చితంగా సరిపోయేవిధంగా నిర్ధారించి , అత్యంత వ్యక్తిగతీకరించిన, దృష్టి కేంద్రీకరించబడిన మరియు లక్ష్య సామర్థ్య-నిర్మాణ అనుభవాన్ని సులభతరం చేస్తుంది. ప్లాట్‌ఫారమ్‌లో దాదాపు 830 ఉత్తమ నాణ్యతా ఇ-లెర్నింగ్ కోర్సులు అందుబాటులోకి రావడంతో ఇప్పటి వరకు 28 లక్షల మంది వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌లోకి ప్రవేశించారు.
ఐ గాట్ -కర్మయోగి ప్లాట్‌ఫారమ్‌లోని మిశ్రణం ప్రోగ్రామ్‌లు అధికారుల నూతన శిక్షణ అవసరాలను తీర్చడానికి అన్ని స్థాయిలలో శిక్షణా పద్ధతులకు సమానమైన ప్రాప్యతను సులభతరం చేస్తాయి. బ్లెండెడ్ ప్రోగ్రామ్‌లు ఆన్‌లైన్ లెర్నింగ్ కాంపోనెంట్‌లతో సాంప్రదాయ ఆఫ్‌లైన్ (వ్యక్తిగతంగా) క్లాస్‌రూమ్ కోర్సులను ఏకీకృతం చేస్తాయి. ఇది ముఖాముఖి తరగతి గది పరస్పరసంభాషణ యొక్క అమూల్యమైన ప్రయోజనాలను నిలుపుకుంటూ ఆన్‌లైన్ కోర్సుల సౌలభ్యాన్ని ఉపయోగించుకోవడానికి అధికారులు మరియు అధ్యాపకులను అనుమతిస్తుంది.
ఐ గాట్ కర్మయోగిపై క్యూరేటెడ్ ప్రోగ్రామ్‌లు మంత్రిత్వ శాఖలు/విభాగాలు మరియు శిక్షణా సంస్థల యొక్క విభిన్న శిక్షణ అభ్యాస అవసరాలను తీర్చడానికి రూపొందించబడ్డాయి. కోర్సు ప్రొవైడర్లు అనుకూలమైన శిక్షణ అభ్యాస ప్రయాణాన్ని అందించడానికి ప్రోగ్రామాటిక్ విధానంతో ఐ గాట్ యొక్క రిపోజిటరీ నుండి సంబంధిత కంటెంట్, వనరులు మరియు అసెస్‌మెంట్‌లను క్యూరేట్ చేయగలరు.
ఈ ప్రత్యేక రోజున, కర్మయోగి డిజిటల్ లెర్నింగ్ ల్యాబ్ (కే డి ఎల్ ఎల్) ద్వారా డి ఓ పి టీ యొక్క వార్షిక కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ లో భాగంగా రెండు నెలల వ్యవధిలో అభివృద్ధి చేయబడిన 12 నిర్దిష్ట డొమైన్ల లో సామర్థ్యం బిల్డింగ్ ఇ-లెర్నింగ్ కోర్సులను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించనున్నారు. డి ఓ పి టీ. సివిల్ సర్వెంట్ల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇ-లెర్నింగ్ కోర్సులను అభివృద్ధి చేయడానికి కే డి ఎల్ ఎల్ ని గౌరవ ఎం ఓ ఎస్ (పి పి ) ఆగస్టు 2021లో ప్రారంభించారు. డి ఓ పి టీ కోసం వార్షిక కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్‌ను 27 సెప్టెంబర్ 2023న గౌరవ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ 12 కోర్సులు డి ఓ పి టీలో పనిచేస్తున్న సివిల్ సర్వెంట్ల డొమైన్ యోగ్యత అవసరాలను నేరుగా పరిష్కరించడమే కాకుండా, ఇతర ప్రభుత్వ సంస్థలకు రోజువారీ ప్రాతిపదికన ఫంక్షనల్ విషయాలను సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయి.
డాక్టర్ జితేంద్ర సింగ్ కేంద్ర ప్రభుత్వంలో అవసరమైన క్రియాత్మక, ప్రవర్తనా మరియు సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి సారించి 33 గంటల ఐ గాట్ మరియు 30 గంటల ఆఫ్‌లైన్ శిక్షణతో కూడిన వికాస్ అనే కొత్త మిశ్రమ నేర్పు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
***
(Release ID: 1990239)
Visitor Counter : 111