ప్రధాన మంత్రి కార్యాలయం
జువారీ బ్రిడ్జి సంపూర్ణ సౌలభ్యంపై గోవా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
23 DEC 2023 4:39PM by PIB Hyderabad
గోవాలోని జువారీ బ్రిడ్జి పూర్తిగా వినియోగంలోకి రావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు సంపూర్ణ సౌలభ్యం వల్ల అనుసంధానం మెరుగుపడి పర్యాటక, వాణిజ్య రంగాలకు మరింత ఉత్తేజం లభిస్తుందన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:
‘‘జువారీ బ్రిడ్జి పూర్తిగా అందుబాటులోకి రావడంపై గోవా ప్రజలకు నా అభినందనలు! ఈ కీలక ప్రాజెక్టుతో ఉత్తర-దక్షిణ గోవాల మధ్య అనుసంధానం మెరుగవుతుంది. తద్వారా భవిష్యత్తులో పర్యాటక, వాణిజ్య రంగాలకు మరింత ఊపు లభిస్తుంది.’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1990161)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam