గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాటర్‌షెడ్ ప్రాజెక్టులలో హరిత ఆర్థిక వ్యవస్థ కోసం కాక్టస్‌పై నిర్వహించిన ఒక రోజు జాతీయ వర్క్‌షాప్‌లో ప్రసంగించారు.


కాక్టస్ తోటల పెంపకం మరియు దాని ఆర్థిక ఉపయోగాలపై ఆధారపడిన పర్యావరణ వ్యవస్థను ఉనికిలోకి తీసుకురావడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి: శ్రీ గ్రిరాజ్ సింగ్

డబ్ల్యుడిసి-పిఎంకెఎస్‌వై 2.0 కింద స్పైన్‌లెస్‌ కాక్టస్ పెంపకం మరియు ఆర్థిక ఉపయోగాలను ప్రోత్సహించడంలో సహకారంపై ఐసిఎఆర్, ఐసిఎఆర్‌డిఎ మరియు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంతో డిఓఎల్‌ఆర్ ఎంఒయుపై సంతకం చేసింది.

డబ్ల్యుడిసి-పిఎంకెఎస్‌వై కింద వాటర్‌షెడ్ ప్రాజెక్టులలో స్పైన్‌లెస్‌ కాక్టస్ పెంపకం / తోటల పెంపకాన్ని అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలితప్రభుత్వాలు ప్రోత్సహించడానికి డిఒఎల్‌ఆర్‌ మార్గదర్శకాలను జారీ చేసింది

Posted On: 23 DEC 2023 3:09PM by PIB Hyderabad

గ్రామీణాభివృద్ధి మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా న్యూ ఢిల్లీలో “కాక్టస్ ఫర్ గ్రీన్ ఎకానమీ ఇన్ వాటర్‌షెడ్ ప్రాజెక్ట్స్” అనే అంశంపై నిన్న ఒక రోజు జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ప్రసంగించారు. కాక్టస్ సాగును ప్రోత్సహించడంలో భాగంగా భూ వనరుల శాఖ, వాటర్‌షెడ్ ప్రాజెక్టులలో కాక్టస్ ఫర్ గ్రీన్ ఎకానమీ అనే అంశంపై ఒక రోజు జాతీయ వర్క్‌షాప్ నిర్వహించింది.

 

image.png


కాక్టస్ తోటల పెంపకం మరియు దాని ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా పర్యావరణ వ్యవస్థను ఉనికిలోకి తీసుకురావడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కేంద్ర మంత్రి శ్రీ గ్రిరాజ్ సింగ్ ప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేశారు.

 

image.png


రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి మరియు పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి ఇటువంటి వినూత్న ఆలోచనను రూపొందించినందుకు కేంద్ర మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్‌కు డిఒఎల్‌ఆర్ కార్యదర్శి శ్రీ అజయ్ టిర్కీ కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు వాటర్‌షెడ్ డివిజన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. వాటాదారులందరినీ కలుపుకొని రాష్ట్ర స్థాయిలో ఇలాంటి వర్క్‌షాప్‌ను నిర్వహించాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు.

కాక్టస్ పెంపకం మరియు దాని ఆర్థిక ఉపయోగాల ప్రోత్సాహం కోసం నిపుణులు, వ్యవస్థాపకులు, ఆవిష్కర్తలు, థింక్-ట్యాంక్‌ల ప్రతినిధులు మరియు ప్రభుత్వాల నుండి వివిధ అభిప్రాయాలను ఒకచోట చేర్చడానికి ఈ వర్క్‌షాప్ సహాయపడింది.

 

image.png


భూ వనరుల శాఖ (డిఒఎల్‌ఆర్‌) ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (డబ్ల్యుడిసి-పిఎంకెఎస్‌వై) యొక్క వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ కాంపోనెంట్ అనే కేంద్ర ప్రాయోజిత పథకాన్ని అమలు చేస్తోంది. దేశంలోని వర్షాధార/క్షీణించిన భూములను స్థిరంగా అభివృద్ధి చేయడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. డబ్ల్యుడిసి-పిఎంకెఎస్‌వై పరిధి వివిధ రకాల అనువైన తోటలను చేపట్టేందుకు అనుమతినిస్తుంది. ఇది వర్షాధార/క్షీణించిన భూములను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. కాక్టస్ వంటి వృక్ష జాతుల పెరుగుదలకు మరియు మనుగడకు తక్కువ వర్షపాతం మాత్రమే అవసరం. దీని ప్రకారం ఇంధనం, ఎరువులు, పశుగ్రాసం, తోలు, ఆహారం మొదలైన ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం మరియు రైతుల ఆదాయాన్ని పెంచడం కోసం వర్షాధార / క్షీణించిన భూములలో కాక్టస్ సాగును చేపట్టడానికి వివిధ ఎంపికలను డిఒఎల్‌ఆర్‌ అన్వేషిస్తోంది.

 

image.png


ఈ సందర్భంగా, డబ్ల్యుడిసి-పిఎమ్‌కెఎస్‌వై 2.0 కింద స్పైన్‌లెస్‌ కాక్టస్ పెంపకం మరియు దాని ఆర్థిక ఉపయోగాల ప్రోత్సాహంలో సహకారంపై ఐసిఎఆర్, ఐసిఎఆర్‌డిఎ మరియు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంతో డిఒఎల్‌ఆర్ అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసింది.

 

image.png


ప్రస్తుతం కాక్టస్ సాగు దేశంలో పశుగ్రాస ప్రయోజనాలకే పరిమితమైంది. పైన వివరించిన విధంగా కాక్టస్ యొక్క అనేక ఇతర ఆర్థిక మరియు పర్యావరణ వినియోగాలకు అవగాహన, ప్రచారం మరియు నాణ్యమైన తోటల మెటీరియల్ లభ్యతను సులభతరం చేయడం, ఆదర్శ పర్యావరణ వ్యవస్థ మరియు మార్కెటింగ్ మార్గాలపై అభ్యాసాల ప్యాకేజీ ద్వారా దాని ప్రచారం అవసరం. వర్క్‌షాప్ వివిధ వాటాదారులలో అవగాహన తీసుకురావడానికి మరియు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి బాగా సహాయపడింది.

డిఒఎల్‌ఆర్‌ ఇప్పటికే డబ్ల్యుడిసి-పిఎమ్‌కెఎస్‌వై కింద వాటర్‌షెడ్ ప్రాజెక్ట్‌లలో స్పైన్‌లెస్‌ కాక్టస్ సాగును ప్రోత్సహించడం / ప్లాంటేషన్' కోసం మార్గదర్శకాలను జారీ చేసింది మరియు బయో-గ్యాస్ ఉత్పత్తికి కాక్టస్ పెంపకానికి అవసరమైన చర్యలు తీసుకోవడం కోసం అన్ని రాష్ట్రాలతో పాటు జమ్ము-కశ్మీర్‌, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిణీ చేసింది.  వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రతినిధులందరికీ మార్గదర్శకాల కాపీని కూడా అందించారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌ఐఐఎస్‌టి), తిరువనంతపురం కేరళ వారు వర్క్‌షాప్ వేదిక వద్ద ప్రతినిధుల ప్రయోజనం కోసం కాక్టస్ లెదర్‌తో తయారు చేసిన షూలు, బ్యాగులు, జాకెట్లు, చప్పల్స్ మొదలైన వివిధ వస్తువులను ప్రదర్శించారు. కాక్టస్ ఫ్రూట్ మరియు కాక్టస్ సలాడ్ నుండి తయారు చేసిన జ్యూస్ కూడా ప్రతినిధులందరికీ అందించబడింది.

 

image.png


కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు/యూటీలు, పరిశ్రమలు, నిపుణులు వంటి వాటాదారులందరినీ ఒకచోట చేర్చి కాక్టస్ ఆధారిత పరిశ్రమలలో కాక్టస్ సాగును ప్రోత్సహించడం కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను రూపొందించడం మరియు దాని వివిధ ఆర్థిక ఉపయోగాలను ఎన్‌క్యాష్ చేయడం కోసం వర్క్‌షాప్ లక్ష్యంగా పెట్టుకుంది.

 

image.png

  

కాక్టస్ ఆధారిత సిబిజి ప్లాంట్‌లను వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చడానికి ఎంఒపిఎన్‌జికు చెందిన సతత్‌,సిబిఓ పథకాలను ఉపయోగించుకోవడానికి కన్వర్జెన్స్ విధానం కూడా నొక్కి చెప్పబడింది. 25 నవంబర్ 2023న భారత ప్రభుత్వం ప్రకటించిన సహజవాయువులో సిబిజిని తప్పనిసరిగా కలపడం గురించి ప్రకటించిన విధానం దేశంలో సిబిజి ఉత్పత్తి మరియు వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కాక్టస్ ప్లాంటేషన్ చేపట్టేందుకు ఎంజిఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం నిధులు సమర్ధవంతంగా సమీకరించవచ్చని నొక్కిచెప్పాయి.

ఈ వర్క్‌షాప్‌లో 15 రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలితప్రాంతాలు, ఎంఒపిఎన్‌జి,ఎంఒఏ&ఎఫ్‌డబ్ల్యు ఎంఎన్‌ఆర్‌ఈ, ఎంఒఈఎఫ్‌&సిసి, డిఒఆర్‌డి, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి సెంట్రల్ లైన్ మినిస్ట్రీస్/డిపార్ట్‌మెంట్‌ల సీనియర్ అధికారులు, సంబంధిత పరిశ్రమ ప్రతినిధులు మరియు ఐకార్‌,ఐజిఎఫ్‌ఆర్‌ఏ,ఐసిఏఆర్‌డిఏ, సిఏజడ్‌ఆర్‌ఐ,ఎన్‌ఆర్‌ఏఏ వంటి ఇతర ప్రఖ్యాత పరిశోధనా సంస్థలు/సంస్థల నుండి దాదాపు 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వర్క్‌షాప్‌లో భూ వనరుల శాఖలోని వాటర్‌షెడ్ డివిజన్ కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ (వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్) మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కాక్టస్ సాగు మరియు దాని ఆర్థిక మరియు పర్యావరణ ఉపయోగాలైన కంప్రెస్డ్ బయో-గ్యాస్, బయో ఫెర్టిలైజర్, బయో లెదర్, మేత, ఆహారం, ఫార్మాస్యూటికల్ ప్రయోజనాలు, కార్బన్ క్రెడిట్‌లు మొదలైన వాటి గురించి వివిధ అంశాలపై ప్రదర్శనలు మరియు చర్చలు జరిపారు. సదస్సులో పాల్గొన్న రాష్ట్రాలు కూడా తమ ప్రారంభ సంసిద్ధతను ప్రదర్శించాయి. తమ రాష్ట్రాలలో కాక్టస్ పెంపకాన్ని చేపట్టేందుకు ప్రణాళిక, వర్క్‌షాప్‌లో పాల్గొన్న పరిశ్రమ ప్రతినిధులు డిఒఎల్‌ఆర్‌ ప్రయత్నాలను ప్రశంసించారు మరియు కాక్టస్ సాగు & కాక్టస్ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడంలో ఆసక్తిని కనబరిచారు.

 

***



(Release ID: 1990153) Visitor Counter : 92