మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'కాశీ తమిళ సంగమం' రెండో దశలో భాగంగా కాశీలోని ఘాట్‌లు, సుబ్రమణ్య భారతి నివాసం, కంచి మఠాన్ని సందర్శించిన నిపుణుల బృందం

నాడు పోస్టు చేయడమైనది: 22 DEC 2023 3:46PM by PIB Hyderabad

'కాశీ తమిళ సంగమం' రెండో దశలో, నిపుణుల బృందం (గోదావరి) కాశీలోని హనుమాన్ ఘాట్‌ను సందర్శించింది. వారణాసిలోని వివిధ ఘాట్‌ల చరిత్ర గురించి అక్కడి పూజారులను అడిగి తెలుసుకున్నారు. ఘాట్ వద్ద ఉన్న పురాతన దేవాలయాలను సందర్శించారు.

తర్వాత, హనుమాన్ ఘాట్‌లోని సుబ్రమణ్య భారతి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కంచి మఠాన్ని కూడా సందర్శించి అక్కడి చరిత్ర గురించి తెలుసుకున్నారు.

కాశీ తమిళ సంగమం రెండో దశ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. గత సంవత్సరం, కాశీ తమిళ సంగమం మొదటి దశ 2022 16 నవంబర్ నుంచి డిసెంబర్ 16 వరకు జరిగింది. ఈసారి, వివిధ వయస్సులకు చెందిన దాదాపు 1400 మంది (ఒక్కో బృందంలో 200 చొప్పున 7 బృందాలు) తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి కాశీకి వస్తారని భావిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిపుణులతో కూడిన మొదటి మూడు బృందాలు ఇప్పటికే వారణాసికి చేరుకున్నాయి. కాశీ పర్యటనలో భాగంగా ప్రయాగ్‌రాజ్, అయోధ్యను కూడా ఆ బృందాలు సందర్శిస్తాయి.

***


(రిలీజ్ ఐడి: 1989825) సందర్శకుల సూచీ సంఖ్య : : 93
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Kannada