యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మేరా యువ భారత్ (MY భారత్) పోర్టల్‌లో 26 లక్షలు దాటిన యువత నమోదు
Posted On:
21 DEC 2023 6:22PM by PIB Hyderabad
యువత అభివృద్ధి, యువత నాయకత్వంలో సాంకేతిక ఆధారిత అభివృద్ధి సాధన కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'మేరా యువ భారత్ (MY భారత్)' కార్యక్రమాన్ని 2023 అక్టోబర్ 1న న్యూఢిల్లీలోని కర్తవ్య మార్గంలో ప్రారంభించారు. యువత ఆకాంక్షలను సాకారం చేయడం, వికసిత భరత్ నిర్మాణానికి యువత తమ వంతు సహకారం అందించడానికి అవకాశం లక్యంగా 'మేరా యువ భారత్ (MY భారత్)' అమలు జరుగుతుంది. 'ఫిజిటల్ ప్లాట్‌ఫారమ్' (భౌతిక + డిజిటల్) గా పనిచేసే 'మేరా యువ భారత్ (MY భారత్)' డిజిటల్‌గా అనుసంధానం కావడానికి యువతకు అవకాశం కల్పిస్తుంది.
దేశవ్యాప్తంగా ఉన్న యువత MY భారత్ పోర్టల్ ( https://www.mybharat.gov.in/ )లో నమోదు చేసుకుని . పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వివిధ అవకాశాలు, కార్యక్రమాల్లో పాల్గోవచ్చు. . పోర్టల్‌లో యువత నమోదు 18.12.2023 నాటికి 26 లక్షలు దాటింది.
ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, కూ, ఇన్‌స్టాగ్రామ్ వంటి వివిధ సోషల్ మీడియా వేదికలు, యువజన వ్యవహారాల శాఖ పరిధిలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సంస్థలు 'మేరా యువ భారత్ (MY భారత్)' కార్యక్రమానికి ప్రచారం కల్పిస్తున్నాయి.
***
(Release ID: 1989442)
Visitor Counter : 123