రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి నిలయంలో వివిధ పర్యాటక ఆకర్షణలను ప్రారంభించిన భారత రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 21 DEC 2023 2:14PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు (డిసెంబర్ 21, 2023) రాష్ట్రపతి నిలయంలో వివిధ పర్యాటక ఆకర్షణలను ప్రారంభించారు. వాటిలో ఇవి ఉన్నాయి:
 

  • - ఒక చారిత్రాత్మక ఫ్లాగ్ పోస్ట్ యొక్క ప్రతిరూపం;
  • - మేజ్ గార్డెన్ మరియు చిల్డ్రన్స్ పార్క్;
  • - మెట్ల బావులు మరియు సాంప్రదాయ నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ;
  • - రాక్ వాటర్ క్యాస్కేడ్‌పై శివ మరియు నంది శిల్పాలు;


మరియు
 

  • -నాలెడ్జ్ గ్యాలరీలో కొత్త ఎన్‌క్లేవ్‌లు.


టేకు చెక్కతో చేసిన 36 మీటర్ల (120 అడుగులు) పొడవైన ఫ్లాగ్ పోస్ట్, 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం కావడాన్ని సూచిస్తుంది.

ప్రధాన భవనం సమీపంలో ఉన్న మేజ్ గార్డెన్, ముర్రాయా ఎక్సోటికా ప్రధాన ఆకర్షణగా ఉంది. ఇక్కడకు వచ్చే చిన్నపిల్లలను అహ్లాదపరిచేందుకు చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయబడింది.

మూడు మెట్ల బావుల పునరుద్ధరణ ఏటా గణనీయమైన వర్షపు నీటిని సంగ్రహిస్తుంది. ఇది నీటి భద్రత మరియు స్థానిక వనరుల నిలకడను పెంచుతుంది. అలాగే ఈ సాంప్రదాయ నీటిపారుదల వ్యవస్థలు సందర్శకులకు వారసత్వ అవగాహన కల్పిస్తాయి.

మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి శివుడు, దక్షిణాభిముఖంగా మరియు రాతిపై నంది ఎద్దు సందర్శకులకు మరో ఆకర్షణగా నిలుస్తాయి.

నాలెడ్జ్ గ్యాలరీలో రెండు కొత్త ఎన్‌క్లేవ్‌లు జోడించబడ్డాయి - వాటిలో ఒకటి హైదరాబాద్ ఏకీకరణ గురించి మరియు మరొకటి రాష్ట్రపతి భవన్ మరియు భారతదేశ అధ్యక్షుల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

నాలెడ్జ్ గ్యాలరీ వెలుపల ఉన్న రాక్ పెయింటింగ్‌లు "ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్" - శాస్త్రీయ మరియు రక్షణ విజయాలు, వారసత్వం, వివిధ స్మారక చిహ్నాలు మరియు కళారూపాల యొక్క వివిధ అంశాలను వర్ణిస్తాయి.

రాష్ట్రపతి దక్షిణాది పర్యటన సమయంలో తప్ప ఈ రాష్ట్రపతి నిలయం  ఏడాది పొడవునా సాధారణ ప్రజల కోసం తెరిచి ఉంటుంది. సందర్శకులు తమ స్లాట్‌ను http://visit.rashtrapati bhavan.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రజలు వారానికి ఆరు రోజులు (సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాలు మినహా) ఉదయం 10:00 నుండి సాయంత్రం 05:00 గంటల వరకు నిలయాన్ని సందర్శించవచ్చు. సాయంత్రం 04:00 గంటల వరకూ నిలయంలోనికి అనుమతి ఉంటుంది. రాష్ట్రపతి నిలయంలోని రిసెప్షన్ కార్యాలయంలో  కూడా వాక్-ఇన్ బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

 

***


(रिलीज़ आईडी: 1989367) आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Tamil , Kannada