భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ప్రసంగాలలో దివ్యాంగులను గౌరవప్రదంగా సంభో దించేలా చూసేందుకు రాజకీయ పార్టీలకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

Posted On: 21 DEC 2023 3:18PM by PIB Hyderabad

ఎన్నికల ప్రక్రియలో అన్ని వర్గాలకు సమాన  ప్రాతినిధ్యం కల్పించినప్పుడు మాత్రమే  ప్రజాస్వామ్యానికి నిజమైన అర్థం ఉంటుంది.ఎన్నికల ప్రక్రియలో  దివ్యాంగులకు  (పిడబ్ల్యుడి) సమాన భాగస్వామ్యాన్ని కల్పించడం కోసం భారత ఎన్నికల కమిషన్‌ కృషి చేస్తోంది.  దివ్యాంగులకు భాగస్వామ్యం కల్పించి   సమ్మిళిత ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం. వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. రాజకీయ సమావేశాలు, చర్చల్లో దివ్యాంగులకు  గౌరవం, సముచిత స్థానం లభించేలా చూసేందుకు ఎన్నికల సంఘం మొదటిసారిగా రాజకీయ పార్టీలు, పార్టీల ప్రతినిధులకు  మార్గదర్శకాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన రాజకీయ పార్టీలు, వాటి ప్రతినిధులు తుచ తప్పకుండా   మార్గదర్శకాలు పాటించాలి అని ఎన్నికల సంఘం కోరింది.  

దివ్యాంగులను కించ పరిచే విధంగా రాజకీయ వర్గాలు అభ్యంతకర పదాలు ఉపయోగిస్తున్నట్లు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వచ్చింది.  రాజకీయ పార్టీల సభ్యులు లేదా వారి అభ్యర్థులు ప్రసంగం/ప్రచారంలో ఎటువంటి అభ్యంతకర పదాలు ఉపయోగించరాదని  తన మార్గదర్శకాలతో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.అభ్యంతకర పదాలు ఉపయోగించడం అంటే  దివ్యాంగులను   అవమానించినట్లు అర్థం చేసుకోవచ్చు.  మూగ(గుంగా),మతి స్థిమితి లేనివాడు  (పాగల్, సిర్ఫిరా), గుడ్డి  (అంధ, కనా), చెవిటి (బెహ్రా), కుంటి (లంగ్డా, లూలా, అపాహిజ్) మొదలైన పదాలు దివ్యాంగులను కించపరిచే విధంగా ఉన్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది.ఇటువంటి పదాలు వాడకూడదని సంఘం స్పష్టం చేసింది.  అవమానకరమైన భాష. లేకుండా  రాజకీయ ప్రసంగం/ప్రచారంలో దివ్యాంగులకు న్యాయం,గౌరవం కల్పించాలి.

ఎన్నికల సంఘం జారీ చేసిన  ముఖ్యమైన మార్గదర్శకాలు: 

1. రాజకీయ పార్టీలు వాటి ప్రతినిధులు తమ రాతలు /కథనాలు/ ప్రచార సామాగ్రి  లేదా రాజకీయ ప్రచారంలో ఏదైనా బహిరంగ ప్రకటన/ ప్రసంగం సమయంలో వైకల్యం లేదా పీడబ్ల్యూడీల గురించి చెడు/ అవమానకరమైన/ అవమానకరమైన పదాలు  ఉపయోగించకూడదు.

2. రాజకీయ పార్టీలు , వాటి ప్రతినిధులు ఏదైనా బహిరంగ ప్రసంగం, వారి రాతలు /కథనాలు లేదా రాజకీయ ప్రచారంలో మానవ అసమర్థత నేపథ్యంలో వైకల్యం/ దివ్యాంగులు లేదా వైకల్యం/ దివ్యాంగులను ప్రస్తావిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు.

 3. రాజకీయ పార్టీలు,వాటి ప్రతినిధులు వైకల్యాలు/వికలాంగులకు సంబంధించిన వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు.

4. పైన పేర్కొన్న మార్గదర్శకాలు ఉల్లంఘించి  భాష, పరిభాష, సందర్భం, అవహేళన, అవమానకరమైన సూచనలు లేదా పిడబ్ల్యుడిలను అవమానించడం వికలాంగుల హక్కుల చట్టం 2016 లోని సెక్షన్ 92  నిబంధనలను ఉల్లంఘించినట్లు ఉంటుంది. 

5. ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్ట్‌లు, ప్రకటనలు, పత్రికా ప్రకటనలతో సహా అన్ని ప్రచార సామాగ్రి, వ్యక్తులు/పీడబ్ల్యూడీల పట్ల అభ్యంతరకరమైన లేదా వివక్షతతో కూడిన భాషాపరమైన ఏవైనా సందర్భాలను గుర్తించి  సరిదిద్దడానికి రాజకీయ పార్టీ అంతర్గత సమీక్ష ప్రక్రియను తప్పనిసరిగా నిర్వహించాలి.

6. అన్ని రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్‌లో వైకల్యం, లింగ సున్నితమైన భాష మరియు మర్యాదలను ఉపయోగిస్తామని, అలాగే స్వాభావిక మానవ సమానత్వం, సమానత్వం, గౌరవం, స్వయంప్రతిపత్తిని గౌరవిస్తారని స్పష్టంగా  ప్రకటించాలి.

7. అన్ని రాజకీయ పార్టీలు CRPD (వికలాంగుల హక్కుల సమావేశం)లో పేర్కొన్న విధంగా హక్కుల ఆధారిత పదాలను ఉపయోగించాలి.   ఇతర పదజాలం వైపు మొగ్గు చూపకూడదు. 

8. అన్ని రాజకీయ పార్టీలు తమ బహిరంగ ప్రసంగాలు/ ప్రచారాలు/ కార్యకలాపాలు/ ఈవెంట్‌లను పౌరులందరికీ అందుబాటులో ఉంచాలి.

9. అన్ని రాజకీయ పార్టీలు తమ వెబ్‌సైట్ , సోషల్ మీడియా కార్యక్రమాలను  డిజిటల్‌ విధానంలో నిర్వహించి  కల్యం ఉన్న వ్యక్తులు కూడా వీక్షించేలా చూసేందుకు చర్యలు అమలు చేయాలి 

10.  రాజకీయ ప్రక్రియ  అన్ని స్థాయిలలో పార్టీ కార్యకర్తలకు వైకల్యంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, వికలాంగుల భాషా వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు వినడానికి నోడల్ అధికారాన్ని అన్ని రాజకీయ పార్టీలు నియమించాలి.

11. దివ్యాంగుల పట్ల అనుసరిస్తున్న వైఖరి విడనాడి, దివ్యాంగులకు సముచిత గౌరవం, గుర్తింపు లభించేలా చూసేందుకు రాజకీయ పార్టీలు చర్యలు అమలు చేయాలి.

నేపథ్యం: 

దివ్యాంగులు తమ ఓటు వేయడానికి అనుకూల వాతావరణాన్ని కల్పించడానికి అనేక సంవత్సరాలుగా  మార్గదర్శకాలు, సౌకర్యాలు అమలు జరుగుతున్నాయి. కింది అంతస్తులో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం , ఈవీఎం   బ్యాలెట్ యూనిట్‌పై బ్రెయిలీ సంకేతాలు, సరైన గ్రేడియంట్‌తో ర్యాంప్‌ల నిర్మాణం, పీడబ్ల్యూడీల కోసం ప్రత్యేక క్యూలు (ప్రాధాన్యత ప్రవేశం), వీల్‌ఛైర్లు, అంధులు/అనారోగ్యంతో పాటు సహచరుడిని అనుమతించడం, అందుబాటులో ఉండే విధంగా మరుగుదొడ్డి సౌకర్యం, ఓటింగ్ ప్రక్రియను వివరించే తగిన సంకేతాలు మొదలై సదుపాయాలు కల్పిస్తున్నారు. 

ఎటువంటి సమస్య, ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు అమలు చేస్తోంది. ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యాన్ని కూడా సంఘం అందుబాటులోకి తెచ్చింది. 

 40% బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న పిడబ్ల్యుడి ఓటర్లు ఈ ఐచ్ఛిక సౌకర్యాన్నిపొందవచ్చు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ స‌దుపాయానికి ఆద‌ర‌ణ పెరుగుతూ వ‌చ్చి ప్ర‌జ‌ల మెప్పు పొందింది.

ప్రజల సహకారంతో  సమ్మిళిత ఎన్నికల లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర ఎన్నికల సంఘం  దివ్యాంగుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, సులభతరం చేయడానికి చురుకైన చర్యలు చేపట్టింది.  రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో చేరి తమ వంతు సహకారం అందించినప్పుడు  లక్ష్యం పూర్తిగా నెరవేరుతుంది. ఎటువంటి వివక్ష లేకుండా దివ్యాంగులకు సముచిత గౌరవం లభించేలా చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాల్సి ఉంటుంది.

 వికలాంగుల హక్కుల రక్షణ కోసం వికలాంగుల హక్కుల చట్టం, 2016 అమలులో ఉంది.  ఈ చట్టంలోని సెక్షన్ 7 దూషణ,, హింస, దోపిడీ నుంచి దివ్యాంగులకు   రక్షణ కల్పిస్తుంది. చట్ట నిబంధనలు అతిక్రమించి వ్యవహరించే వారు  సెక్షన్ 92 కింద శిక్షార్హులు. 

 

***


(Release ID: 1989278) Visitor Counter : 190