ప్రధాన మంత్రి కార్యాలయం

స్మార్ట్ ఇండియాహాకథన్ 2023 యొక్క గ్రాండ్ఫినాలి లో పాలుపంచుకొనే వ్యక్తుల తో డిసెంబరు 19 వ తేదీ న మాట్లాడనున్న ప్రధాన మంత్రి


దేశవ్యాప్తం గా 48 నోడల్ సెంటర్స్ లో నిర్వహించే స్మార్ట్ ఇండియాహాకథన్ యొక్క గ్రాండ్ ఫినాలి లో 12,000 కు పైచిలుకు వ్యక్తులు పాలుపంచుకోనున్నారు

విద్యార్థులు 25 మంత్రిత్వ శాఖ లు నమోదు చేసిన  231 సమస్యాత్మక అంశాల ను పరిష్కరించనున్నారు  

ఈ సంవత్సరం  హాకథన్ లో 44,000 బృందాల వద్ద నుండి 50,000 కు పైగా ఆలోచన లు అందాయి; ఈ సంఖ్య ఎస్‌ఐహెచ్ యొక్క ఒకటో సంచిక తో పోలిస్తే దాదాపు గా ఏడురెట్లు అధికం

ఈ హాకథన్ లో పనిచేసేవారు అంతరిక్ష సంబంధి సాంకేతిక విజ్ఞానం, స్మార్ట్ ఎడ్యుకేశన్, విపత్తుల నిర్వహణ, రోబోటిక్స్ ఎండ్ డ్రోన్స్, వారసత్వం మరియు సంస్కృతి తదితర విషయాలు సహా వివిధ విషయాల కు  పరిష్కారాల ను అందించనున్నారు

Posted On: 18 DEC 2023 6:40PM by PIB Hyderabad

స్మార్ట్ ఇండియా హాకథన్ 2023 కు సంబంధించినటువంటి గ్రాండ్ ఫినాలి లో పాల్గొనే వ్యక్తుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 డిసెంబరు 19 వ తేదీ నాడు రాత్రి పూట 9 గంటల 30 నిమిషాల వేళ కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా మాట్లాడనున్నారు. ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే వ్యక్తుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

యువత యొక్క నాయకత్వం లో అభివృద్ధి సాధన అనే ప్రధాన మంత్రి దృష్టికోణాని కి అనుగుణం గా ప్రభుత్వం లోని మంత్రిత్వ శాఖ లు మరియు విభాగాలు, పరిశ్రమలు, ఇంకా ఇతర సంస్థ ల యొక్క గంభీర సమస్యల కు పరిష్కారాల ను కనుగొనడం కోసం ఉద్దేశించినటువంటి ఒక దేశవ్యాప్త కార్యక్రమమే స్మార్ట్ ఇండియా హాకథన్ (ఎస్ఐహెచ్) అని చెప్పాలి. 2017 వ సంవత్సరం లో ప్రారంభించినటువంటి ఈ స్మార్ట్ ఇండియా హాకథన్ యువ నూతన ఆవిష్కర్తల లో అత్యధిక ఆదరణ ను సంపాదించుకొంది. గత అయిదు సంచికల లో వేరు వేరు రంగాల లో అనేక వినూత్న పరిష్కార మార్గాలు అందుబాటు లోకి వచ్చాయి. అంతేకాకుండా, అవి చక్కటి స్టార్ట్-అప్స్ గా కూడాను నిలదొక్కుకొన్నాయి.

 

ఈ సంవత్సరం లో ఎస్ఐహెచ్ తాలూకు గ్రాండ్ ఫినాలి ని డిసెంబరు నెల లో 19 వ తేదీ మొదలుకొని 23 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతున్నది. ఎస్ఐహెచ్ 2023 లో 44,000 బృందాల వద్ద నుండి 50,000కు పైచిలుకు ఆలోచన లు అందాయి. ఈ సంఖ్య ఎస్ఐహెచ్ యొక్క ఒకటో సంచిక తో పోల్చి చూసినప్పుడు ఏడు రెట్ల వృద్ధి ని సూచిస్తున్నది. దేశం అంతటా విస్తరించిన 48 నోడల్ సెంటర్స్ లో నిర్వహించేటటువంటి గ్రాండ్ ఫినాలి లో 12,000 మంది కి పైగా వ్యక్తులు మరియు 2500 మంది కి పైగా సలహాదారులు/ మార్గదర్శకులు పాలుపంచుకోనున్నారు. అంతరిక్ష సంబంధి సాంకేతిక విజ్ఞానం, స్మార్ట్ ఎడ్యుకేశన్, విపత్తుల నిర్వహణ, రోబోటిక్స్ ఎండ్ డ్రోన్స్, వారసత్వం మరియు సంస్కృతి సహా వేరు వేరు విషయాల కు పరిష్కారాల ను అందించడానికని ఈ సంవత్సరం గ్రాండ్ ఫినాలి కోసం మొత్తం 1282 బృందాల ను ఎంపిక చేయడమైంది.

 

కార్యక్రమం లో పాలుపంచుకొనే బృందాలు, రాష్ట్ర ప్రభుత్వాల మరియు 25 కేంద్ర మంత్రిత్వ శాఖ లు మరియు 51 విభాగాలు పోస్టు చేసిన 231 సమస్యాత్మక వివరణల కు (వీటి లో 176 సాఫ్ట్ వేర్ కు మరియు 55 హార్డ్ వేర్ కు సంబంధించినవి ఉన్నాయి) పరిష్కార మార్గాల ను సూచించనున్నాయి. స్మార్ట్ ఇండియా హాకథన్ 2023 లో మొత్తం బహుమతుల విలువ రెండు కోట్ల రూపాయల కు పైగానే ఉంది. విజేత గా నిలచే ప్రతి ఒక్క బృందాని కి ఆ బృందం సూచించే ఒక్కొక్క పరిష్కారాని కి గాను ఒక లక్ష రూపాయల నగదు బహుమతి ని ఇవ్వడం జరుగుతుంది.

 

 

***



(Release ID: 1988221) Visitor Counter : 64