ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐఎన్ఎస్ఎసిఒజి త‌న సాధార‌ణ ప‌ర్య‌వేక్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా, కేర‌ళ‌ల‌లో రూపొంత‌రం చెందిన కోవిడ్ 19కు సంబంధించిన జెఎన్ 1 కేసును క‌నుగొన్నారు


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సాధార‌ణ కార్య‌క‌లాపాల‌లో భాగంగా, ప్ర‌జా ఆరోగ్యం, అందుకు ఆసుప‌త్రుల సంసిద్ధ‌త‌ను అంచ‌నా వేసేందుకు రాష్ట్రాల‌లో అన్ని ఆరోగ్య‌కేంద్రాల‌లో మాక్ డ్రిల్ నిర్వ‌హణ‌

కేర‌ళ రాష్ట్ర ఆరోగ్య అధికారుల‌తో నిత్యం సంప్ర‌దిస్తూ, వివిధ ప్ర‌వేశ కేంద్రాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Posted On: 16 DEC 2023 7:14PM by PIB Hyderabad

ఐఎన్ఎస్ఎసిఒజి త‌న సాధార‌ణ ప‌ర్య‌వేక్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా, కేర‌ళ‌ల‌లో రూపొంత‌రం చెందిన కోవిడ్ 19కు సంబంధించిన జెఎన్ 1 కేసును క‌నుగొన్నారు. ఈ విష‌యాన్ని శ‌నివారంనాడు ఐసిఎంఆర్ డిజి డాక్ట‌ర్ రాజీవ్ బాల్ ఇక్క‌డ తెలిపారు.  
జ‌నోమిక్ (జ‌న్యురాశి) ప్ర‌యోగ‌శాల‌ల నెట్ వ‌ర్క్ అయిన ఇండియాన్ ఎస్ఎఆర్‌సిఎస్‌- సిఒవి-2 జెనోమిక్స్ క‌న్సోర్షియం (ఐఎన్ఎస్ఎసిఒజి) భార‌త్‌లో కోవిడ్‌-19 మ‌హ‌మ్మారిని జ‌న్యుప‌రంగా ప‌ర్య‌వేక్షిస్తోంది. ఐసిఎం ఆర్ కూడా క‌న్సోర్షియంలో భాగం. కోవిడ్ -19 నేప‌థ్యంలో స‌వ‌రించిన ప‌ర్య‌వేక్ష‌ణ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఐఎల్ఐ, ఎస్ఎఆర్ఐ రోగుల‌ను కోవిడ్‌-19కు ప‌రీక్షించారు, పాజిటివ్ కేసుల‌ను హోల్ జెనోమ్ సీక్వెన్సింగ్ (డ‌బ్ల్యుజిఎస్ - సంపూర్ణ జ‌న్యు శ్రేణి) కోసం ప్ర‌స్తావించారు. 
కేర‌ళ‌ల‌లోని తిరువ‌నంత‌పురంలో క‌రాకులంలో 8 డిసెంబ‌ర్ 202న జ‌రిపిన ఆర్‌టి-పిసిఆర్ ప‌రీక్షలో వ‌చ్చిన‌ పాజిటివ్ శాంపుల్ నుంచి క‌నుగొన్నారు.  ఈ శాంపుల్ 18 న‌వంబ‌ర్ 2023న ఆర్‌టి-పిసిఆర్ పాజిటివ్‌గా ప‌రీక్ష‌లో తేలింది.  కోవిడ్‌-19 నుంచి కోలుకున్న‌రోగికి ఇన్ఫ్లూయెంజా లైక్ ఇల్‌నెస్‌(ఐఎల్ఎ)కి సంబంధించిన తేలికపాటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.
గ‌త కొద్దివారాలుగా కేర‌ళ రాష్ట్రంలో కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న‌స‌ర‌ళి క‌నిపించింది. ప‌రీక్ష‌కు పంపుతున్న ఐఎల్ఐ కేసుల శాంపుళ్ళ సంఖ్య పెర‌గుతుండ‌డ‌మే దీనికి తార్కాణంగా భావిస్తున్నారు. మెజారిటీ కేసులు వైద్య‌ప‌రంగా తేలిక‌పాటివి, ఎటువంటి చికిత్స లేకుండానే త‌మ ఇళ్ళ వ‌ద్దే కోలుకుంటున్న‌వారికి సంబంధించిన‌వి. 
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సాధార‌ణ కార్య‌క‌లాపాల‌లో భాగంగా, ప్ర‌జా ఆరోగ్యం, అందుకు ఆసుప‌త్రుల సంసిద్ధ‌త‌ను అంచ‌నా వేసేందుకు రాష్ట్రాల‌లో అన్ని ఆరోగ్య‌కేంద్రాల‌లో మాక్ డ్రిల్ నిర్వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 13న ప్రారంభ‌మైన ఈ కార్య‌క‌లాపం, జిల్లా క‌లెక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో కొన‌సాగుతూ 18 డిసెంబ‌ర్ 2023 నాటికి ప్రారంభం కానుంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేర‌ళ  రాష్ట్ర ఆరోగ్య విభాగంతో నిత్యం సంప్ర‌దిస్తూ, వివిధ ప్ర‌వేశ కేంద్రాల‌ను ప‌ర్య‌వేక్షిస్తోంది. 

 

***
 


(Release ID: 1987375) Visitor Counter : 90