గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లు
Posted On:
14 DEC 2023 3:55PM by PIB Hyderabad
భూమి, కాలనైజేషన్ అంశాలు రాష్ట్రాల పరిధిలోని అంశాలు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర గ్రుహ, పట్టణ వ్వవహరాల మంత్రిత్వశాఖ నిర్వహించదు. అయితే ఇళ్ల కొనుగోలు దారుల ప్రయోజనాలను రక్షించడానికి, రియల్ ఎస్టేట్ రంగంలో జవాబుదారిత్వం, పారదర్శకత పాటించడానికి, రియల్ ఎస్టేట్ ( రెగ్యులేషన్, డవలప్ మెంట్ )చట్టం 2016 (ఆర్.ఇ.ఆర్.ఎ)ను పార్లమెంటు తీసుకువచ్చింది. ఆర్.ఇ.ఆర్.ఎలోని ప్రొవిజన్ల ప్రకారం, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను సంబంధిత రాష్ట్రం, లేదా కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ వద్ద రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. రెరా కింద ఏదైనా సంస్థ విఫలమైనా, లేదా రిజిస్ట్రేషన్ తొలగింపు జరిగినా సంబంధిత ప్రభుత్వంతో సంప్రందించి రెగ్యులేటరీ అథారిటీ , మిగిలిపోయిన అభివ్రుద్ధి పనులను, కాంపిటెంట్ అథారిటీ తేదా ఇళ్ల కేటాయింపు పొందిన వారితో లేదా ఇతర పద్ధతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు రెరాకు అధికారం ఉంది.
ఇళ్లు బుక్ చేసుకున్న తర్వాత నిలిచిపోయిన ఆయా ప్రాజెక్టులకు సంబంధించి, ఇళ్ల కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించేందుకు, ప్రభుత్వం ప్రత్యేక విండో ను ఏర్పాటు చేసింది. చౌక అయిన , మధ్య ఆదాయ ఇళ్ల నిర్మాణానికి (ఎస్.డబ్ల్యు.ఎ.ఎం.ఐ.హెచ్ పెట్టుబడి ఫండ్) అవసరమైన ఫండ్ తో ఒక ఫండ్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిరర్ధక ఆస్తుల కింద (ఎన్.పి.ఎలు) ప్రకటించినప్రాజెక్టులు లేదా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ ఎదుట ఇన్ సాల్వెన్సీ, దివాలా కోడ్ కింద పెండింగ్ లో ఉన్న వాటికి కూడా ఇది వర్తిస్తుంది. 2023 నవంబర్ 16 వ తేదీ నాటికి ఎస్.డబ్ల్యుఎఎంఐహెచ్ పథకం కింద సుమారురూ 37,554 కోట్ల రూపాయల విలువగల 342 ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. దీనివల్ల 2,18,699 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుంది. దీనితో రూ 94,367 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులు ముందుకు సాగనున్నాయి.
దీనికి తోడు, కేంద్ర ప్రభుత్వం జి20 షేర్పా శ్రీ అమితాబ్ కాంత్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ, నిలిచిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకుసంబంధించిన అంశాలను పరిశీలించింది. ఈ కమిటీ తన నివేదికను 2023 జూలైన సమర్పించింది. ఇందుకు సంబంధించి ఈ సంస్థ పలు సిఫార్సులు చేసింది. నిలిచిపోయిన గ్రుహ నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేసి, వాటిని ఇళ్ల కొనుగోలుదారులకు అప్పగించేందుకు ఈ సూచనలను నిర్దేశించారు. ఆర్ధిక వెసులుబాటు లేకపోవడం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఒత్తిడికి ఒక కారణంగా కమిటీ అభిప్రాయపడింది. అందువల్ల నిలిచిపోయిన ప్రాజెక్టులకు సంబంధించి ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు కమిటీ పలు సూచనలుచేసింది. వీటిని సకాలంలో పూర్తి చేసేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఈ కమిటీ నివేదికను రాష్ట్రాలకు, సంబంధిత స్టేక్ హోల్డర్లకు పంపడం తోపాటు దీనిని , మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో కూడా అప్ లోడ్ చేశారు. ఈ సమాచారాన్ని కేంద్ర గ్రుహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ కౌశల్ కిషోర్, లోక్ సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.
(Release ID: 1987307)