ప్రధాన మంత్రి కార్యాలయం
డిసెంబరు 16న వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధాని సంభాషణ
ఐదు రాష్ట్రాల్లో సంకల్ప యాత్రను జండా ఊపి ప్రారంభించనున్న ప్రధానమంత్రి;
దేశం నలుమూలల నుంచి వేలాదిగా పాల్గొనున్న లబ్ధిదారులు
Posted On:
15 DEC 2023 7:40PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2023 డిసెంబర్ 16న సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో సంభాషిస్తారు. అనంతరం ఆయన వారినుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో వికసిత భారతం సంకల్ప యాత్రను ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు.
దేశం నలుమూలల నుంచి వేలాది వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా పెద్ద సంఖ్యలో భాగస్వాములవుతారు. కేంద్ర ప్రభుత్వ కీలక పథకాల ప్రయోజనాలను ప్రజలందరికీ సకాలంలో అందించడం ద్వారా వాటి అమలులో సంతృప్త స్థాయి సాధన లక్ష్యంతో దేశవ్యాప్తంగా వికసిత భారతం సంకల్ప యాత్ర చేపట్టబడుతోంది.
****
(Release ID: 1987000)
Visitor Counter : 137
Read this release in:
Kannada
,
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Gujarati
,
Odia
,
Malayalam