రక్షణ మంత్రిత్వ శాఖ
'డేర్ టు డ్రీమ్' పథకం
Posted On:
15 DEC 2023 3:03PM by PIB Hyderabad
డేర్ టు డ్రీమ్ (డీ2డీ) పోటీల కోసం గత మూడు సంవత్సరాల్లో వచ్చిన దరఖాస్తుల వివరాలు:
క్రమసంఖ్య
|
డేర్ టు డ్రీమ్ (డీ2డీ) పోటీ
|
పోటీ జరిగిన సంవత్సరం
|
స్వీకరించిన దరఖాస్తు సంఖ్య
|
1.
|
డేర్ టు డ్రీమ్-1
|
2019
|
3080
|
2.
|
డేర్ టు డ్రీమ్-2
|
2020
|
1750
|
3.
|
డేర్ టు డ్రీమ్-3
|
2021
|
819
|
4.
|
డేర్ టు డ్రీమ్-4
|
2023
|
792
|
డేర్ టు డ్రీమ్ (డీ2డీ) 1.0 (2019), డీ2డీ 2.0 (2020), డీ2డీ 3.0 (2021) విజయవంతంగా జరిగాయి. వీటి ద్వారా 5,600 పైగా దరఖాస్తులు వచ్చాయి, వాటిలో 86 సాంకేతికతలు/ఆలోచనలకు గుర్తింపు లభించింది. వీటి ఆవిష్కర్తలు, అంకుర సంస్థలకు రూ.3.97 కోట్ల విలువైన నగదు బహుమతి అందించారు. ఉత్తమ ఆలోచనలకు 'సాంకేతికత అభివృద్ధి నిధి' (టీడీఎప్) పథకం ద్వారా డీఆర్‌డీవో మద్దతు ఇస్తుంది. అంకుర సంస్థ విభాగంలో, డేర్ టు డ్రీమ్ విజేతలకు టీడీఎఫ్ పథకం కింద రూ.6.93 కోట్ల మొత్తాన్ని 8 ప్రాజెక్టులకు అందించింది.
ఆవిష్కర్తలు (18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు), అంకుర సంస్థలు (భారతీయ పౌరుడు స్థాపించిన, పరిశ్రమ & అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగంలో నమోదైనవి) డీ2డీ పోటీలో పాల్గొనడానికి అర్హులు. ఈ పోటీ కింద స్వీకరించిన దరఖాస్తులను రెండు దశల్లో మూల్యాంకనం చేస్తారు:
డైరెక్టర్ జనరల్ (సంబంధిత సాంకేతికత క్లస్టర్) నేతృత్వంలోని నిపుణుల కమిటీ ద్వారా తొలి దశలో మూల్యాంకనం జరుగుతుంది.
రెండో దశలో, స్వతంత్ర నిపుణుల కమిటీ పరిశీలించి ర్యాంకులు ఇస్తుంది. కొత్తదనం, అనుకూలత, అమలు, సాంకేతికత వంటి అంశాల ఆధారంగా ఈ దశలో ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు.
డీ2డీ విజేతలకు వ్యక్తిగత & అంకుర సంస్థల విభాగాల్లో నగదు బహుమతి అందిస్తారు. మెరిట్, సాధ్యాసాధ్యాల ఆధారంగా టీడీఎఫ్ పథకం కింద నిధులు కేటాయించి విజేతలను ప్రోత్సహిస్తారు, తదుపరి మార్గదర్శకత్వం అందిస్తారు.
రక్షణ శాఖ సహాయ శ్రీ అజయ్ భట్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1986983)
Visitor Counter : 128