అంతరిక్ష విభాగం
గణనీయంగా పెరిగిన అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అంకుర సంస్థల సంఖ్య
2014లో కేవలం 1 గా ఉన్న అంకుర సంస్థల సంఖ్య 2023 నాటికి 189 కి పెరిగింది.. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
భారత అంతరిక్ష రంగంలో పెట్టుబడులు 124.7 మిలియన్ డాలర్లకు పెరిగింది .... డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
Posted On:
14 DEC 2023 6:25PM by PIB Hyderabad
అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అంకుర సంస్థల సంఖ్య గణనీయంగా పెరిగిందని కేంద్ర కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) పీఎంవో, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. డీపీఐఐటీ స్టార్టప్ ఇండియా పోర్టల్ ప్రకారం అంతరిక్ష రంగంలో 2014 లో కేవలం 1 మాత్రమే అని ఆయన చెప్పారు 2014 నాటికి అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న అంకుర సంస్థల సంఖ్య నాటికి 189 కి పెరిగిందని కేంద్ర మంత్రి వివరించారు. తెలిపారు.భారత అంతరిక్ష రంగంలో పెట్టుబడులు 124.7 మిలియన్ డాలర్లకు పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి ఈ వివరాలు తెలిపారు.
అంతరిక్ష కార్యకలాపాల అన్ని రంగాల్లో ప్రభుత్వేతర సంస్థలు పాల్గొనేలా వేళ్ళు కల్పించే విధంగా 2923లో కేంద్ర ప్రభుత్వం భారత అంతరిక్ష విధానం 2023 ని ప్రకటించిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విధానం వల్ల ప్రభుత్వేతర సంస్థలకు అన్ని కార్యక్రలాపాల్లో భాగస్వామ్యం కల్పించిందన్నారు. అంతరిక్ష రంగంలో ప్రోత్సాహకాలు అందించి , అమలు చేసిన సంస్కరణల వల్ల అంతరిక్ష రంగం అభివృద్ధి పధంలో పయనిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతరిక్ష రంగంపై కప్పించినా సానుకూల ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి :
* కొన్ని ప్రభుత్వేతర సంస్థలు సొంతంగా ఉపగ్రహాలను ప్రయోగించాయి. అనేక ఇతర అంతరిక్ష పరిశ్రమలు అంకుర సంస్థలు కూడా తమ స్వంత ఉపగ్రహాలు ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. . ఈ ఉపగ్రహాలు వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ మొదలైన రంగాలకు సేవలు అందిస్తాయి.
* ఒక ప్రభుత్వేతర సంస్థ సబ్ ఆర్బిటాల్ లాంచ్ వెహికల్ ని ప్రయోగించింది.
* ఇస్రో క్యాంపస్ లో తొలిసారిగా ప్రభుత్వేతర సంస్థ ఏర్పాటు చేసిన ప్రైవేట్ లాంచ్ ప్యాడ్, మిషన్ కంట్రోల్ సెంటర్ ద్వారా సబ్ ఆర్బిటాల్ ప్రయోగం త్వరలో జరగనుంది.
* శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ పరిష్కారాల కోసం ప్రైవేటు సంస్థలు అన్వేషిస్తున్నాయి. అంతరిక్ష ఆధారిత అనువర్తనాలు, సేవలలో ప్రైవేట్ సంస్థలు ఎక్కువగా పాల్గొంటున్నాయి.
*ప్రైవేటు రంగంలో శాటిలైట్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్ సౌకర్యాలు వస్తున్నాయి.
* శాటిలైట్ సబ్ సిస్టమ్స్, గ్రౌండ్ సిస్టమ్స్ స్థానిక తయారీని ప్రైవేటు రంగం చేపడుతోంది.
* భారతదేశానికి చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థలు అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలు, కంపెనీలతో కలిసి పనిచేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.
ఉపగ్రహాల తయారీ, లాంచ్ వెహికల్ అభివృద్ధి , శాటిలైట్ సేవలను అందించడం, గ్రౌండ్ సిస్టమ్స్ తయారీలో ప్రైవేట్ రంగం స్వతంత్రంగా ఎండ్-టు-ఎండ్ పరిష్కారాన్ని తీసుకుంటుందని భావిస్తున్నారు.
***
(Release ID: 1986538)
Visitor Counter : 144