సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అన్ని వ్యవసాయ మరియు ఆరోగ్య ప్రయోజనాల పథకాలలో జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ జిల్లా గరిష్ట సంతృప్తతను సాధించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
Posted On:
10 DEC 2023 5:25PM by PIB Hyderabad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ మరియు ఆరోగ్య ప్రయోజనాల పథకాలన్నింటిలో జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా గరిష్ట సంతృప్తతను సాధించింది.
తన లోక్‌సభ నియోజకవర్గమైన ఉదంపూర్- కతువా-దోడాలో వివిధ ప్రజా సంక్షేమ కేంద్ర పథకాల అమలును సమీక్షించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఉధంపూర్ జిల్లా మిగతా ప్రాంతాలకంటే ఎల్లప్పుడూ ముందుంటోందన్నారు.
వివిధ వ్యవసాయ రంగ పథకాలలో, 51,035 మంది రైతులకు రూ. 6,000 వార్షిక మద్దతును అందించడం ద్వారా జిల్లా ఉధమ్‌పూర్ పీఎం కిసాన్ యోజనలో 100% సంతృప్తతను సాధించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు. అదేవిధంగా, 51,035 మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందించడం ద్వారా 100% సంతృప్తతను సాధించినట్లు ఆయన తెలిపారు.
సాయిల్ హెల్త్ కార్డు విషయానికొస్తే.. ఇక్కడ కూడా 63,880 మంది వ్యవసాయదారులకు కార్డు ప్రయోజనాన్ని అందించడం ద్వారా 100% సంతృప్తతను సాధించడం సంతోషంగా ఉందని మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. 60 ఏళ్లు పైబడిన 10,585 మంది రైతులకు నెలవారీ పెన్షన్ అందించడం ద్వారా ప్రధానమంత్రి మన్ ధన్ యోజన 100% సంతృప్తిని సాధించిందని ఆయన చెప్పారు.
ఆరోగ్యం విషయంలో 4,31,738 మంది లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ బీమా కోసం గోల్డెన్ కార్డ్‌లను అందించడం ద్వారా దాదాపు 100% సంతృప్తతను సాధించామని, ఇది 97.8% కాగా.. లక్ష్యంగా నిర్ణయించుకున్న100% త్వరలో నెరవేరుతుందని భావిస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు వేగవంతమైన మార్గంలో ముందుకు సాగినందుకు ఉధంపూర్ జిల్లా పరిపాలన మరియు సంబంధిత శాఖలన్నింటికి డాక్టర్ జితేంద్ర సింగ్ తన అభినందనలు తెలియజేశారు. కేంద్ర సంక్షేమ పథకాల అమలులో చురుకైన పాత్రతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రతి పంచాయితీలో ప్రజలకు చేరువయ్యారని "మోదీకి గ్యారెంటీ వాలీ గాడి" అని కొనియాడారు.
గత 3 నుండి 4 సంవత్సరాలుగా ఉదంపూర్ సెంట్రల్ పీఎంజీఎస్వై రోడ్ ప్రాజెక్ట్‌ల అమలులో దేశంలోని అన్ని జిల్లాలలో వరుసగా టాప్ ర్యాంక్ లేదా టాప్ 3 ర్యాంక్‌లలో ఒకటిగా కొనసాగుతోంది.
ఉత్తర భారతదేశంలోని మొట్టమొదటి నదీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ "దేవికా", ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, దానిని ప్రారంభించవలసిందిగా తాము ప్రధాని మోడీని కోరతామని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేవిక ప్రాజెక్టును కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని గుర్తు చేశారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. 2014కు ముందు ఈ జిల్లా వివక్షకు గురైందని, ఫలితంగా అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ వనరుల ద్వారా ప్రజలకు ప్రయోజనాలను అందించడంలో కూడా విస్మరించబడిందన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందిందని, ప్రధాని మోదీ ప్రారంభించిన వివిధ పథకాల లబ్ధి ప్రతి ఇంటికి అందుతోందన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉధంపూర్‌లోని సుదూర కొండ ప్రాంతాలలో కూడా రోడ్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేయబడిందని, ప్రజలు ఆటోమొబైల్ లేదా రవాణా వాహనాన్ని చూడని కొన్ని గ్రామాలలో నేడు మోటార్ సైకిల్, కారు, స్కూటర్‌పై తిరుగుతున్నారని అన్నారు. ఆసియాలోనే అతి పొడవైన రహదారి సొరంగాన్ని కూడా ప్రధాని మోదీ ఇక్కడ ప్రారంభించారని, ఇది చెనాని నుండి ప్రారంభమవుతుందని, దీనికి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టారని మంత్రి జితేంద్ర సింగ్ గుర్తుచేశారు.
అదేవిధంగా, ఉధంపూర్ రైల్వే స్టేషన్‌ను విస్తరించామని, అమరవీరుడు కెప్టెన్ తుషార్ మహాజన్ పేరు పెట్టబడిన దేశంలోని మొట్టమొదటి రైల్వే స్టేషన్ ఇదేనని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కాశ్మీర్ లోయ త్వరలో దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు ద్వారా అనుసంధానించబడుతుందని, ఉత్తర భారతదేశంలోనే ఉధంపూర్ అత్యంత ముఖ్యమైన రైల్వే జంక్షన్‌గా ఆవిర్భవించనుందన్నారు. ఉధంపూర్‌లో రైల్వే ప్రధాన కార్యాలయం ఏర్పాటుతోపాటు దీనిని పూర్తి స్థాయి డివిజన్ చేయాలని తాము ఇప్పటికే డిమాండ్ చేశామని ఆయన అన్నారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ ఉధంపూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల గురించి కూడా ప్రస్తావించారు., దీనిని మోదీ ప్రభుత్వం కేంద్ర నిధుల నుండి కేటాయించిందని, ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కేంద్ర నిధులతో నిర్మించిన మూడు వైద్య కళాశాలలలో ఇది ఒకటన్నారు. ఇది బహుశా మూడు వైద్యకళాశాలలున్న ఏకైక నియోజకవర్గం ఉధంపూర్ మాత్రమేనన్నారు. ఒకే టర్మ్‌లో మెడికల్ కాలేజీలకు నిధులు సమకూర్చినట్లు చెప్పారు.
ఉధంపూర్ జిల్లాకే ప్రత్యేకమైన ‘కలరి’ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు సమీప భవిష్యత్తులో "కలరి ఫుడ్ ఫెస్టివల్"ని నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిపాలన అధికారులను కోరినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.
***
(Release ID: 1986537)
Visitor Counter : 78