ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఐసిఎంఆర్- ఎన్ఐఎంఆర్ లో నూతన అత్యాధునిక సౌకర్యాలు ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
" జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్- పరిశోధన, ఆవిష్కరణలు బలమైన ఆరోగ్య పరిశోధన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసి దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు సిద్ధం చేస్తాయి.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ
" స్వావలంబన సాధించేందుకు 'జై అనుసంధాన్' చాలా ముఖ్యమైన విధానఁగా ఉంటుంది".. డాక్టర్ మాండవీయ
" కోవిడ్-19 సమయంలో "భారతదేశం 110 దేశాలకు వ్యాక్సిన్‌లు, డయాగ్నస్టిక్ కిట్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఆరోగ్య సంరక్షణకు సంఘీభావం ప్రకటించింది".. డాక్టర్ మాండవీయ
" ఐసిఎంఆర్- ఎన్ఐఎంఆర్ లో కల్పించిన మౌలిక సదుపాయాలు 2030 నాటికి దేశంలో మలేరియా నిర్మూలన కోసం రుగుతున్న ప్రయత్నాలకు బలం చేకూరుస్తాయి".. డాక్టర్ మాండవీయ
Posted On:
14 DEC 2023 2:55PM by PIB Hyderabad
“జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ - పరిశోధన , ఆవిష్కరణలు ఒక బలమైన ఆరోగ్య పరిశోధన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడడానికి డబల్ ఇంజిన్‌లుగా ఉంటాయి. స్వావలంబన సాధించేందుకు భారతదేశం సాగిస్తున్న కృషిలో జై అనుసంధాన్ కీలక విధానంగా ఉంటుంది" అని కేంద్ర ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. . ఈరోజు ఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (ఐసిఎంఆర్- ఎన్ఐఎంఆర్ )లో నూతనంగా కల్పించిన ఐదు కొత్త సౌకర్యాలను డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించారు. డాక్టర్ మాండవీయ ప్రారంభించిన సౌకర్యాలలో టెస్ట్ రీసెర్చ్ లాబొరేటరీ, ఇన్నోవేషన్ కాంప్లెక్స్, కాన్ఫరెన్స్ హాల్ కాంప్లెక్స్ 300-సీట్ల ఆడిటోరియం ఉన్నాయి. ప్రారంభ కార్యక్రమంలో డాక్టర్ మాండవీయ తో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు ప్రొఫెసర్ ఎస్‌పి సింగ్ బఘేల్, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాండవ్య మాట్లాడుతూ, "ఈ ప్రారంభోత్సవం ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ఒక నిదర్శనం"అని అన్నారు. “గత నాలుగు దశాబ్దాలుగా ఈ కేంద్రాలు అభివృద్ధి చెందుతున్న, కొత్తగా వ్యాపిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్లు, అతిసార రుగ్మతలు, ఎయిడ్స్ , క్షయ, రక్తపోటు, మధుమేహం, జూనోటిక్ వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో సహా అనేక రంగాలలో ముఖ్యమైన పరిశోధనలను నిర్వహించాయి. ఇవి కేవలం భవనాలు మాత్రమే కాదు. ఆరోగ్య రంగంలో స్వావలంబన సాధించేందుకు కృషి చేస్తున్న ఆరోగ్య దేవాలయాలు” అని ఆయన వ్యాఖ్యానించారు.
"భారత ఆరోగ్య రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది" అని డాక్టర్ మాండవీయ అన్నారు. . “జై అనుసంధన్” ప్రాముఖ్యతను వివరించిన మంత్రి " సాధారణ పరిస్థితుల్లో కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ పొందడానికి నెలల సమయం పట్టి ఉండేది. అయితే, దేశంలోనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ప్రపంచానికి చౌక ధరలో నాణ్యమైన వ్యాక్సిన్‌ను అందించాము. అదేవిధంగా ఇంతకుముందు హైడ్రాక్సీ-యూరియా వంటి అరుదైన వ్యాధులకు 14-15 మందులు అందుబాటులో ఉన్నాయి, గతంలో వీటి ధర పదివేల రూపాయల వరకు ఉండేది. . నేడు, ఈ మందులు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. అతి తక్కు ధరకు మందులు లభిస్తున్నాయి" అని డాక్టర్ మాండవీయ అన్నారు.
దేశాభివృద్ధిలో ఆరోగ్య రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపిన డాక్టర్ మాండవీయ ఈ రంగంలో ప్రతిరోజూ కొత్త పరిశోధన, అభివృద్ధి ,ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి అని అన్నారు. ఈ రోజు ప్రారంభించిన సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉన్నాయని మంత్రి తెలిపారు. ప్రపంచ అభివృద్ధితో భారతదేశం పోటీ పడటానికి సిద్ధంగా ఉందన్నారు. భారతదేశం ప్రపంచానికి ధీటుగా ఉండేందుకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఐసిఎంఆర్ వంటి సంస్థలు పటిష్టంగా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని పొందాయని మంత్రి అన్నారు.
ఆరోగ్యం , శాస్త్రీయ ఆధారిత చికిత్స రంగంలో భారతదేశాన్ని ముందంజలోఉంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు అమలు చేస్తుంది అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు. కోవిడ్ వంటి వ్యాధులతో పోరాడటానికి అధిక-నాణ్యత ప్రయోగశాలల అవసరాన్నికేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఆరోగ్య రంగంలో కొత్త ఆలోచనలు, కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు నవ భారత కల సాకారం అయ్యేలా కృషి చేయాలన ఆయన కోరారు.
ఐసిఎంఆర్ సాధించిన ప్రగతిని ప్రశంసించిన మంత్రి దేశ వైద్య పరిశోధన రంగంలో సంస్థ కీలక పాత్ర పోషించిందని అన్నారు.' ఐసిఎంఆర్ సహకారంతో భారతదేశం 110 దేశాలకు కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు, డయాగ్నస్టిక్ కిట్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలను (PPE) అందించింది. ఇది ప్రపంచ ఆరోగ్యం, సంఘీభావం పట్ల దేశం నిబద్ధతను ప్రతిబింబిస్తుంది" అని ఆయన తెలియజేశారు.
మలేరియాను ఎదుర్కోవడంలో భారతదేశం పరిశోధనలకు మార్గదర్శకత్వం వహించిన ఐసిఎంఆర్- ఎన్ఐఎంఆర్ లను డాక్టర్ మాండవీయ ప్రశంసించారు. "సంస్థ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం 2030 నాటికి దేశంలో మలేరియా నిర్మూలన కు ఒక అడుగు" అని ఆయన అన్నారు. మలేరియాను నిర్మూలించడంపైనే కాకుండా డెంగ్యూ, జపనీస్ ఎన్సెఫాలిటిస్, చికున్‌గున్యా, ఫైలేరియాసిస్ వంటి ఇతర వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులను కూడా నిర్మూలించడం పై సమిష్టి కృషి చేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ఆరోగ్య సంరక్షణలో డిజిటల్ హెల్త్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతికతల ఏకీకరణపై కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రస్తావించారు. . వ్యాక్సిన్, ఔషదాల సరఫరా కోసం డ్రోన్‌లను వినూత్నంగా ఉపయోగించడం, డ్రోన్‌ల ద్వారా అవయవాలను రవాణా చేయడం లాంటి అంశాలు ఆరోగ్య రంగంలో సాధించిన విజయాలకు నిదర్శనంగా నిలుస్తాయని డాక్టర్ మాండవీయ అన్నారు.
భవిష్యత్తులో ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడంలో మానవ, జంతువు పర్యావరణ ఆరోగ్యం యొక్క పరస్పర సంబంధాన్ని గుర్తిస్తూ 'వన్ హెల్త్' విధానం అమలు జరుగుతుందని మంత్రి అన్నారు. 
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహ్ల్, ఐసిఎంఆర్- ఎన్ఐఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ అనూప్ అన్వికర్ , కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
****
(Release ID: 1986509)
Visitor Counter : 84