బొగ్గు మంత్రిత్వ శాఖ
10 డిసెంబర్ 2023 నాటికి, లక్ష్యాన్ని అధిగమించి రూ.34,524 కోట్లకు చేరుకున్న బొగ్గు మంత్రిత్వ శాఖ & సీపీఎస్‌ఈల జెమ్ సేకరణలు
జెమ్ ద్వారా కొనుగోళ్లలో ముందున్న కోల్ ఇండియా లిమిటెడ్ & అనుబంధ సంస్థలు
Posted On:
14 DEC 2023 4:33PM by PIB Hyderabad
2023-24 ఆర్థిక సంవత్సరంలో, బొగ్గు మంత్రిత్వ శాఖ & తన ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థలతో (పీఎస్‌యూలు) కలిసి, ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జెమ్) ద్వారా కొనుగోళ్లలో అత్యుత్తమంగా నిలిచింది. సమర్థవంతమైన, పారదర్శక సేకరణ పద్ధతుల ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడం బొగ్గు మంత్రిత్వ శాఖ నిబద్ధతకు నిదర్శనం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో, డిసెంబర్ 10, 2023 నాటికి, మంత్రిత్వ శాఖ & దాని సీపీఎస్‌ఈల ద్వారా జెమ్ నుంచి సేకరణలు రూ.34,524 కోట్లకు చేరుకుంది. రూ.21,325 కోట్ల సేకరణల లక్ష్యాన్ని ఇది 162% పెరుగుదలతో అధిగమించింది.
జెమ్ ద్వారా చేపట్టిన కొనుగోళ్లలో, దేశంలోని అన్ని సీపీఎస్‌ఈల్లో కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు ముందున్నాయని జెమ్ అధికారులు తెలిపారు. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు జెమ్ ద్వారా చేపట్టిన మొత్తం సేకరణల్లో బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బొగ్గు మంత్రిత్వ శాఖ 1వ స్థానానికి చేరుకోవచ్చని అంచనా.
కొనుగోలు ప్రక్రియలను క్రమబద్ధీకరించడం, డిజిటల్ పరిష్కారాలను స్వీకరించడం, దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడటంలో మంత్రిత్వ శాఖ అంకితభావానికి ఇది నిదర్శనం. బొగ్గు మంత్రిత్వ శాఖ, తన సమర్థవంతమైన నిర్వహణలో కొలమానాలను సృష్టిస్తూనే ఉంది.
****
(Release ID: 1986497)
Visitor Counter : 81