పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశంలో డ్రోన్ల తయారీ, కార్యకలాపాలను సులభతరం చేసేందుకు చేపట్టిన సంస్కరణ చర్యలు
భారత గగన తలంలో 400 అడుగుల ఎత్తువరకు డ్రోన్‌ను ఎగురవేసేందుకు దాదాపు 90% గ్రీన్‌జోన్ గా గుర్తింపు
Posted On:
14 DEC 2023 1:36PM by PIB Hyderabad
దేశంలో డ్రోన్ల తయారీ, కార్యకలాపాలకు సౌలభ్యం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం అనేక సంస్కరణ చర్యలను తీసుకుంది. అవిః
1) సరళీకృతం చేసిన డ్రోన్ నిబంధనలు, 2021ని ఆగస్టు 25, 2021న నోటిఫై చేయడం జరిగింది.
2) డ్రోన్ ఎయిర్‌స్పేస్ మ్యాప్‌ను 24 సెప్టెంబర్ 2021న ప్రచురించి, దాదాపు 90% భారత గగన తలంలో 400 అడుగుల ఎత్తువరకు డ్రోన్‌ను ఎగురవేసేందుకు గ్రీన్‌జోన్ గా ప్రకటించింది.
3) డ్రోన్లకు, డ్రోన్ భాగాల కోసం 30 సెప్టెంబర్ 2021న డ్రోన్లకు ఉత్పత్తి లంకె కలిగిన ప్రోత్సాహకాలు (పిఎల్ఐ) పథకాన్ని నోటిఫై చేసింది.
4) యుఎఎస్ ట్రాఫిక్ నిర్వహణ (యుటిఎం) విధాన చట్రాన్ని 24 అక్టోబర్ 2021న ప్రచురించింది.
5) వ్యవసాయ డ్రోన్ల కొనుగోలు కోసం ద్రవ్యమంజూరు కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ 22 జనవరి 2022న ప్రకటించింది.
6) డ్రోన్ నిబంధనలు, 2021 కింద అన్ని దరఖాస్తులను 26 జనవరి 2022న డిజిటల్ స్కై ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఆన్‌లైన్ చేశారు.
7) డ్రోన్ సర్టిఫికేషన్ పథకాన్ని 26 జనవరి 2022న నోటిఫై చేశారు.
8) కేంద్ర బడ్జెట్ లో భాగంగా డ్రోన్ స్టార్టప్‌లకు తోడ్పాటును ఇచ్చేందుకు మిషన్ డ్రోన్ శక్తిని, డ్రోన్‌ను ఒక సేవ (డిఆర్ఎఎఎస్)ను ప్రోత్సహించడాన్ని 1 ఫిబ్రవరి 2022న ప్రకటించింది.
9) విదేశీ డ్రోన్ల దిగుమతిని నిషేధిస్తూ, డ్రోన్ విడిభాగాల దిగుమతికి అనుమతిస్తూ డ్రోన్ దిగుమతి విధానాన్ని 9 ఫిబ్రవరి 2022న నోటిఫై చేసింది.
10) డ్రోన్ పైలట్ లైసెన్స్ అవసరాన్ని రద్దు చేస్తూ డ్రోన్ (సవరణ) నిబంధనలు, 2022ను 11 ఫిబ్రవరి 2022న నోటిఫై చేసింది. ప్రస్తుతం డిజిసిఎ- అధీకృత రీమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఆర్‌పిటిఒ) ద్వారా రీమోట్ పైలట్ సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఇది రిమోట్ పైలట్ డ్రోన్లను నిర్వహించేందుకు సరిపోతుంది.
11) 27 సెప్టెంబర్ 2023న నోటిఫై చేసిన డ్రోన్ (సవరణ) నిబంధనలు, 2023 ప్రకారం దరఖాస్తుదారు వద్ద భారతీయ పాస్‌పోర్ట్ అందుబాటులో లేని పక్షంలో రీమోట్ పైలెట్ సర్టిఫికెట్ (ఆర్‌పిసి) జారీ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాటును అందిస్తున్నారు. ఇప్పుడు ఆర్‌పిసి జారీ కోసం ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్‌లు ప్రభుత్వం జారీ చేసిన అడ్రెస్ ప్రూఫ్, గుర్తింపుగా సరిపోతుంది.
ఈ సమాచారాన్ని రాష్ట్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వికె సింగ్ (రిటైర్డ్) గురువారం లోక్‌సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
****
(Release ID: 1986356)
Visitor Counter : 86